సంక్రాంతి క్లబ్‌గా కొడాలి నాని కన్వెన్షన్.. మందు, చిందు, జూదంతో గబ్బు గబ్బు..
Publish Date:Jan 16, 2022
Advertisement
అదో కన్వెన్షన్. పెళ్లిళ్లు, ఫంక్షన్లు జరిగే ఫంక్షన్ హాల్. మామూలుగా అయితే ఇంతే. కానీ, అది వైసీపీ నేత, మంత్రి కొడాలి నానికి చెందిందైతే అంత రొటీన్‌గా ఎందుకుంటుంది. కొడాలి నోరులానే.. గుడివాడ కె కన్వెన్షన్‌ను గబ్బు గబ్బు చేసేశారు. గుడివాడకు గోవా కల్చర్‌ను తీసుకొచ్చారు. సంక్రాంతి సందర్బంగా.. మందు, చిందు, జూదంతో రచ్చ రంబోలా చేస్తున్నారని అంటున్నారు. అసలే అధికార పార్టీ నేత. అందులోనూ మంత్రి. ఇక అటువైపు చూసే అధికారులు ఎవరు? అందుకే, యథేచ్చగా కన్వెన్షన్ సెంటర్‌ను జూదశాలగా మార్చేశారు. వైసీపీ నేతలు తగ్గేదే లే అంటూ మందేసి చిందేస్తున్నారు. కోడి పందాలు, పేకాట శిబిరాలు, మూడు ముక్కలాట, గుండాట, నంబర్ల ఆటలతో పాటుగా.. సంక్రాంతి స్పెషల్‌గా ప్రత్యేకంగా గోవా స్టైల్ క్యాసినో కూడా ఏర్పాటు చేశారు. 10 వేల ప్రవేశ రుసుం చెల్లిస్తేనే క్యాసినోలోకి అనుమతి. కె కన్వెన్షన్ లోపలంతా అదో టైప్ సెటప్. స్పెషల్ ఎఫెక్ట్‌గా చీర్ గాళ్స్. చిట్టిపొట్టి డ్రెస్సులతో చీర్ అప్. స్పెషల్ లైటింగ్స్‌తో స్టేజ్ ఏర్పాటు చేసి, సినిమా సాంగ్స్‌కు యువతులతో నృత్యాలు చేయిస్తున్నారు. క్యాసినో లోపల సెల్ ఫోన్లు నిషేధం. బౌన్సర్లతో టైట్ సెక్యూరిటీ. సంక్రాంతి సెలబ్రేషన్స్ పేరుతో గుడివాడ కె కన్వెన్షన్‌లో గోవా క్యాషినోలు, పేకాట క్లబ్‌లు, బోగంమేళాలు నడుపుతున్నారంటూ స్థానికులు మండిపడుతున్నారు.
http://www.teluguone.com/news/content/kodali-nani-convention-as-sankranti-club-39-130250.html