ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. దీంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్ లో కొన్ని ఆప్ ముచ్చటగా మూడో సారి అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమని అంచనా వేస్తే మరి కొన్ని ఢిల్లీపీఠంపై కమలనాథుల జెండా ఎగరడం ఖాయమని పేర్కొన్నాయి. కాంగ్రెస్కు జీరో నుంచి 3 స్థానా లు గెలిచే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స తెలిపాయి.
కేకే సర్వే అయితే ఢిల్లీలో ఆప్ మరోసారి అధికార పగ్గాలు చేపట్టనున్నట్లు పేర్కొంది. ఆ పార్టీ పోటీ చేసిన 70 స్థానాలకు గాను 44 స్థానాలలో విజయం సాధిస్తుందని పేర్కొంది. బీజేపీ 26 స్థానాలలో విజయం సాధిస్తుందని పేర్కొంది. కాంగ్రెస్ ఖాతా తెరిచే అవకాశాలు మృగ్యమని పేర్కొంది. ఇక హోరాహోరీ పోటీ ఉన్న స్థానాలలో ఫలితం కొంచం అటూ ఇటైనా ఆప్ కచ్చితంగా 39, బీజేపీ 22 స్థానాలలో విజయం సాధిస్తుందని పేర్కొన్నాయి. ఇక మిగిలిన తొమ్మిది నియోజకవర్గాలలో ఫలితం ఫొటో ఫినిష్ ఉంటుందని కేకే సర్వే పేర్కొంది.
పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీ 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో 51 నుంచి 50 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది. ఇక అధికారంలో ఉన్న ఆప్ కేవలం 10 నుంచి 19 స్థానాలతో సరిపెట్టుకుంటుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ తేల్చింది. కాంగ్రెస్ ఈ సారి కూడా ఖాతా తెరిచే అవకాశాలు లేవని అంచనా వేసింది.
ఐ మ్యాక్ త్రీ ఎగ్జిట్ పోల్ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 24 నుంచి 36 స్థానాలలోనూ, బీజేపీ 41 నుంచి 43 స్థానాలలోనూ గెలిచే అవకాశాలున్నాయని పేర్కొంది. కాంగ్రెస్ 1 నుంచి 2 స్థానాలలో గెలుస్తుందని అంచనావేసింది. ఇతరులు 1 నుంచి 2 స్థానాలలో గెలుస్తారని పేర్కొంది. ఈ ఎగ్జిట్ పోల్ బీజేపీ అధికారపగ్గాలు చేపడుతుందని పేర్కొంది. న్యూస్ ఆప్టిక్స్ కూడా బీజేపీకే అధికార పగ్గాలు అందుతాయని పేర్కొంది. ఆప్టిక్స్ ఎగ్జిట్ పోల్ ప్రకారం ఆప్ కు 24 నుంచి 28, బీజేపీకి 35 నుంచి 44 కాంగ్రెస్ 2 నుంచి 4 స్థానాలలోనూ గెలుస్తుందని పేర్కొంది. ఇతరులు ఒక స్థానంలో గెలిచే అవకాశాలున్నాయని అంచనా వేసింది.
చాణక్య స్ట్రాటజీస్ అంచనా ప్రకారం బీజేపీ 39 నుంచి 44 స్థానాలు, ఆప్ 25 నుంచి 28 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 2 నుంచి 3 స్థానాలు గెలుచుకోవచ్చని తెలిపింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kk-survey-predic-app-retain-power-39-192429.html
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు.
నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.
వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క్ జగన్ ను తన కుమారుడి వివాహానికి జనగ్ ను బెంగళూరు వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. అయితే జగన్ స్వయంగా తాను మంగళవారం తాడేపల్లి వస్తాననీ, అప్పుడు ఆహ్వానిస్తే సరిపోతుందనీ కబురు పంపారు.
ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే మండలి సభ్యత్వానికి వారు చేసిన రాజీనామాలను చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు.
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
రాజ్యసభ ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే, తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఒకరికే ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు, ఆయనకు తలంబ్రాలు అందించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చేతిలోని పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని తన తలపై పెట్టుకున్నారు.
జగన్ హయాంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్న మంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా 198 సాగునీటి ప్రాజెక్టులకు ప్రీ-క్లోజర్ ఇస్తే, వాటిలో 102 ప్రాజెక్టులు రాయలసీమలోనే ఉన్నాయని గుర్తుచేశారు.
వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకుడిగా, బూతుల నానిగా అనితర సాధ్యమైన గుర్తింపు ఉన్న కొడాలి నాని, 2024 ఎన్నికలలో వైసీపీ పరాజయం, గుడివాడ నియోజకవర్గంలో తాను స్వయంగా ఓడిపోవడంతో వెనక్కు తగ్గారు. కేసుల భయంతో మౌనాన్ని ఆశ్రయించారు. అసలు రాజకీయాలలో ఉన్నారా లేరా అన్నంతగా సైలెంట్ అయిపోయారు.
జగన్ రాష్ట్రానికి చుట్టపు చూపుగా మాత్రమే వచ్చి అత్యధికంగా బెంగళూరులోనే మకాం ఉంటుండం ఒక కారణమైతే.. రాష్ట్రానికి, సొంత జిల్లాకు వచ్చినప్పుడు కూడా కార్యకర్తలు, నాయకులకు అప్పాయింట్ మెంట్ దొరకని పరిస్థితి మరో కారణంగా చెబుతుంటారు. ముఖ్యంగా జగన్ అందుబాటులో లేకపోవడం ప్రభావం ఆయన సొంత జిల్లా కడపలో మరీ తీవ్రంగా ఉంది.
కవిత సైతం తన వల్ల పార్టీ ఎలా ఓడిపోయిందని ప్రకటించి చేతులు దులుపుకోవడం కాదు.. అందుకు సంబంధించి వివరణ ఇవ్వాలనీ, లెక్కలు తేల్చాలనీ డిమాండ్ చేయడం ద్వారా మొత్తం బీఆర్ఎస్ నే డిఫెన్స్ లో పడేశారు. దాని నుంచి బయటపడడానికి ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ రంగంలోకి దిగి.. అప్పటి కేటీఆర్, కేసీఆర్ ల ప్రసంగాలు, ప్రకటనలను రీ పోస్టు చేస్తూ హడావుడి చేస్తున్నది.
తుమ్మల నాగేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో కలిసి ఐదు రోజుల కిందట దుబాయ్ వెళ్లారు. మంత్రి కుటుంబ సభ్యులలో ఒకరు అనారోగ్యంతో ఉండటంతో మెరుగైన చికిత్స అందించడం కోసం ఆయన దుబాయ్‌కు వెళ్లినట్లు సమాచారం. చికిత్స అనంతరం తిరిగి రావాలని భావిస్తున్న తరుణంలో పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చి, ఆ ప్రభావంతో దుబాయ్ విమానాశ్రయం మూతపడింది.