Publish Date:Mar 28, 2025
పదిహేను నెలల నిరీక్షణ అనంతరం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కబోతోందన్న టాక్ వినిపిస్తోంది. శాసనసభలో, లాబీల్లోనూ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిని పలు వురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి అభినందనలు తెలుపుతున్నారు. శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన హామీతో రాజగోపాల్‌రెడ్డి తిరిగి సొంత పార్టీకి చేరుకున్నారు. మునుగోడు నుంచి ఆయన విజయం సాధించడంతో పాటు భువనగిరి ఎంపీగా చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని గెలిపించుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అప్పగించిన బాధ్యతను పక్కాగా నిర్వర్తిం చారు. దీంతో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా మంత్రి పదవి ఖాయమన్న భరోసా రాజగోపాల్‌రెడ్డి వర్గీయుల్లో ఉంది. కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైన నేపథ్యంలో తనకు అధిష్టానం ఏ పదవి అప్పగించినా బాధ్యతతో నిర్వహిస్తానని రాజగోపాల్‌రెడ్డి అంటున్నారు. అయితే ఆయన అనుచరులు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఆయన అభిమానులు మాత్రం రాజగోపాల్‌రెడ్డి హోంమంత్రిగా బాధ్య తలు అప్పగిస్తే బాగుంటుందని పేర్కొంటున్నారు.
ఆ క్రమంలో పీసీసీ పదవిని రేవంత్ రెడ్డి రూ. 50 కోట్లకు కొన్నాడని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మంచోడు కాబట్టే మీరు ఫామ్ హౌస్ లో ప్రశాంతంగా ఉన్నారనీ, లేకపోతే నిన్నటి నుంచి ఒక లెక్క, ఈరోజు నుంచి మరో లెక్క అన్నట్టుగా ఉండేదని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు ఆర్ అండ్ బీ మినిస్టర్‌గా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన శాఖ మార్చాలని కోరుతున్నారట. ఈ నేపధ్యంలో అన్నదమ్ములిద్దరు రేవంత్‌కు మద్దతుగా గొంతెత్తుడటం ఇంట్రస్టింగ్‌గా తయారైంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/komatireddy-brothers-praise-revanth-25-195127.html
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.