కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?

Publish Date:Aug 20, 2026

Advertisement

తెలంగాణ అధికార కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది అంటే చెప్పలేకపోయినా.. ఏదో జరుగుతోందని మాత్రం అందరికీ అర్ధమౌతోంది. రాష్ట్ర పార్టీలోఅంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ గా నేతలు గళమెత్తుతున్నారు. విమర్శల స్థాయి, ఆరోపణల తీరు ఒకింత తీవ్రంగానే ఉన్నాయి.

 స్వయంగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కళ్లు నెత్తికెక్కాయా అంటూ చేసిన వ్యాఖ్యలు  హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యమంత్రి పదవి దక్కగానే రేవంత్‌కు అహంకారం పెరిగిందని, కళ్ళు నెత్తికెక్కాయా అంటూ ఆమె ఘాటుగా విమర్శించడం, అలాగే సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి సైతం రేవంత్ వనపర్తి టికెట్ తనకు ఇవ్వకుండా అమ్ముకున్నారు అని వ్యాఖ్యానించడం చూస్తుంటే.. పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అసంతృప్తి రగులుతోందనడానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ విషయంలో.. తెలుగువన్  న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన సీనియర్ జర్నలిస్టు వీవీ రావు  మాట్లాడారు.  సుస్మిత పటేల్ కంటే ముందు పార్టీ సీనియర్ నాయకులు చిన్నారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి నేతలు కూడా రేవంత్  ప్రభుత్వ పనితీరు, హామీల అమలుపై బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్నిగుర్తు చేశారు.

తమ నియోజకవర్గాల్లో పనులు కావడం లేదని, మంత్రులు, సలహాదారులు తమను కనీసం లెక్కచేయడం లేదని వారు బాహాటంగా చేసిన వ్యాఖ్యలు విమర్శలు రేవంత్ పై అసంతృప్తి పెచ్చరిల్లుతోందనడానికి నిదర్శనమన్నారు. చిన్నారెడ్డి అయితే.. తనకు వనపర్తి టికెట్ ఇవ్వమని సోనియా గాంధీ స్వయంగా చెప్పినా రేవంత్ ఆ టికెట్ తనకు ఇవ్వకుండా అమ్ముకున్నారని విమర్శించిన విషయాన్నీ,  అలాగే పోచారం శ్రీనివాసరెడ్డి కూడా రేవంత్ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు.  

కాంగ్రెస్‌లో పాత నేతలు వర్సెస్ వలస నేతల మధ్య సాగుతున్న ఈ   సమరం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ అయితే పార్టీలో ఉందని వీవీరావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన తర్వాత ఈ అంతర్గత తిరుగుబాటుపై ఎలా స్పందింస్తారు? ఏం చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉందన్నారు. 

ఇక కాంగ్రెస్ హైకమాండ్ కూడా రేవంత్ తీరు పట్లా, ఆయనపై రాష్ట్ర నేతల్లో వ్యక్తం అవుతున్న అసంతృప్తి పట్లా స్పందించకుండా మౌనంగా ఉండటం చూస్తుంటే.. ముందస్తు ఎన్నికల అంశాన్నీ కొట్టిపారేయలేని పరిస్థితి ఉందని వీవీరావు అన్నారు. 

Konda Sushmitha Comments, Revanth Reddy Konda Sushmitha, Telangana Congress Politics, Pocharam, Chinnareddy 

By
en-us Political News

  
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.