కోల్ కతా విమానాశ్రయంలో కొడాలి నాని అరెస్ట్!?
Publish Date:Jun 18, 2025
Advertisement
వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా గుర్తింపు పొంది.. బూతుల నానిగా ప్రసిద్ధి పొందిన కొడాలి నానిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. కోల్ కతా విమానాశ్రయంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కోల్ కతా విమానాశ్రయం నుంచి శ్రీలంక వెళ్లేందుకుర ప్రయత్నించిన నానిని అక్కడ ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుని అదుపులోనికి తీసుకున్నారు. కొడాలి నానిపై లుక్ ఔట్ నోటీసు ఉండటంతో ఆయన విమానాశ్రయంలో అడ్డుకుని అదుపులోనికి తీసుకున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో నాని ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా.. ఎక్కడ మాట్లాడినా చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై బూతుల పంచాంగం విప్పేవారు. అటువంటి కొడాలి నాని వైసీపీ పరాజయం తరువాత నుంచీ నోరు విప్పడానికే భయంతో వణుకుతున్న పరిస్థతి. గుడివాడ నుంచి వరుసగా ఐదుసార్లు విజయం సాధించిన కొడాలి నాని ఒక్క పరాజయంతో నియోజకవర్గం ముఖం చూడడానికి కూడా భయపడే పరిస్థితికి దిగజారారు. అసలు గత ఎన్నికలలో వైసీపీ పరాజయం తరువాత కొడాలి నాని బహిరంగంగా బయటకు వచ్చి కనిపించిన సందర్భాలను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అయితే అప్పడప్పుడు మీడియా ముందు కనిపించినా.. తాను భయపడటం లేదు అన్న బిల్డప్ ఇచ్చుకోవడానికి ప్రయత్నించారు. అయితే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు తరువాత కొడాలి నాని ఆ మాత్రంగా కూడా మాట్లాడే ధైర్యం చేయలేదు. పూర్తిగా హైదరాబాద్ కే పరిమితమైపోయారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై ముంబై ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. అంతే ఆ తరువాత నానికి సంబంధించిన వార్త ఏదీ బయటకు రాలేదు. ఆయన ముంబై నుంచి హైదరాబాద్ కు ఎప్పుడు తిరిగివచ్చారు? అన్న సంగతే తెలియనంతగా అజ్ణాత వాసం చేశారంటే అతిశయోక్తి కాదు. ఇటీవలే ఓ వివాహ కార్యక్రమంలో ఆయన కనిపించారు. ఇక కొడాలి నానిని ఏక్షణంలోనైనా అరెస్టు చేయవచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే కొడాలి నాని కోల్ కతా నుంచి కొలంబో చెక్కేయడానికి విమానాశ్రయానికి చేరుకున్నారు. లుక్ ఔట్ నోటీసులు ఉండటంతో అక్కడ కొడాలి నానిని అడ్డుకుని అదుపులోనికి తీసుకున్నారు. ఆయనను విజయవాడ తరలించే అవకాశాలున్నాయంటున్నారు.
http://www.teluguone.com/news/content/kodalinani-arrested-in-kolkata-airport-25-200193.html





