కొడాలికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడిందా?

Publish Date:Jul 27, 2022

Advertisement

మాజీ మంత్రి కొడాలి నానికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడిందా? చెత్త పన్ను నిరసన సెగకు ఆయన మొహం మాడిపోయిందా? గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన ఏ గడపకు వెళ్లినా చెత్త పన్నుపై నిరసనలు, విమర్శలు ఎదురౌతున్నాయా?  అంటే ఔననే సమాధానం వస్తోంది. చెత్త పన్నుపై ప్రజాగ్రహాన్ని గమనించిన ఆయన తన నియోజకవర్గంలో చెత్త పన్ను వసూలు చేయవద్దని అధికారులను ఆదేశించారు. అయితే మంత్రిగా ఉండగా ఆయన మాటే శిరోధార్యంగా పరుగులు పెట్టిన అధికారులు మాజీ అయిన తరువాత ఆయన మాటను కాదు కదా.. ఆగ్రహాన్నీ, హుంకరింపునూ కూడా పట్టించుకోవడం లేదు. మీరేమన్నా సరే మా పని మాదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. చెత్త పన్ను వసూలు వద్దని ఆయన ఇచ్చిన మౌఖిక ఆదేశాలను అధికారులు అసలే లెక్క చేయలేదు. పైపెచ్చు ప్రజల ముక్కు పిండి  మరీ వసూలు చేస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో ఈ నెల చెత్త పన్ను వసూలు టార్గెట్ ను అధికారులు  ఇప్పటికే దాదాపు పూర్తి చేసేశారు. దీంతో కొడాలి నానికి గడప గడపలోనూ చెత్త పన్ను సెగే తగులుతోంది.

తాను చెప్పినా అధికారులు వినకపోవడంతో ఆయనకు ఆగ్రహం వచ్చింది. ప్రజల ఎదురుగానే అధికారులపై ఆగ్రహం, అసహనం వ్యక్తం చేసి జనం వద్ద మంచి మార్కులు కొట్టేయాలని ప్రయత్నించారు. అయినా జనం నమ్మడం లేదు. మాజీ అయిన మీ మాట అధికారులు ఎందుకు వింటారు సార్ అని సెటైర్లు వేస్తున్నారు. అదే విధంగా అధికారులు కూడా ఒక ఎమ్మెల్యే మాట విని ప్రభుత్వ ఆదేవాలను నిర్లక్ష్యం చేయలేమని అదే ప్రజల ఎదుటే నానీకి అధికారులు స్పష్టంగా చెప్పేశారు.

దీంతో ఈ విషయంలో సీఎంతోనే తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే తాను తాడో పేడో తేల్చుకోవలసింది ముఖ్యమంత్రితో అవ్వడంతో తానొక్కడి వల్లా కాదని అనుకున్నారేమో బందర్ మాజీ మంత్రి పేర్ని నాని సహాయం తీసుకోదలిచారు. అందుకు పేర్ని నాని సైతం సై అన్నారని అంటున్నారు. అయితే వీరిద్దరూ అనుకుంటే సరిపోతుందా? పవర్ లేని మాజీలాయె. అసలు సీఎం జగన్ వీరికి అప్పాయింట్ మెంటైనా ఇస్తారా అని గుడివాడలో వైసీపీ శ్రేణులే అంటున్నారు. చెత్త పన్ను విషయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు సరే సరి.. కానీ పన్నుపై ప్రజాగ్రహం మాత్రం నేరుగా ఎమ్మెల్యేలపైనే వ్యక్తం అవుతోంది. ఇది తెలిసినా జగన్ పట్టించుకోవడం లేదు. మీ బాధలు మీరు పడండి. బటన్ నొక్కి జనం ఖాతాల్లో వేలకు వేలు వేస్తుంటే.. ఆ మాత్రం చెత్త పన్నుపై వారిని కన్విన్స్ చేయలేకపోతే  మీరెందుకు? అని విసుక్కుంటున్నారని, ఇప్పటికే నియోజవర్గంలో ఎదురౌతున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళదామని ప్రయత్నించి భంగపడ్డ ఎమ్మెల్యేలు అంటున్నారు. మరి ఈ మాజీలకు చెత్త పన్ను విషయంలో సీఎం వద్ద ఎలాంటి మర్యాద దక్కుతుందో చూడాలి.

  దానికి ఆయనేమన్నారో స్పష్టత లేదు. కానీ చెత్తపన్నుపై మాత్రం నానీల ఉద్యమం ప్రారభమయిందంటున్నారు. చెత్తపన్ను విషయంలో ప్రభుత్వానికి ఎంత బ్యాడ్ నేమ్ వచ్చిందో వైసీపీ ప్రజాప్రతినిధులకు బాగా తెలుసు. మామూలుగా అయితే ఇలాంటి పన్నులు చెల్లించిన వారి దగ్గరే తీసుకుంటారు. కానీ ఇప్పుడు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. పన్ను కట్టకపోతే ఇంటి ముందు చెత్త వేయండన్న హెచ్చరికలు కూడా ధర్మాన వంటి మంత్రులు చేశారు. ఇవన్నీ సీఎంకు తెలియక కాదు. మరి ఇప్పుడు నానీలు చెప్పినంత మాత్రాన సీఎం జగన్ చెత్తపన్ను రద్దు చేస్తారా అన్నది వైసీపీలో హాట్ టాపిక్ ! 

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.