ఉజ్వల ఇన్నింగ్స్‌కి తెర.. టెస్టులకు కోహ్లీ గుడ్‌బై

Publish Date:May 13, 2025

Advertisement

స్టార్ బ్యాటర్, స్ఫూర్తిదాయక కెప్టెన్, ఉరిమే ఉత్సాహంతో మైదానమంతా చైతన్యాన్ని నింపే పోరాట యోధుడు విరాట్‌ కోహ్లిని ఇక మనం తెల్లజెర్సీలో చూడలేం. టీ 20 లీగ్‌లకు విపరీతంగా ఆదరణ పెరుగుతున్న కాలంలో అభిమానులను టెస్టు క్రికెట్‌ వైపు ఆకర్షించి, వారిని ఆటకు అతుక్కుపోయేలా చేసి.. ఉత్తేజపరిచి, ఉర్రూతలూగించిన కింగ్‌ సుదీర్ఘ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. దాదాపు దశా బ్దంన్నర పాటు టీమిండియాకు వెన్నెముకలా నిలిచిన విరాటుడు.. దీర్ఘఫార్మాట్‌ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించాడు.

నిరుడు టీ 20ల నుంచి రిటైరైన కోహ్లి.. ఇక వన్డేల్లో మాత్రమే భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడు. సీని యర్లకు ‘చీకూ’గా, జూనియర్లకు భయ్యాగా, అభిమానులకు కింగ్‌గా భారత క్రికెట్లో అంతర్భాగమైన కోహ్లిని ఇక టెస్టుల్లో చూడలేకపోవడం పెద్ద వెలితే. అది పూడ్చలేనిది. అతడు బ్యాటుతో పరుగుల వరద పారించడమే కాదు.. సారథిగా భారత జట్టు టెస్టులు ఆడే తీరునే మార్చేశాడు. 

విదేశాల్లో తడబడే అలవాటున్న టీమ్‌ఇండియా.. కోహ్లి నాయకత్వంలో దూకుడును అలవర్చుకుంది. బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో భాగంగా జనవరిలో సిడ్నీలో ఆడిన ఐదో టెస్టే కోహ్లి కెరీర్‌లో ఆఖరి టెస్టు.
అది 2014 డిసెంబర్.. భారత టెస్ట్ క్రికెట్‌ పాతాళానికి పడిపోతున్న క్షణం. ఐసీసీ పాయింట్స్‌ టేబుల్‌లో 7వ స్థానం. మేటి ఆటగాళ్లంతా రిటైర్మెంట్ ప్రకటించారు. రెండు ప్రపంచకప్‌లు అందించిన ధోనీ కూడా.. కెప్టెన్సీ వదిలి జట్టుకు దూరం అయ్యాడు. టీం భవిష్యుత్  ఏంటనేది అందరిలో ప్రశ్నార్థకం. భారత టెస్ట్ క్రికెట్ ఇక కనుమరుగయిపోతుంది అనుకున్న క్షణం.. అప్పుడొచ్చాడు విరాట్ కోహ్లీ. టెస్ట్‌ క్రికెట్‌లో తాను కింగ్ అని నిరూపించుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. టీమిండియా అభిమానుల్లో ఆశలు పెంచి.. సంప్రదాయ విధానాలను సవాల్ చేస్తూ.. కొత్త తరహా టీమిండియాను తయారు చేయడంలో సఫలం అయ్యాడు.

టెస్టులు ఎవరు చూస్తారులే అనుకున్న వాళ్లను స్టేడియాలకు రప్పించాడు కోహ్లీ. క్రికెట్‌ అభిమానులను టీవీలకు అతుక్కుపోయేలా చేశాడు. టీ 20లే కాదు.. టెస్టులు కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి అనిపించేలా చేశాడు. భారత టెస్ట్ క్రికెట్ రాత మార్చాడు. విదేశీ గడ్డపై టీమిండియా అంటే చెమటలు పట్టేలా చేశాడు. అప్పటివరకు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ గడ్డపై భారత్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేసిందే లేదు. ముఖ్యంగా ఆసీస్ ఆటగాళ్ల స్లెడ్జింగ్‌కు మనవాళ్లు ముందే చిత్తయ్యేవాళ్లు. కానీ కెప్టెన్‌గా కోహ్లీ వారి సొంతగడ్డ పైనే వారికి దీటుగా జవాబిచ్చేవాడు. టీమిండియా ప్లేయర్ల జోలికి ఎవరైనా రావాలంటే ముందు తనను దాటాలని ప్రతి టీంకు చాటి చెప్పాడు. 

