Publish Date:Jul 16, 2022
అభిమానులు, వీరాభిమానులు కేవలం సినీ హీరో హీరోయిన్లకే కాదు క్రికెట్ హీరోలకీ వుంటారు. వారికీ, వీరికీ పిచ్చి దాదాపు ఒకే స్థాయిలో వుంటుంది. సినిమా సెంచరీ కొట్టాలని సినీ వీరాభిమానులు, మనోడు సెంచరీ కొట్టాలని క్రికెట్ వీరాభిమానులు ఎంత పనికయినా సిద్ధపడుతున్నారు. టాటూలు వేసుకోవడం చేసి పెద్ద వాళ్లు కాస్తంత ఖంగారెత్తారు.. ఏకంగా పూజలు, అన్నదానాలు.. వీటికి అంతే లేకుండా పోతోంది. వీళ్లని ఆపడం కోహ్లీలాంటి క్రికెట్ హీరో మళ్లీ సెంచరీ కొట్టాల్సిందే. అసలే ఫాన్స్‌కి హీరోగారి బ్యాట్ నుంచీ పరు గుల వరద లేదన్న దిగులు కమ్మేసింది. అయితే ఒక్కటి ఇలా అన్నదానాలు, పూజలు చేసేస్తే క్రికెట్ వీరుడు సెంచరీ కొట్టేస్తాడా?
భారత క్రికెట్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి క్రికెట్‌లో సచిన్ ద గాడ్ తర్వాత అంతటి క్రేజ్ వుంది. 33 ఏళ్ల కోహ్లీ తన 71వ అంతర్జాతీయ సెంచరీ కోసం దేశంలో విదేశాల్లోనూ వీరాభిమానులు వేయిన్నర కళ్లతో ఎదురుచూస్తూనే వున్నారు. కళ్లు కాయలు కాస్తున్నాయేగాని హీరోగారు మాత్రం అర్ధసెంచరీ మించడం లేదు. అంతెందుకు ఈమధ్యమరీ దారుణంగా ఆడుతున్నాడు. అయినా ప్రతి ప్లేయర్‌కి ఇలాంటి ప్యాచ్ వుంటుంది గురూ, మనోడి విషయంలో క్షమించేయండి అంటున్నారు మాజీ క్రికెటర్లు,, కోహ్లీ శిష్యగణం.
కోల్‌కతా ఈడెన్ గార్డెన్‌లో బంగ్లాదేశ్ మీద ఆడిన పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ చేశాడు. అంతే ఆ తర్వాత అంతగా పరుగులు చేయలేకపోతున్నాడు. అతగాడు కెప్టెన్ బాధ్యతలు వదిలేసుకున్న తర్వాత ఆ ఒత్తిడి తగ్గింది గనుక ఇహ మనోడు కొట్టేస్తాడనుకున్నా ఆ ఆనందం ప్రేక్షకులకు, వీరాభిమా ను లకు కలగడం లేదు. నరాల బలహీనత నుంచి కోలుకుని భారత వన్ డే జట్టులోకి వచ్చిన తర్వాత మరీ దారుణంగా 25 బంతుల్లో కేవలం 16 పరుగులే చేసి నిరాశపరిచాడు. కోహ్లీ లో ఇంకా ఆడే శక్తి వుందని ప్రస్తుతం కొంత ఇబ్బందిపడుతున్నాడే గాని టాప్ స్టార్ స్థాయికి తగ్గలేదని, అతని సత్తా గురించి ఏ మాత్రం అనుమానించక్కర్లేదని భారత్ కెప్టెన్ శర్మ కూడా కితాబునిచ్చాడు. అందువల్ల మున్ముందు టెస్ట్ సిరీస్ లో సెంచరీ చేస్తాడనే ఎదురుచూడాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kohli-fan-madness-25-139884.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!