గుడివాడ కోర్టులో కొడాలినాని.. ఎందుకో తెలుసా?
Publish Date:Jun 27, 2025
Advertisement
మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత వైసీపీ కీలక నేత కొడాలి నాని హఠాత్తుగా శుక్రవారం (జూన్ 27) గుడివాడకు వచ్చా రు . గత ఏడాది జరిగిన ఎన్ని కలలో పరాజయం తరువాత నియోజకవర్గానికి దూరంగా ఉంటున్ననాని అకస్మాత్తుగా గుడివాడకు ఎందుకు వచ్చారంటే ఓ కేసులో నానికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఆ కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు కోసం నాని గుడివాడ కోర్టుకు వచ్చారు. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావుకు చెందిన వస్త్ర దుకాణంపై దాడి జరిగిన ఘటనకు సంబంధించి కొడాలి నానిపై కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఆయన ముందుగా ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం, గుడివాడలోని కింది కోర్టులోనే బెయిల్ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన శుక్రవారం గుడివాడ కోర్టుకు హాజరై బెయిలు పొందారు. ఇందుకోసం ఆయన బెయిలుకు అవసరమైన వ్యక్తిగత పూచీకత్తు సమర్పించారు. ఇదే కేసుకు సంబంధించి ఇప్పటికే ఆయన అనుచరులు 16 మందికి కోర్టు బెయిలు మంజూరు చేసింది.
http://www.teluguone.com/news/content/kodali-nani-in-gudiwada-court-25-200803.html





