ఎంతో సాధించి.. చివరికి పరువు కోసం ప్రాణాలు తీసుకున్న పల్నాటి పులి

Publish Date:Sep 16, 2020

Advertisement

నేడు డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు మొదటి వర్థంతి. రూపాయి డాక్టరుగా పేదల మనసు గెలిచిన ఆయన.. ఎన్టీఆర్ ఆహ్వానంతో రాజకీయాల్లోకి వచ్చారు. అలనాటి అరాచకాలకు ఎదురు నిలిచి, పల్నాటి గడ్డలో అభివృద్ధికి బాటలు పరిచి.. నరసరావుపేట కి నగిషీలు అద్ది, కోటప్పకొండకు కొత్త రూపు తెచ్చి పల్నాటి పులిగా పేరుతెచ్చుకున్నారు.

 

గుంటూరు జిల్లా కండ్లగుంట గ్రామంలో 1947 మే 2 వ తేదీన సంజీవయ్య, లక్ష్మీనర్సమ్మ దంపతులకు కోడెల జన్మించారు. వారిది మధ్యతరగతి కుటుంబం. చిన్న తనంలోనే తోబుట్టువులు అనారోగ్యంతో చనిపోవడం కోడెలను తీవ్రంగా కలిచివేచింది. ఆ విషాదమే ఆయనలో డాక్టర్ కావాలనే ఆలోచనకు బీజం వేసింది. ఆర్థిక స్తోమత అంతంతమాత్రమే ఉన్నా.. ఆయన తాతగారి ప్రోత్సాహంతో వైద్య విద్యనభ్యసించారు.

 

పల్నాడు ప్రాంత పేదప్రజలకు వైద్యసేవలు అందించాలని నరసరావుపేటలోని రాజాగారికోటలో ఆసుపత్రి నెలకొల్పి వైద్యవృత్తిని చేపట్టారు కోడెల. ఆయన దగ్గరకు గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేదవారు అధికంగా వచ్చేవారు. వైద్యవృత్తిని ఎప్పుడూ కోడెల సంపాదన మార్గంగా చూడలేదు. అందుకే ఆపదలో ఉన్నవారు జేబులో డబ్బు ఉందా లేదా అని ఆలోచించకుండా డాక్టరు కోడెల ఉన్నారన్న ధైర్యంతో ఆసుపత్రి గడప తొక్కేవారు. ఆయన పేదల డాక్టరుగా, రూపాయి డాక్టరుగా ఎందరో హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు.

 

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ దృష్టి కోడెల సేవపై పడి, 1983లో పార్టీలోకి ఆహ్యానించారు. రాజకీయాల ద్వారా ప్రజలకు మరింత సేవ చేయాలన్న తలంపుతో ఎన్టీఆర్ పిలుపు మేరకు కోడెల తెలుగుదేశంలో చేరారు. మొదటిసారిగా ఆయన నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఒకవైపు ఎమ్మెల్యేగా పనుల వత్తిడిలో ఉంటూనే, మరోవైపు ప్రజలకు వైద్యసేవలు అందించేవారు. 1983 నుంచి 1999 వరకు ఐదు సార్లు వరుసగా నరసరావుపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. ఎన్టీఆర్‌, చంద్రబాబు మంత్రి వర్గాల్లో పనిచేశారు. రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్రప్రదేశ్‌ తొలి శాసన స్పీకర్ గా పనిచేశారు. 

 

ప్రభుత్వంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ప్రజా సమస్యలపై ఆయన రాజీ లేని పోరాటం చేశారు. వైఎస్‌ హయాంలో రైతుల కోసం గొంతెత్తి లాఠీ దెబ్బలు తిని.. జైలుకు వెళ్లారు. కోటప్పకొండ పవిత్రతను కాపాడాలంటూ నరసరావుపేట నుంచి కొండపైదాకా నడిచారు. కోటప్పకొండ ఆలయ అభివృద్ధికి కోడెల ఎంతో కృషి చేశారు.

 

స్వచ్ఛఆంధ్రప్రదేశ్ కన్వీనర్‌గా నరసరావుపేట, సత్తెనపల్లిలో రికార్డుస్థాయిలో స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహించారు. స్వచ్ఛఆంధ్రప్రదేశ్ లో భాగంగా కోడెల సత్తెనపల్లి నియోజకవర్గంలో లక్ష మరుగుదొడ్లు నిర్మించి, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, శ్మశానవాటికలు, స్వచ్ఛ భారత్‌ వంటి కార్యక్రమాల్లో చొరవ చూపించి దేశానికే ఈ నియోజకవర్గం ఒక దిక్సూచిగా నిలిపారు.

