Publish Date:Oct 30, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ.. అజహరుద్దీన్ కి మంత్రి వర్గంలోకి చోటు కల్పించి ఇటు ఎంఐఎం ద్వారా ముస్లిం ఓటు బ్యాంకు కవర్ చేస్తూనే.. అటు గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయిన అజహరుద్దీని కి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా.. వారిని మరింత ఆకట్టుకునే యత్నంలో కాంగ్రెస్ ఉంది. అయితే.. అజహరుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వాలన్న నిర్ణయం ఈ నాటిది కాదు... ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారన్నప్పటి రేవంత్ కేబినెట్ లో ఆయనకు స్థానం కల్పిస్తారన్న ప్రచారం సాగుతోంది. దానికి తోడు ఇప్పటి వరకూ కేబినెట్ లో మైనారిటీకి చోటు లేకపోవడంతో అజార్ కు కేబినెట్ బెర్త్ ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అదే సమయంలో హోం మంత్రిత్వశాఖఎలాగూ రేవంత్ దగ్గరే ఉంది. ఈ రెండింటినీ బేరీజు వేసుకోవడంతో పాటు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో అజహారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకోవడం ద్వారా స్వామికార్యం- అంటే నవీన్ కార్యం కూడా పూర్తి చేయాలన్నది రేవంత్ స్కెచ్ గా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
గతంలో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా.. వాటిలో మూడింటిని మాత్రమే ఇచ్చి మిగిలిన మూడింటినీ అట్టేపెట్టి ఉంచారు. ఇదంతా ఇంఛార్జ్ మీనాక్షీ నటరాజన్ ఆలోచన. ఇప్పుడు అవసరానికి ఇందులో ఒక మంత్రి పదవి బయటకు తీశారు. మిగిలిన రెండింటి పరిస్థితి ఏంటని చూస్తే.. ఇప్పట్లో వీటిని భర్తీ చేసే అవకాశాలు కనిపించడం లేదంటున్నారు.
దీంతో గత కొన్నాళ్లుగా మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో పాటు.. అసలీ పార్టీలోనే ఉండకూడదన్న నిర్ణయానికి వచ్చారన్న వదంతి ఒకటి గుప్పు మంటోంది. ఇటు అజహరుద్దీన్ కి మంత్రి పదవి ఇస్తారో లేదో కానీ అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపార్టీ వీడేలా కనిపిస్తోంది. రాజగోపాల్ రెడ్డి గతంలో కూడా ఇలాగే పార్టీ వీడి తర్వాత తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. ఆయనకూ ఆయనకున్న భావప్రకటనా స్వేచ్ఛకు కాంగ్రెస్ లో తప్ప మరెక్కడా వీలు కాదు. కాబట్టి.. ఆయన వెళ్తే వెళ్లాడు-మళ్లీ వచ్చేస్తాడులెమ్మన్నభావనలో అధిష్టానం ఉన్నట్టుగా సమాచారం. మరి చూడాలి ఈ పరిణామ క్రమాలు ఏ రీతిన మారుతాయో తేలాల్సి ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/komatireddt-rajagopalreddy-angry-over-cabinet-25-208711.html
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.