Publish Date:Oct 23, 2025
తెలుగుదేశం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మరో సారి సంచలన వ్యాఖ్యలతో వార్తలకెక్కారు. సొంత పార్టీ ఎంపీపైనే తీవ్ర ఆరోపణలు చేసి వివాదానికి తెరలేపారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై ఆయన చేసిన ఆరోపణలతో ఇరువురి మధ్యా విభేదాలు మరోసారి రచ్చకెక్కియి. కాగా కొలికపూడి వ్యాఖ్యలపై తెలుగుదేశం శ్రేణులు మండిపడుతున్నాయి. ఆయన తీరు అభ్యంతరకరంగా ఉందంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇంతకీ జరిగిందేంటంటే.. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిని టార్గెట్ చేస్తూ కొలికపూడి తీవ్ర ఆరోపణలు చేశారు
. కేశినేని చిన్ని పార్టీ పదవులను అమ్ముకుంటూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. విజయవాడ ఎంపీ కేశినేని కార్యాలయం కేంద్రంగా జరుగుతున్న అవినీతి దందాను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకువెడతానని కొలికపూడి అంటున్నారు. ఇంతకీ ఆయన ఆరోపణ ఏమిటంటే.. 2024 ఎన్నికలలో తిరువురూ అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం టికెట్ కోసం కేశినేని చిన్ని తనను ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారంటూ కొలికపూడి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే తాను మూడు దఫాలుగా 60లక్షల రూపాయల చొప్పున చిన్నికి సొమ్ములు ట్రాన్స్ ఫర్ చేసినట్లు ఆ పోస్టులో పేర్కొన్నారు. అంతే కాకుండా కేశినేని చిన్ని పీఏ మోహన్ పోరంకి వచ్చి 50లక్షల రూపాయలు తీసుకువెళ్లినట్లు పేర్కొంటూ నిజమే గెలవాలి అంటూ కొలికపూడి ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది.
దీనిపై విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని స్పందించారు. తాను ఎప్పుడూ పార్టీ కోసం, ప్రజల కోసం తన జేబులో డబ్బులు ఖర్చు చేశానే తప్ప ఎన్నడూ ఎవరి వద్దనుంచీ పైసా తీసుకోలేదని పేర్కొన్నారు. ఎంపీ కేశినేని చిన్ని లేకపోతే నేనులేను అని చెప్పిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇప్పుడు చేస్తున్న విమర్శలకు ఆయనే సమాధానం చెప్పాలని చిన్ని అన్నారు. తాను ఏమిటో విజయవాడ ప్రజలకు తెలుసునన్న చిన్నికొలికపూడి వ్యవహారాన్ని పార్టీ హైకమాండ్ చూసుకుంటుందన్నారు. ఇలా ఉండగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ కూడా కొలికపూడి వ్యవహారశైలి వివాదాస్పదంగానే ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే పలుమార్లు హైకమాండ్ ఆయనను మందలించిందనీ, హెచ్చరించిందనీ పార్టీ శ్రేణులు అంటున్నాయి. అయినా ఆయనలో మార్పు రావడం లేదని మండిపడుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kolikapudi-contrversial-comments-on-kesineni-chinni-25-208379.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.