నీ యమ్మా మొగుడు చెప్పాడా..?

Publish Date:Feb 20, 2024

Advertisement

వై నాట్ 175.. వై నాట్ 175 అంటూ నిన్న మొన్నటి వరకు ఒకే పాట.. పాడిన  వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి  జగన్..  ఇటీవల నియోజకవర్గ ఇన్‌చార్జీలను టోకున మార్చేస్తుండడంతో.. అసలు పార్టీలో ఏం జరుగుతోందో తెలియని పరిస్థితిలోకి.. ఆ పార్టీలోని అగ్రనాయకులంతా దాదాపుగా వెళ్లిపోయారు. 

తాజాగా అలాంటి పరిస్థితే గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానికి సైతం ఎదురైందని, దీంతో ఆయన అనుచర వర్గం తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతుందని ఓ ప్రచారం  గుడివాడ నియోజకవర్గంలో  ఓ రేంజ్ లో సాగుతోంది. గుడివాడ నుంచి  వైసీపీ  అభ్యర్థిగా మండల హనుమంతరావును ఎంపిక చేస్తున్నారంటూ.. గుడివాడ పుర వీధుల్లో రాత్రికి రాత్రే భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. దాంతో గుడివాడ ప్రస్తుత ఎమ్మెల్యే కొడాలి నానిపై నియోజకవర్గ బదిలీ వేటు పడిందనీ, ఆయన్ని మైలవరం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దింపనున్నారంటూ ఓ ప్రచారం జోరందుకొంది. దీంతో ఈ వ్యవహారం  అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో  వైరల్ అయిపోయింది.

దాంతో ఈ వ్యవహరంపై కొడాలి నాని అనుచర వర్గం తీవ్ర స్థాయిలో నిప్పులు చెరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్నాయని.. అలాంటి వేళ పార్టీ అగ్రనాయకత్వం ఆచి తూచి అడుగు వేయాల్సి ఉందని.. అంతేకానీ.. ఇలా నిప్పు లేకుండా పొగ వచ్చినట్లు... ఇలా పలు వార్త కథనాలు ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్నాయని... ఆ వెంటనే అవి ప్రజల్లోకి బలంగా దూసుకు వెళ్తున్నాయని.... దీంతో పార్టీలోని ప్రస్తుత ప్రజా ప్రతినిధుల పరిస్థితి దారుణంగా తయారవుతోందని.. అలాంటి పరిస్థితుల్లో పార్టీలోని పెద్దలు.. ఆగమేఘాల మీద స్పందించి.. ఇవి వదంతులు మాత్రమే.. నమ్మవద్దంటూ.. ప్రెస్ మీట్ పెట్టి వివరించడం లేదా.. మీడియా వేదికగా ప్రకటించడమో చేయాలి కానీ పార్టీ అగ్రనాయకత్వం మాత్రం  పట్టనట్లుగా వ్యవహరిస్తోందని కొడాలి నాని అనుచరులు ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అదీకాక.. తమ నాయకుడు వరుసగా నాలుగు సార్లు గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారని.. అయిదో సారి కూడా ఆయన గుడివాడ నుంచే ఎమ్మెల్యేగా గెలుస్తారని వారు బల్లగుద్దీ మరీ చెబుతున్నారు. గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిని మారుస్తున్నారంటూ వదంతులు  షికారు చేయడంతో.. ఈ అంశంపై ప్రశ్నిస్తున్నవారిపై.. నీ యమ్మా మొగుడు చెప్పాడా? అంటూ నాని ఆగ్రహంతో విరుచుకుపడుతున్న ప్రచారం కూడా మరో వైపు జోరందుకుంది.  

2004లో తెలుగుదేశం అభ్యర్థిగా  తొలి సారి గుడివాడ ఎమ్మెల్యేగా గెలిచి.. అసెంబ్లీలో అడుగు పెట్టిన కొడాలి నాని.. 2009లో సైతం అదే పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ.. 2012లో  జగన్ పంచన చేరి  2014,  2019 ఎన్నికల్లో   వైసీపీ ఎమ్మెల్యేగా గుడివాడ నుంచి విజయం సాధించారు.  

ఇక జగన్ తొలి కేబినెట్‌లో పౌరసరఫరాల శాఖ మంత్రిగా కొడాలి నాని విధులు నిర్వర్తించారు. ఆ క్రమంలో ఆయన మీడియా ముందుకు వచ్చినా.. ప్రెస్ మీట్ పెట్టినా.. బూతులు కాదు బండ బూతులే మాట్లాడే వారు. ఆ క్రమంలో ఆడు చెప్పాడా.. వీడు చెప్పాడా.. నీ యమ్మ మోగుడు చెప్పాడా? అంటూ.. తన వాచలత్వాన్ని ప్రదర్శించే వారు. దీంతో నాని పౌరసరఫరాల శాఖ మంత్రిగా కాకుండా బూతు సరఫరాల శాఖ మంత్రిగా  జనాల్లో మద్ర పడిపోయారు. ఇక ఆయన అనుచర గణం సైతం గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిని మారుస్తున్నారంటూ.. మీడియాలో కథనాలను సైతం చూసి.. నీ యమ్మా మొగుడు చెప్పారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారనే ఓ ప్రచారం సైతం నియోజకవర్గంలో కొన.. సాగుతోంది.

By
en-us Political News

  
స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ.. అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.