Publish Date:Jul 13, 2025
గణేశ్ సినిమాలో.. ఫేమస్ డైలాగ్. నేను బతకాలి తమ్మీ అంటూ ఆయన చెప్పిన డైలాగులకు అప్పట్లో యమ క్రేజుండేది. ఆపై గాయంలో ఆయన ఖండిస్తున్న అనే డైలాగ్ కూడా చాలా చాలా ఫేమస్ అయ్యింది. ఇక ఆమె సినిమాలో కోట నట విశ్వరూపం మామూలుది కాదు.ఇలా చెప్పుకుంటూ పోతే సీరియస్ కామెడీ తేడా లేకుండా ఆయా పాత్రలను అవలీలలగా పోషించిన కొందరంటే కొందరు నటులలో కోట నటనకు పెట్టిన కోటే.. నిజంగా. సాధారణంగా సినిమా రూట్ మ్యాప్ ఎలా ఉండేదంటే.. ఏదైనా ఎల్ఐసీ, జర్నలిజం, టీచింగ్, బ్యాంకు వంటి రంగాల్లో జాబ్ చేస్తూ.. ఆపై నాటకాలు ఆడుతూ.. అటు నుంచి సినిమాల్లో అవకాశాలు అంది పుచ్చుకుంటూ ఫైనల్ గా ఇక్కడ సెటిలవడం.
ఈ విషయంలో ఇప్పటికీ చాలా మంది కప్పదాట్లు దాటుతూ ఉంటారు. వారికంటూ అంత తేలిగ్గా ఫీల్డ్ లో బిజీ కావడం సాధ్యమయ్యే పని కాదు. కానీ కోట అలాక్కాదు. బ్యాంకు జాబు అదీ ఇదీ మొత్తం కట్టకట్టి.. అటక మీద పడేసి.. ఎంచక్కా సినిమా ఫీల్డ్ లో సెటిలై పోయారాయన.ఒక సమయంలో ఆయన బాబూ మోహన్ తో చేసిన మామగారు తరహా కామెడీకి అతి పెద్ద ఫ్యాన్ బేస్ ఉండేది. ఆ తర్వాత ఆయన సీరియస్ యాక్టింగ్ స్కిల్స్ కి సౌత్ లో చాలా సినిమాల్లో యాక్టింగ్ ఛాన్సులు వచ్చాయి.
ప్రకాష్ రాజ్ లా ఆయన జాతీయ ఉత్తమ నటుడు సాధించలేక పోయాడు కనీ.. ఇంచు మించు అలాంటి వర్సటైల్ లక్షణాలు పుష్కలంగా ఉన్న నటుడు కోటా శ్రీనివాసరావు.ఎక్కడో బ్యాంకుల్లో ఉద్యోగం చేసుకుంటూ నాటకాలాడి.. ఆ నాటకాల ప్రస్తానం కొద్దీ సినిమాల్లోకి అడుగు పెట్టి.. అంచెలంచెలుగా నటుడిగా ఎన్నో ఎత్తులకు ఎదిగి ఒక సమయంలో.. బీజేపీ నుంచి ఎమ్మెల్యేగానూ గెలిచి.. రాజకీయంగానూ తన ప్రస్తానం కొనసాగించి.. చివరికిదిగో ఇలా తన జీవితానికే టాటా చెప్పి వెళ్లిపోయారు కోట.
ఆయన తన నట జీవితంలో అన్ని కోరికలూ తీర్చుకుని వెళ్లారు. కానీ.. తన కొడుకు అర్ధాంతర మరణంతో తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనయ్యారు. ఇటు తనతో పాటు ఎన్నో చిత్రాల్లో కలసి నటించిన బాబూ మోహన్ కి, తనకి ఇద్దరీ ఒకటే తరహా పుత్ర శోకం కలడం అత్యంత విషాద కరం.ఏది ఏమైనా కోట మృతి టాలీవుడ్ కి తీరని లోటు. కారణమేంటంటే.. ఆయనలాంటి పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించడానికి ఆయనే మరోమారు నటకోటావతారం ఎత్తాల్సిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kota-srinivasa-rao-39-201910.html
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ తగిలి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కోలుకుని ఆయన మండలికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాదరంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడలు బండ్లు అవుతాయి. బండ్లే ఓడలవుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవసరం తీరిపోయిన తర్వాత విసిరేసిన తెడ్డే.. చివరికి పడవ బోల్తా పడ్డప్పుడు దిక్కవుతుంది. అన్నదానికి జగన్ అపరిపక్వంతో కూడుకున్న రాజకీయ విధానాలే ఉదాహరణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జరుగుతుందో పవన్ కల్యాణ్ విడమరచి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్ జారీ చేయగానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయకుడు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ తర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం నరేందర్ రెడ్డి.. నేడు ఆయన రాజకీయ సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్దల సభలోకి సగర్వంగా అడుగు పెడుతున్నారు.
సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయాన్నికేంద్ర హోంమంత్రికి వివరించిన సీఎం రేవంత్.. వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణ, పరిశ్రమల వృద్ధి దృష్ట్యా రాష్ట్రానికి మరిన్ని ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని, తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని కోరారు.
సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ కొనసాగుతున్నది. సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు.
కొద్దికాలం కిందట శరద్ పవార్ తాను రాజ్యసభకు పోటీ చేసే ప్రశక్తే లేదని ప్రకటించారు. అయితే ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరిగింది.