ప్రజల కోసం మరోసారి పదవీ త్యాగానికైనా సిద్దం : రాజగోపాల్‌రెడ్డి

Publish Date:Aug 5, 2025

Advertisement

 

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం మరోసారి ఎమ్మెల్యే పదవి రాజీనామాకు సిద్ధమని షాకింగ్ కామెంట్స్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం చిమిర్యాల గ్రామంలో 33/11 కేవి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.  వేల కోట్లు దోచుకునే వాళ్ళకే పెద్ద పదవులు కావాలి. నేను అందరిలాగా పైరవీలు చేసి దోచుకునే వాడిని అయితే కాదని హాట్ కామెంట్స్ చేశారు. 

తనకు మంత్రి పదవి ఇస్తారా? ఇవ్వరా అనేది అధిష్టానం ఇష్టమని ఇంతకంటే దిగజారి బతకలేన్నారు. జూనియర్లకు మంత్రిపదవి ఇచ్చి నన్ను దూరం పెట్టారని  రాజగోపాల్‌రెడ్డి వాపోయారు. పార్టీలు మారిన వాళ్లకు పదవులు ఇచ్చి తనలాంటి సీనియర్‌ను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి కాళ్లు మొక్కి పదవులు తెచ్చుకోదలచుకోలేదన్నారు. మనసు చంపుకొని బతకడం తన వల్ల కాదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 

 పదవి, పైసలు అన్ని వారే తీసుకుపోతున్నారని, కనీసం పదవి లేకున్నా పైసలు మునుగోడుకు రావాలి కదా అని కామెంట్ చేశారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను రాజీపడేది లేదని డిసైడ్ అయ్యానని, మీరు కూడా (ప్రజలు) డిసైడ్ అయ్యారా లేదా అంటూ ప్రశ్నించారు.
 

By
en-us Political News

  
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ఎండిన నదిలో గంగమ్మ పరవళ్లు.. కరువు నేలపై జలకళ.!
చెన్నైలో బీఎస్ఎఫ్ నూతన భవనాలను ప్రారంభించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
ప్రస్తుత కాలంలో డిజిటల్ మాధ్యమాలు విద్య, విజ్ఞానాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తున్నాయి.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఒకింత జోరు తగ్గించిన వంగవీటి రాధా.. ఉన్నట్టుండి జనసేనానిని తో భేటీ అవ్వడం, అదీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేడి రగిలిన సమయంలో కలవడం వెనుక పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఉద్యోగులను ఉత్సాహపరిచేందుకు ఓ యాజమాన్యం అనుసరించిన సరికొత్త మార్గం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోవర్స్, వ్యూయర్స్ సంపాదించాలనే పిచ్చి నేడు ఎంతోమంది యువతను తప్పుదారి పట్టిస్తోంది.
సొంత మేనకోడలు నిశ్చితార్థానికి వైఎస్ జగన్ హాజరుకాకపోవడంపై రాజకీయవర్గాలలోనే కాదు.. సామాన్య జనంలో కూడా చర్చ జరుగుతోంది. గతంలో షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్థానికి జగన్ దంపతులు హాజరైన సంగతిని పలువురు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పింఛనుదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
స్నేహితులే కదా అని నమ్మాడు.. వాళ్లు ఫోన్ చేసి పిలిస్తే ఏదో మాట్లాడుకుందామని ఇంటి నుంచి బయటకు వచ్చాడు. కానీ అదే అతడి చివరి అడుగైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.