 

ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు సందర్భంగా, వేడుకలు జరుపుకోకుండా, ఏదో ఒక సామాజిక సేవ చేయడం కోడెల ఆనవాయితీ. పుట్టినరోజు సందర్భంగా ఒకసారి 50 వేల ఇంకుడు గుంతలు తవ్వించి రికార్డు సృష్టించారు. 2017 మే 2న కోడెల పుట్టినరోజు సందర్భంగా నరసరావుపేటలో పదివేల మందికి పైగా అవయవదాన పత్రాలు సమర్పించే సేవా కార్యక్రమం నిర్వహించారు. 11,987 మంది గుంటూరు జిల్లా ప్రజలు అవయవదానానికి అంగీకారం తెలిపి గిన్నీస్‌ రికార్డు సృష్టించారు.

 

టీడీపీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చినా ఆయన ఎన్నడూ కండువా మార్చలేదు. 36 ఏళ్లు టీడీపీలోనే ఉన్నారు. పార్టీ మారమని ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, వ్యక్తిగతంగా కించపరచినా ఎప్పుడూ పార్టీ మారలేదు. డాక్టర్ గా, రాజకీయ నాయకుడిగా.. నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ఎంతో సేవ చేసి.. పేదల మనిషిగా, పల్నాటిపులిగా పేరు తెచ్చుకున్న ఆయన.. కొందరు ఆయనపై వేసిన నిందలను, తప్పుడు ప్రచారాలను తట్టులోలేక.. మానసికంగా కృంగిపోయి.. గతేడాది ఇదే రోజున అవమానలను భరించలేక పరువుకోసం ప్రాణం తీసుకున్నారు.

By
en-us Political News

  
నా తండ్రికి ఉత్తరం రాసిన మాట వాస్తవమే. కానీ అది రెండు వారాల క్రితమే రాశాను. పార్టీలో జరుగుతున్న అంతర్గత కుట్రలను ఇప్పటికే అనేకసార్లు చెప్పాని కవిత క్లారిటీ ఇచ్చారు.
గత వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసానికి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే పదేళ్లు పడుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రజలు తమకు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు
కోకో గింజలు కొనుగోలు ధరపై రాష్ట్ర ప్రభుత్వం ఏలూరు కలెక్టరేట్ లో నిర్వహించిన ద్వైపాక్షిక చర్చలు పూర్తిగా విఫలమైనట్లు ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర నాయకులు ప్రకటించారు.
తెలంగాణలో మొదటి కరోనా కేసు నమోదైంది. హైదరాబాద్, కూకట్‌పల్లిలోని డాక్టర్‌కు కరోనా పాజిటివ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్నిసార్లైనా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని హుగ్గెళ్లి చౌరస్తాలో బసవేశ్వరుడి విగ్రహాన్నిముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
ఏపీ లిక్కర్ స్కామ్‌లో కసిరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కెసిరెడ్డి ఉపేంద్రరెడ్డి, రాజ్‌ కెసిరెడ్డి పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
ఏపీ మాజీ సీఎం జగన్ చాలాకాలం తర్వాత అమరావతి రాజధానిపై విచిత్రంగా స్పందించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇక్కడ ల్యాండ్ స్కామ్ చేస్తుందని పాత ఆరోపణలే తిరిగి గుప్పించారు.
మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టెటివ్ కమిటీ తెలంగాణ ఛైర్ పర్సన్‌గా డీకే అరుణని నియమించారు.
హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తెలంగాణ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ఆరు వారాల్లో సమగ్ర నివేదిక అందించాలని హైదరాబాద్ సీపీ ఆనంద్‌కు నోటీసులు జారీ చేసింది.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖపై మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉత్తరం రాయించారేమోనని ఆయన అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో కవిత మరో షర్మిల కాబోతోంది అని హాట్ కామెంట్స్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. కేంద్రమంత్రులతో సీఎం వరుసగా భేటీలు అవుతున్నారు.
క‌ల్వకుంట్ల క‌విత త‌న తండ్రిని విబేధిస్తూ రాసిన లేఖ ఒక చిన్న లీడ్ మాత్ర‌మేన‌ట‌. వ‌చ్చే రోజుల్లో క‌విత నుంచి భారీ బ్లాస్టింగ్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. కార‌ణం క‌విత పార్టీ బ‌య‌ట‌కొచ్చి కొత్త పార్టీ పెట్టేలా ఎత్తుగ‌డ వేస్తున్న‌ట్టు సమాచారం.
తిరుమలలో సదుపాయాలు చాలా మెరుగు పడ్డాయిని ప్రముఖ దర్మకుడు రాఘవేంద్రరావు అన్నారు. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడిని శుక్రవారం ఉదయం పలువురు ప్రముఖులు కలిశారు. సినీ దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌, మాజీ తానా అధ్యక్షుడు వేమన సతీశ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.