Publish Date:May 28, 2026
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నాని మళ్లీ వార్తల్లో నిలిచారు. గత సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత దాదాపు క్రియాశీల రాజకీయాలకు, దూరంగా ఉంటున్న ఆయన ఇటీవల ఆయన మళ్లీ ప్రజల ముందుకు రావడం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆయన తాను సుదీర్ఘ కాలం రాజకీయాలకు దూరంగా ఉండటానికి కారణం వెల్లడించారు.
తన రాజకీయ అజ్ఞాతవాసానికి తనకు జరిగిన బైపాస్ సర్జరీయే కారణమన్నారు. సర్జరీ తరువాత కనీసం 6 నెలలు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడం వల్లనే తాను గుడివాడకు, రాజకీయాలకు దూరంగా ఉన్నానన్నారు. ఆరోగ్యం సహకరించకపోవడం వల్లే తాను బయటకు రాలేకపోయానని, రాజకీయాల నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని కొడాలి నాని చెప్పారు. వైసీపీ అధినేత జగన్ తో తాడేపల్లి ప్యాలెస్ లో భేటీ అనంతరం బుధవారం (మే 27) మీడియాతో మాట్లాడిన ఆయన యథాప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ లపై పరుష పదజాలంతో విమర్శలు గుప్పించారు. అయితే.. ఆ సందర్భంగా ఆయన శైలి గతానికి పూర్తి భిన్నంగా కనిపించింది. సాధారణంగా కొడాలి నాని, చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యుల పట్ల తీవ్రమైన ద్వేషంతో మాట్లాడతారు. చంద్రబాబు తనకు వ్యక్తిగత శత్రువు అన్నట్లుగా ఆయన బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. చంద్రబాబుపై విమర్శలకు ఆయన అభ్యంతరకరమైన భాషను ఉపయోగిస్తుంటారు. కానీ బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతున్నప్పుడు అటువంటిదేదీ కనిపించలేదు. ఎవరో ఒత్తిడి చేయడం వల్ల మాత్రమే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారా అనిపించేలా ఆయన బాడీ లాంగ్వేజ్ ఉంది.
ఏదో నామ్ కే వాస్తే విమర్శలు చేసినట్లుగా అనిపించింది తప్ప.. గతంలో ఆయన మాటల్లో ఉన్న కసి, ఆవేశం ఇసుమంతైనా కనిపించలేదు. జగన్ లేదా వైసీపీ అగ్రనేతల ఒత్తిడి కారణంగానే ఆయన మీడియా ముందుకు వచ్చి చంద్రబాబుపై విమర్శలు చేసినట్లుగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kodalinani-appears-before-media-25-221148.html
వేలమంది బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ప్రాంతీయ ఆకాంక్షలను, ఉద్యమాలను జనసేన గౌరవించాలని కేటీఆర్ పవన్ కు హితవు పలికారు. అయితే, ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. కేటీఆర్ సంధించిన ప్రశ్నలనే తిరిగి కల్వకుంట్ల కుటుంబానికి గురిపెడుతూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2024 ఎన్నికలలో వైనాట్ 175 అంటూ బీరాలు పలికిన జగన్.. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చే సరికి కేవలం 11 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించిన ఆయనకు, ఆయన పార్టీకీ కనీసం విపక్ష హోదా కూడా ఇవ్వడానికి జనం నిరాకరించారు.
రాష్ట్రంలో వైసీపీ పాలన అంతమై రెండేళ్లు గడిచిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టారు. రాష్ట్ర చరిత్రలో జూన్ 4ని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజుగా అభివర్ణించారు.
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు వంటి మహనీయుడిని సైతం నేడు ఒకే ఒక్క కులానికి పరిమితం చేసే దుస్థితి మన రాష్ట్రంలో నెలకొందన్న పవన్ కల్యాణ్.. కులాల పేరుతో సమాజాన్ని విడదీసే ఈ దుర్మార్గపు రాజకీయాలకు ఎక్కడో ఒకచోట చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కులాల ఐక్యతే జనసేన పార్టీ మూల సిద్ధాంతమన్నారు.
గద్దర్ కుమార్తె వెన్నెల పవన్ కల్యాణ్ మాటలు తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, తన తండ్రి గద్దర్ వారసత్వాన్ని అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా పవన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమైన మలుపులతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి.
పవన్ కళ్యాణ్‌పై తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.
చివరి గింజ ధాన్యం కొంటామన్న కాంగ్రెస్ సర్కార్ అప్పులు చేయడంలో రేవంత్ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని విమర్శించిన కేటీఆర్.. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్నారు.
లంగాణ ప్రజల దశాబ్దాల కల సాకారమైన రోజున ఇక్కడి సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదన్నారు. గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు తాను 11 రోజుల పాటు అన్నం తినలేదని పవన్ కల్యాణే స్వయంగా చెప్పారనీ.. అలాంటి వ్యక్తి మళ్లీ ఇప్పుడు తెలంగాణకు తాను వ్యతిరేకం కాదంటూ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని కేటీఆర్ అన్నారు.
జగన్ ఎప్పుడెప్పుడు అధికారం నుంచి దిగిపోతారా అని దేవుళ్లకు పూజలు చేశారు, శాపనార్థాలు పెట్టారు. జగన్ అధికారంలో ఉంటే తమ అమరావతి కలలు ఎప్పటికీ ఫలించవని ఆవేదన చెందారు. అలాంటిది, ఇప్పుడు అదే అమరావతికి చెందిన రైతులు తాడేపల్లిలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయ్యారనే వార్త పొలిటికల్ సర్కిల్స్ నే కాకుండా సామాన్య ప్రజలను కూడా విస్మయానికి గురి చేసింది.
దశాబ్దాలుగా కోలీవుడ్ లో సంపాదించుకున్న తన స్టార్ డమ్ ను, ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో విజయ్ సఫలమయ్యారు. వీటన్నింటికీ తోడు తమిళనాట కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజ నేతల మరణాల తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యం విజయ్ కు అనుకూలంగా మారింది.
ఈ విజయం కేవలం ఒక పదవి మాత్రమే కాదని, తన దశాబ్దాల కఠిన శ్రమకు, అంకితభావానికి దక్కిన అసలైన ఫలితమని ప్రకటించారు.
గతంలో మాతో పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఇప్పుడు పెట్టుకుంటే మూతిపళ్ళు రాలుతాయని కవిత హెచ్చరించారు. అంతేకాకుండా, అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని కట్టుకోవడం చేతకానివాళ్ళు, తెలంగాణ నవనిర్మాణం చేస్తారా అంటూ ఆమె ఎద్దేవా చేశారు.