Publish Date:Sep 28, 2024
వైసీపీలో జగన్ ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటించే వారు, జగన్ చూసి రమ్మంటే కాల్చి వచ్చేంతటి వీరభక్త హనుమాన్ లలో గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముందు వరుసలో ఉంటారు. అయితే పార్టీ ఓటమి తరువాత వారిద్దరూ కూడా జగన్ మాటకు పూచికపుల్ల పాటి విలువ కూడా ఇవ్వడం లేదని తాజాగా తేటతెల్లమైంది.
అసలే తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం విషయంలో జగన్ నిండా మునిగిపోయారు. ఈ వివాదం నుంచి బయటపడటమెలాగో తెలియక గిలగిలా కొట్టుకుంటున్నారు. అలవాటైన డైవర్షన్ పాలిటిక్స్ తో ఈ వివాదం నుంచి బయటపడదామని ఆయన చేస్తున్న ప్రయత్నాలు బూమరాంగ్ అవుతున్నాయి. సరిగ్గా అదే సమయంలో పార్టీలోని కీలక నేతల నుంచి ఎదురౌతున్న ధిక్కారం ఆయనను మరింత కుంగ దీస్తున్నది. ఎలాగోలా లడ్డూ వివాదం నుంచి బయటపడటానికి ఆయన ప్రాయశ్చిత పూజలు అంటూ పార్టీ నేతలు శ్రేణులకు పిలుపు నిచ్చారు. ఈ దీక్షను తాను ముందుండి నిర్వహస్తానని ప్రకటించిన జగన్ తిరుమల వెంకటేశ్వరుడిపై విశ్వాసం ఉంది అంటూ డిక్లరేషన్ ఇవ్వడానికి ఇష్టం లేక ఏకంగా తన తిరుమల యాత్రనే రద్దు చేసుకున్నారు. నాయకుడే జారిపోయే సరికి ఆయన ఆదేశాలను పాటించే విషయంలో పార్టీ నేతలు కూడా లైట్ తీసుకున్నారు. అలా లైట్ తీసుకున్న వారిలో జగన్ వీర భక్త హనుమాన్ లుగా పేరు గాంచిన కొడాలి నాని, వల్లభనేని వంశీ కూడా ఉండటం గమనార్హం.
జగన్ తిరుమల యాత్ర రద్దు అయినా.. ఆయన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు, శ్రేణులు ఆలయాల్లో ప్రాయశ్చిత పూజలు చేయాలన్న నిర్ణయంలో మాత్రం ఎలాంటి మార్పూ లేదని జగన్ ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వైసీపీ నేతలు, శ్రేణులు తూతూ మంత్రంగా ప్రాయశ్చిత దీక్షలు చేశారు. కానీ జగన్ ఆదేశాలను కొడాలి నాని, వల్లభనేని వంశీ బేఖాతరు చేశారు. కనీసం పట్టించుకోలేదు. జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఆయన మొప్పు కోసం బూతులు, దాడులు, దౌర్జన్యాలతో రెచ్చిపోయిన వీరిరువురూ ఎన్నికలలో పార్టీ ఓటమి తరువాత చేసిన తప్పులకు ప్రాయశ్చితం ఇదే అనుకున్నారో ఏమో పూర్తిగా మౌనం వహించారు. ఎంతో అత్యవసరమైతే తప్ప ఆంధ్రప్రదేశ్ పొలిమేరల్లోకి కూడా రావడానికి సాహసించడం లేదు. ఈ తరుణంలో తాజాగా తాడేపల్లిలో జగన్ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ రివ్యూ మీటింగ్ కు వీరిరువురూ హాజరయ్యారు. ఆ సమావేశం తరువాత కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. ఆయన మాటల్లో మునుపటి ఫైర్ లేదు. ధీమా లేదు. మీడియా ముందుకు వచ్చాను కనుక తెలుగుదేశం, చంద్రబాబుపై విమర్శలు చేయాలి కనుక చేస్తున్నా అన్నట్లుగా మాట్లాడి మమ అనిపించారు.
వల్లభనేని వంశీ అయితే మీడియా ముందు నోరెత్తే ధైర్యం కూడా చేయలేదు. ఇలా వచ్చారు.. అలా వెళ్లారు అన్నట్లుగా తాడేపల్లి నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. కనీసం తమ నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఓటమి తరువాత కొడాలి నాని, వల్లభనేని వంశీ తీరుతో వారి వారి నియోజకవర్గాలలో వైసీపీ కార్యకర్తలు తీవ్ర నిరుత్సాహంలో కూరుకుపోయారు. ఇప్పుడు జగన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షలకు డుమ్మా కొట్టడం ద్వారా వారు జగన్ మాటకు పూచికపుల్ల విలువ కూడా ఇవ్వడం లేదని తేటతెల్లమైపోయింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kodali-nani-and-vallabhaneni-vamshi-ignore-jagan-directions-25-185822.html
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.