కోడి కత్తా, కోనసీమ విధ్వంసమా.. విశాఖలో వైసీపీ ప్లాన్ ఏంటి?

Publish Date:Oct 17, 2022

Advertisement

విశాఖపట్నంలో పెద్ద ఎత్తున విధ్వంస కాండకు తెరలేపి.. రైతుల మహాపాదయాత్రను అడ్డుకోవడమే వైసీపీ లక్ష్యంగా కనిపిస్తోంది. అందుకే పవన్ కల్యాణ్  విశాఖ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విశాఖలో కోడి కత్తి డ్రామాను రిపీట్ చేయడమో, కోనసీమ విధ్వంస కాండకు తెరలేపడమో చేయడమే వైసీపీ కుట్రగా కనిపిస్తోందంటున్నారు. 

పవన్ కల్యాణ్ విశాఖపట్నం చేరుకున్న సందర్బంగా  విశాఖ విమానాశ్రయం వద్ద చోటు చేసుకున్న సంఘటనలు, సంభవించిన పరిణామాలూ కోడి కత్తిని గుర్తుకు తెస్తున్నాయి. జనసేనాని విశాఖ వస్తున్న సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు వేల సంఖ్యలో జనసైనికులు విమానాశ్రయానికి చేరుకున్న సమయంలోనే విశాఖ గర్జన ముగించుకుని మంత్రులు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.

మంత్రులు రోజా, జోగి రమేష్, వైసీపీ విశాఖ ఇన్ చార్జ్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తదితరులపై జనసైనికులు దాడి చేశారంటూ పెద్ద సంఖ్యలో జనసేన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలువురిపై 307 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. అయితే ఈ అరెస్టులు, కేసులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  అయితే   పోలీసులు సిసి ఫుటేజ్ ఆధారంగా అరెస్టులు చేయలేదనీ, అలా చేసి ఉంటే.. ఇప్పుడు పోలీసులు అరెస్టు చేసిన వారెవరూ ఆ దాడికి పాల్పడిన వారిలో లేరన్నది ప్రస్ఫుటం  అవుతుందని అంటున్నారు.

అయినా జనసేనానికి ఉన్న జనాభిమానం గురించి తెలిసీ, ఆయనకు పెద్ద సంఖ్యలో అభిమానులు స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వస్తారని తెలిసీ ఎందుకు సరైన భ్రదతా ఏర్పాట్లు ఎందుకు చేయలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. అలాగే మంత్రులు విమానాశ్రయానికి వస్తున్నప్పుడు ప్రొటోకాల్ ప్రకారం ఉండాల్సిన భద్రతా ఏర్పాట్లు కూడా కనిపించలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జరిగిన సంఘటనలు, అందుకు దారి తీసిన పరిస్థితులు గమనిస్తే.. విశాఖలో కోనసీమలో జరిగినట్లుగా పెద్ద ఎత్తున విధ్వంసం జరగాలని జగన్ సర్కార్ కోరుకుంటున్నదా అని అనుమానం కలుగుతోందని పరిశీలకులు అంటున్నారు. మంత్రులపై దాడికి పాల్పడిన వారు వైసీపీ కార్యకర్తలేనని జనసేన ఆరోపిస్తోంది. మరి ఆ దిశగా పోలీసులు ఎందుకు దృష్టి సారించడం లేదన్న ప్రశ్నలు వినవస్తున్నాయి. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో పర్యటించారు.
హైదరాబాద్‌లోని గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో అనూహ్య విమాన ఘటన చోటుచేసుకుంది.
సైబరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు తెలంగాణ పోలీస్ శాఖ కొత్త చర్యలకు సిద్ధమవుతోంది.
ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై హెచ్చరిక చిహ్నాల అమలులో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సర్వం సిద్ధమైంది.
హైదరాబాద్ నగరంలోని రేతిబౌలి ప్రాంతంలో జరిగిన పెళ్లి ఊరేగింపులో కత్తులు చేతబట్టి నృత్యం చేసిన నలుగురు వ్యక్తులను గుడిమల్కాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
సూపర్ ఇంటెలిజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మనిషి సహజ వృద్ధాప్య ప్రక్రియను నియంత్రించగలిగితే, సుమారు 1,400 సంవత్సరాల వరకు జీవించే అవకాశం
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
ప్రపంచ అందాల పోటీల చరిత్రలో కీలక మలుపు చోటు చేసుకుంది.
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు, రేడియల్ రోడ్ల నిర్మాణం, పట్టణాభివృద్ధి పనుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆయా ప్రాజెక్టుల పనుల స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ముంబయిలోని కాలాచౌకి ప్రాంతానికి చెందిన ఉదయ్ పవార్ పట్టుదల, ఆచరణాత్మక ఆలోచనలతో చిన్న స్థాయి సేవను లాభదాయక వ్యాపారంగా తీర్చిదిద్దారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.