Publish Date:May 28, 2026
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత ప్రజాదరణ కలిగిన రాజకీయ నాయకులలో ఒకరు. నాలుగు దశాబ్దాలకు రాజకీయాల్లో ఆయన క్రియాశీలంగా ఉన్నారు.చంద్రబాబు అందరితో కలిసిపోయి.. వారి మాటలను సావధానంగా వింటారు. ప్రస్తుతం జరుగుతున్న మహానాడు విషయంలో ఇది మరింత స్పష్టంగా కనిపించింది. చంద్రబాబు నాయుడు ఎంతోమంది సామాన్యులకు తనను కలవడానికి, తనతో మాట్లాడటానికి మహానాడును వేదికగా మార్చారు. చంద్రబాబు తన పక్కన సామాన్యులైన పలువురికి చోటు కల్పించారు. వారికి చంద్రబాబుతో కూర్చుని మాట్లాడే అవకాశం లభించింది. ఇదే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విషయంలో మచ్చుకైనా కనిపించదు. ఎందుకంటే ఆయన సాధారణంగా పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులతో కూడా సంభాషించడానికి సుముఖంగా ఉండరు. ఆయనకు ప్రజల్లో ప్రజలతో స్పష్టమైన అనుబంధం ఉండవచ్చు, కానీ రాజకీయ కార్యక్రమాల సమయంలో వేదికపై కలుపుగోలుతనం కలికానిక్కూడా కనిపించదు. వైఎస్ జగన్‌తో సహా మిగతా వారందరి నుండి చంద్రబాబును వేరుచేసేది చంద్రబాబులోని ఈ కలుపుగోలు తనమేనని పరిశీలకులు విశ్లేషిస్తునారు.
ఇక తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు 2026 విషయానికి వస్తే.. ఈ సారి మహానాడు సరికొత్త రాజకీయ ఒరవడికి వేదికైంది. నెల్లూరులో భారీ ఎత్తున ఏర్పాటు చేయాలనుకున్న ఈ వేదికను, మోడీ ఇచ్చిన పొదుపు పిలుపు నేపథ్యంలో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా హైబ్రిడ్ మోడల్‌లోకి మార్చారు. ఆధునిక సాంకేతికతను జోడించి డిజిటల్ పద్ధతిలో నిర్వహించిన ఈ సరికొత్త మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సమ్మిళిత రాజకీయాల విధానం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.
ఈ వేదికపై నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకొనిపోయే విధంగా నూతన పాలనా సంస్కరణలను ప్రకటించారు. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్ళుగా భావించే చంద్రబాబు.. ఈ మహానాడు ద్వారా వృద్ధులు, చేతివృత్తుల వారికి అండగా నిలిచేందుకు సామాజిక పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈ స్థాయిలో పెన్షన్ అందించడం ద్వారా పేదరిక నిర్మూలన దిశగా అడుగులు వేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కేవలం పెన్షన్లకే పరిమితం కాకుండా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి అన్నదాతలను ఆదుకునేందుకు ప్రతి రైతుకు ఏటా పెట్టుబడి సాయాన్ని అందిస్తామని ప్రకటించడం పట్ల రైతాంగంలో హర్షం వ్యక్తం అవుతోంది.
మహానాడు వేదికగా కూటమి రాజకీయాల ప్రాముఖ్యతను చంద్రబాబు నాయుడు నొక్కి చెప్పారు. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి నడుస్తున్న ఈ ప్రయాణం కేవలం తాత్కాలిక రాజకీయ అవసరం కాదని, ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చే ఒక చారిత్రాత్మక మైలురాయిగా చంద్రబాబు అభివర్ణించారు. వచ్చే ఎన్నికల్లో కూడా జనసేనతో కలిసే పోటీ చేస్తామని ప్రకటించి కూటమిలో విభేదాలపై విపక్షాల ఊహాగానాలకు చెక్ పెట్టారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/affability-that-has-established-chandrababu-as-an-immensely-popular-leader-25-221159.html
వేలమంది బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ప్రాంతీయ ఆకాంక్షలను, ఉద్యమాలను జనసేన గౌరవించాలని కేటీఆర్ పవన్ కు హితవు పలికారు. అయితే, ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. కేటీఆర్ సంధించిన ప్రశ్నలనే తిరిగి కల్వకుంట్ల కుటుంబానికి గురిపెడుతూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2024 ఎన్నికలలో వైనాట్ 175 అంటూ బీరాలు పలికిన జగన్.. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చే సరికి కేవలం 11 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించిన ఆయనకు, ఆయన పార్టీకీ కనీసం విపక్ష హోదా కూడా ఇవ్వడానికి జనం నిరాకరించారు.
