Publish Date:May 30, 2023
మహానాడు సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఉక్రోషంతోనో, మరో కారణంతోనో వైసీపీ నేతలు తమ నోటికి పని చెప్పారు. విపక్షంపై మరీ ముఖ్యంగా విపక్ష నేత చంద్రబాబుపై నోటికి పని చెప్పాలంటే.. కొడాలి నాని అందరి కంటే ముందుంటారు. ఇప్పుడు కూడా ఎప్పటిలాగే మినీ మేనిఫెస్టోపై దుమ్మెత్తి పోయడంలో కూడా నాని ముందంజలో ఉన్నారు. చంద్రబాబు, టీడీపీ నేతలపై ఆయన తన మాటల దాడి ఉధృతి పెంచారు. ఈ క్రమంలో నాని, కాపు సామాజిక వర్గం పై చేసిన వ్యాఖ్యలు బూమరాంగ్ అయ్యాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు అంటే ఇష్టారీతిన వ్యాఖ్యలు చేసే కొడాలి నాని మహానాడులో ఆయన ప్రకటించిన మినీ మేనిఫెస్టోను విమర్శించే క్రమంలో తన బూతుల పంచాంగం విప్పారు. ఆ క్రమంలో ఆయన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి..ఇప్పుడు జయంతి ఉత్సవాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అదే ఊపులో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నారంటూ.. కాపు సామాజికవర్గాన్ని ఉద్దేశించి పరుష పదజాలం వాడారు. ఇక ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో గాని.. ఇప్పుడు కాపు వర్గం కొడాలి నానిపై ఫైర్ అవుతోంది. కొడాలి నాని కాపు వర్గానికి క్షమాపణ చెప్పాలని, ఆయనను వైసీపీ నుంచి బహిష్కరించాలని కాపులు డిమాండ్ చేస్తున్నారు.
కాపులను అసభ్యకరంగా దూషించి అవమానించిన కొడాలి నానిని వైసీపీ నుంచి బహిష్కరించాలని ఐక్య కాపునాడు, కాపు సంక్షేమ యువసేన డిమాండ్ చేసింది. కొడాలి నాని గుడి వాడలో గెలిచిందే కాపు ఓట్లతోనేనని, రాబోయే ఎన్నికల్లో గుడివాడలో ఓడించి కాపుల ఐక్యతను చాటుతామని జనసేన నేత లంకిశెట్టి బాలాజీ అన్నారు.
గుడివాడలో కాపు సామాజిక వర్గ ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. నియోజకవర్గంలో గెలుపు ఓటములను ప్రభావితం చేయగలిగే స్థాయిలో కాపు ఓట్లు ఉన్నాయి. ఇంత కాలం గుడివాడలో కాపు సామాజిక వర్గం కొడాలి నానికి మద్దతు ఇస్తూ వచ్చింది. అయితే తన నోటి దురుసుతనంతో ఇప్పుడాయన వారిని దూరం చేసుకున్నారా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. నాని కాపులకు బహిరంగంగా క్షమాపణ చెప్పకుంటే వైసీపీ ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్న స్థాయిలో కాపు సామాజిక వర్గం నుంచి హెచ్చరికలు వస్తున్నాయి.
నోటికి గట్టిగా పని చెప్పడం.. మోటుగా.. కరుకుగా సమాధానం చెప్పడం.. అలవోకగా అసభ్య పదజాలాన్ని ప్రయోగించడం.. వైకాపా నేతలకు సర్వసాధారణం. అలా బూతు మాటలను ప్రయోగిస్తేనే.... పార్టీలో గుర్తింపు లభిస్తుందన్న నమ్మకం వారిది. అయితే ఈ సారి మాత్రం నాని తన నోటీ దురుసుతనం వల్ల ఇబ్బందుల్లో పడ్డారనే చెప్పాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kodali-nani-in-trouble-25-156063.html
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.