మరో రెండు దశాబ్దాలు పైబడినా.. బెస్ట్ టెస్ట్ కెప్టెన్‌ అంటే కోహ్లీ పేరు చెప్పేలా చేశాడు. భారత టెస్ట్ క్రికెట్ కెరీర్ కోహ్లీకి ముందు.. కోహ్లీకి తర్వాత అని చెప్తారు ఎవరైనా.  ఎందుకంటే ఒకటి కాదు.. రెండు కాదు.. విరాట్ టెస్ట్ కెప్టెన్‌గా పగ్గాలు అందుకున్న తర్వాత.. ప్రపంచ క్రికెట్‌లో భారత్ చక్రం తిప్పింది. 2017 నుంచి 2021 వరకు ఐదేళ్లు టీమిండియాను నెంబర్‌ వన్‌గా నిలబెట్టాడు. ప్రపంచ టెస్ట్ క్రికెట్‌లో ఈ ఘనత  సాధించిన కెప్టెన్ ఎవరూ లేకపోవడం గమనార్హం. అంతే కాకుండా భారత్ ను వరుసగా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు తీసుకెళ్లాడు. కోహ్లీ సారథ్యంలో భారత్ 68 మ్యాచ్‌లు ఆడి.. 40 విజయాలు సాధించింది. మరో 11 మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. కోహ్లీ సారథ్యంలో సొంతగడ్డపై 11 టెస్ట్ సిరీస్‌లు గెలిచింది. విదేశాల్లో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్‌గానూ  రికార్డు విరాట్ కోహ్లీ పేరుమీదే ఉంది.  

కోహ్లీ సారథ్యంలో విదేశాల్లో భారత్.. 15 విజయాలు నమోదు చేసింది. కెప్టెన్‌గా వరుసగా అత్యధికంగా 9 టెస్ట్ సిరీస్ గెలిచింది కూడా కోహ్లీనే. ఆడిలైడ్, పెర్త్ గడ్డపై కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాదే ఆధిపత్యం. అలాంటిది వాళ్ల సొంతగడ్డపైనే  వారిని మట్టి కరిపించి.. వరుసగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలను గెలిచాడు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచిన మొదటి భారత కెప్టెన్‌గా నిలిచాడు. అటు ఇంగ్లాండ్‌ గడ్డపై భారత్ విశ్వరూపం కొనసాగడానికి కారణం కోహ్లీనే. ఆటగాడిగా.. కెప్టెన్‌గా తోటి ప్లేయర్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. అదే టీమిండియా రాత మార్చింది.  విరాట్ కోహ్లీ లేకుండా టీమిండియా టెస్ట్ జట్టును ఊహించుకోవడం చాలా కష్టం. కెప్టెన్‌గా తాను 2022లో రిటైర్ అయినా.. లీడర్‌గా రోహిత్ శర్మకు విలువైన సలహాలు అందించాడు. రోహిత్‌ టీంను నడిపించలేని టైంలో.. తాను ముందుకు వచ్చి భారత్‌ను రక్షించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అలాంటి మరో ప్లేయర్, మరో కెప్టెన్‌, మరో లీడర్‌ను భారత క్రికెట్‌ చూడటం కష్టమే.

By
en-us Political News

  
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జననాయగన్‌ సినీమా విడుదలపై నెలకొన్న అనిశ్చితిని ఆయన ప్రజల ముందు ఉంచారు. అలాగే.. కరూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ.. అది యాధృచ్ఛికంగా జరిగింది కాదని, దాని వెనుక కూడా లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయన్నారు.
నిజానికి తాను రాజ‌కీయ స‌న్యాసం చేసిన‌ట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్ప‌టికీ ఆయ‌న‌ త‌న టీం ద్వారా అకౌంట్ స‌ర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జ‌గ‌న్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాల‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజ‌య‌సాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవ‌ల జ‌గ‌న్ అర్ధంప‌ర్దం లేకుండా చేసిన మావిగ‌న్ అనే ప్ర‌తిపాద‌న‌ మీదే. కానీ రేణుక చౌద‌రి స‌భ‌లో లేవ‌నెత్తిన క‌మ్మ‌రావ‌తిని ప‌ట్టుకుని.. పోస్టులు పెట్ట‌డం స‌రికాద‌ంటున్నారు.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి.
గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు. బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్‌ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది.
. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.
అమరావతికి చట్టబద్ధత అమరావతి రైతుల నైతిక విజయంగా అభివర్ణించారు. సుదీర్ఘకాలం పాటు మొక్కవోని దీక్షతో రైతులు చేసిన పోరాటం వల్లే ఇది సాధ్యమైందన్నారు. రాజధాని ఉద్యమ సమయంలో పాలకులు ప్రయోగించిన అణచివేత చర్యలను ఈ సందర్భంగా రేణుకా చౌదరి గుర్తు చేశారు.
సీఎం హోదాలో నాడు అమరావతి శాసన రాజధాని , విశాఖ పరిపాలన రాజధాని , కర్నూలు న్యాయ రాజధాని అంటూ ఓ కొత్త వాదనను తెరమీదకు తీసుకువచ్చారు. ఆ దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు పడకపోయినా.. అప్పటి వరకూ పరుగెడుతున్న అమరావతి నిర్మాణ పనులను నిలిపివేశారు.
దేశంలో ఉన్న అన్ని పార్టీల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం వైపు నిలిపి అమ‌రావ‌తి బిల్లుకు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని పార్ల‌మెంటు హాలులో గురువారం ఉదయం క‌లిసిన లోకేష్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల త‌ర‌ఫున కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.