రాష్ట్రంలో వైసీపీ పాలన అంతమై రెండేళ్లు గడిచిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టారు. రాష్ట్ర చరిత్రలో జూన్ 4ని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజుగా అభివర్ణించారు.
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు వంటి మహనీయుడిని సైతం నేడు ఒకే ఒక్క కులానికి పరిమితం చేసే దుస్థితి మన రాష్ట్రంలో నెలకొందన్న పవన్ కల్యాణ్.. కులాల పేరుతో సమాజాన్ని విడదీసే ఈ దుర్మార్గపు రాజకీయాలకు ఎక్కడో ఒకచోట చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కులాల ఐక్యతే జనసేన పార్టీ మూల సిద్ధాంతమన్నారు.
గద్దర్ కుమార్తె వెన్నెల పవన్ కల్యాణ్ మాటలు తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, తన తండ్రి గద్దర్ వారసత్వాన్ని అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా పవన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమైన మలుపులతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి.
పవన్ కళ్యాణ్‌పై తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.
చివరి గింజ ధాన్యం కొంటామన్న కాంగ్రెస్ సర్కార్ అప్పులు చేయడంలో రేవంత్ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని విమర్శించిన కేటీఆర్.. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్నారు.
లంగాణ ప్రజల దశాబ్దాల కల సాకారమైన రోజున ఇక్కడి సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదన్నారు. గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు తాను 11 రోజుల పాటు అన్నం తినలేదని పవన్ కల్యాణే స్వయంగా చెప్పారనీ.. అలాంటి వ్యక్తి మళ్లీ ఇప్పుడు తెలంగాణకు తాను వ్యతిరేకం కాదంటూ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని కేటీఆర్ అన్నారు.
జగన్ ఎప్పుడెప్పుడు అధికారం నుంచి దిగిపోతారా అని దేవుళ్లకు పూజలు చేశారు, శాపనార్థాలు పెట్టారు. జగన్ అధికారంలో ఉంటే తమ అమరావతి కలలు ఎప్పటికీ ఫలించవని ఆవేదన చెందారు. అలాంటిది, ఇప్పుడు అదే అమరావతికి చెందిన రైతులు తాడేపల్లిలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయ్యారనే వార్త పొలిటికల్ సర్కిల్స్ నే కాకుండా సామాన్య ప్రజలను కూడా విస్మయానికి గురి చేసింది.
దశాబ్దాలుగా కోలీవుడ్ లో సంపాదించుకున్న తన స్టార్ డమ్ ను, ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో విజయ్ సఫలమయ్యారు. వీటన్నింటికీ తోడు తమిళనాట కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజ నేతల మరణాల తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యం విజయ్ కు అనుకూలంగా మారింది.
ఈ విజయం కేవలం ఒక పదవి మాత్రమే కాదని, తన దశాబ్దాల కఠిన శ్రమకు, అంకితభావానికి దక్కిన అసలైన ఫలితమని ప్రకటించారు.
గతంలో మాతో పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఇప్పుడు పెట్టుకుంటే మూతిపళ్ళు రాలుతాయని కవిత హెచ్చరించారు. అంతేకాకుండా, అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని కట్టుకోవడం చేతకానివాళ్ళు, తెలంగాణ నవనిర్మాణం చేస్తారా అంటూ ఆమె ఎద్దేవా చేశారు.