సోనియా వ‌ద్ద‌కు కోమ‌టిరెడ్డి రాజీనామా లేఖ‌

Publish Date:Aug 4, 2022

Advertisement

కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖ‌ను గురు వారం (ఆగస్టు 4) పార్టీ అధినేత సోనియాగాంధీకి పంపించారు. ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి రాజీనామా చేస్తున్న ట్లు.. ఆ లేఖలో పేర్కొన్నారు.

అలాగే 8వ తేదీన అపాయింట్‌మెంట్ ఇవ్వాల్సిందిగా రాజగోపాల్ రెడ్డి తెలంగాణ స్పీకర్‌ను కోరారు. తన నియోజకవర్గమైన మునుగోడు  ప్రజలకు మేలు జరుగుతుందనే నమ్మకంతోటే రాజీనామా చేస్తున్నానని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పారు.
 తెలంగాణాలో టీఆర్ ఎస్‌పై కాంగ్రెస్ పార్టీ గ‌ట్టి పోటీ చేయ‌లేద‌ని, టీఆర్ ఎస్ అరాచ‌క పాల‌న పోవాలంటే అది బీజేపీతోనే సాధ్య‌మ‌న్న న‌మ్మ‌కంతోనే కాంగ్రెస్‌కు దూర‌మ‌య్యానని కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. స్పీకర్  అపా యింట్ మెంట్ తీసుకుని రాజీనామా లేఖను ఆయనకు స్వయంగా అందజేస్తానని వెల్లడించారు. 

ఇదిలా ఉండ‌గా, బీజేపీ ప‌క్షాన చేరితే మునుగోడులో ఆ పార్టీ అభ్య‌ర్ధిగా  విజయం సాధిస్తానని  ధీమా వ్యక్తం చేశారు. అయితే అందుకు బీజేపీ   ఆ న‌మ్మ‌కం క‌లిగించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సూచించిన‌ట్లు  తెలు స్తోంది. త‌ప్ప‌కుండా గెల‌వ‌గ‌ల‌న‌ని కేంద్రంలో బీజేపీ నేత‌లు న‌మ్మితే త‌ప్ప‌కుండా  రాజ‌గోపాల్ రెడ్డికి కావ ల‌సిన మ‌ద్ద‌తు ల‌భిస్తుందని బీజేపీ వ‌ర్గాలు పేర్కొన్నాయి.

ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్రమైన దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంపై తాను స్పందించనని,  ఏమైనా ఉంటే రాజగోపాల్‌రెడ్డినే అడగాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి  చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు.  రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

By
en-us Political News

  
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
బంగారం ప్రియులకు ఇది నిజంగానే ఊరటనిచ్చే శుభవార్త అని చెప్పవచ్చు
తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
హానీట్రాప్ ఉచ్చులో పడిన వాయుసేన అధికారి.. షాకింగ్ నిజాలు వెల్లడించిన ఛార్జ్‌షీట్.!
మినీ బస్‌ను ఢీకొన్న ట్రక్కు.. 23 మంది మృతి.!
రాష్ట్రంలో 25 పారిశ్రామిక ఎకోసిస్టమ్ లను అభివృద్ధి చేస్తాం: లోకేష్
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
1999లో ఎయిర్‌పోర్టుల గురించి ఎవరూ పెద్దగా ఆలోచించని సమయంలోనే.. సీఎం చంద్రబాబు నాయుడు శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంపై దృష్టి పెట్టారు.
ఇంట్లో ఆడపిల్ల జన్మిస్తే ఆ ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టేనని పెద్దలు అంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.