కాంగ్రెస్ కు కొండా సురేఖ గుడ్ బై?.. ఆమె మాటల సారాంశం అదేనా?

Publish Date:Sep 3, 2026

Advertisement

 

తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు మంత్రి కొండా సురేఖ నెక్స్ట్ స్టెప్ ఏమిటన్న దానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇందుకు బుధవారం (సెప్టెంబర్ 2) రోజంతా ఢిల్లీ వేదికగా జరిగిన హై డ్రామాయే కారణం. కొండా సురేఖ వ్యవహారంపై  హస్తినలో బుధవారం (సెప్టెంబర్ 2) కీలక పరిణామాలు జరిగాయి. ఒక వైపు ఇదే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో చర్చించారు. మరో వైపు కొండా సురేఖ కోరినప్పటికీ వారి అప్పాయింట్ మెంట్ ఆమెకు దొరక లేదు. దీనిని బట్టే కొండా సురేఖకు కేబినెట్ నుంచి ఉద్వాసన ఖాయమన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనూ కాకుండా పరిశీలకుల్లో సైతం వ్యక్తమైంది.

అయితే ఈ విషయంలో  కొండా సురేఖ.. హైకమాండ్ నిర్ణయంతో సంబంధం లేకుండా సొంత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పరిశీలకులు విష్లేసిస్తున్నారు. ఇందుకు ఆమె మీడియా ఎదుట చేసిన వ్యాఖ్యలను ఉదాహరణగా చూపుతున్నారు. హస్తిన వేదికగా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఆమె నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనే విమర్శనాస్త్రాలు సంధించారు. అలాగే మంత్రి పొంగులేటి సుధాకరరెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణిలపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్ హైకమాండ్ తీరునూ నిలదీశారు. హైకమాండ్ బీసీలపై ఆరోపణలు వస్తే ఒకలాగా, ఇతరులపై ఆరోపణలు వస్తే మరొకలాగా స్పందిస్తారా అని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ పేరెత్తకుండానే నిలదీశారు. 

ఇక తన భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడుతూ.. పార్టీ తీసుకునే నిర్ణయంపైనే తన కార్యాచరణ అధారపడి ఉంటుందని అన్యాపదేశంగా ఒక వేళ తనను కేబినెట్ నుంచి తొలగిస్తే.. పార్టీకి రాజీనామా చేయడానికి కూడా వెనుకాడనని చెప్పారు.  ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది. ఈ పరిణామం నిస్పందేహంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు ఎదురుదెబ్బగా పరిణమిస్తుందని అంటున్నారు.  చూడాలి మరి కాంగ్రెస్ అధిష్ఠానం ఏం నిర్ణయిస్తుందో.. కొండా సురేఖ ఏ నిర్ణయం తీసుకుంటారో?

[Konda Surekha Goodbye to Congress, Resign, MLA, Warangal East, By Election, Telangana Politics, Telugu One]

By
en-us Political News

  
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.