Publish Date:May 21, 2025
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు. తిరుపతి గంగమ్మ జాతరలో ముఖ్యమంత్రి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
Publish Date:May 21, 2025
తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం (మే 22) హస్తిన పర్యటనకు వెడుతున్నారు. ఈ సారి ఆయన హస్తినలో మూడు రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
Publish Date:May 21, 2025
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం అని, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల బాధ్యత తాను తీసుకుంటానని, ఇంటికి పెద్దకొడుకులా అండగా ఉంటానని మంత్రి నారా లోకేష్ అన్నారు.
Publish Date:May 21, 2025
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, నాంపల్లి, చార్మినార్, కోఠి అబిడ్స్, రామంతపూర్, అంబర్‌పేట్ సికింద్రాబాద్ సహా పలు ప్రాంతాల్లో భారీ వాన పడుతోంది.
Publish Date:May 21, 2025
కాదేదీ అవినీతికి అనర్హం. ఈ మాట ఏ కవీ అని ఉండకపోవచ్చును కానీ, అది నిజం. చారిత్రక సత్యం. అందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ మినహాయింపు కాదు. అవును. చిన్న చిన్న చిల్లర పనుల్లోనే స్కాములు జరుగతున్న ప్రస్తుత పరిస్థితులలో వేల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి జరగక పోతే ఆశ్చర్య పోవాలే కానీ అవినీతి జరిగితే అందులో ఆశ్చర్య పోవలసిన అవసరం లేదు.
Publish Date:May 21, 2025
అడవి ఏనుగులను బంధించడానికి, శాంతింప చేయడానికి, మందను మేపడానికి, సంఘర్షణాత్మక పరిస్థితుల్లో అడవిలోంచి వచ్చిన ఏనుగులను తిరిగి అడవిలోకే పంపడానికీ..కుంకీ ఏనుగులను ఒక అంకుశంలా వాడుతారు.
Publish Date:May 21, 2025
తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావుకు ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలాంబ షోకాజ్ నోటీసులు పంపించారు.
Publish Date:May 21, 2025
విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ విస్తృతంగా ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పిన నాని మళ్లీ అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారట.
Publish Date:May 21, 2025
ఛత్తీస్ గఢ్ లో బుధవారం (మే 21) ఉదయం జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో 28 మంది మావోయిస్టులు హతమయ్యారు. మరణించిన వారిలో మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్, అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన క్లైమోర్ మైన్స్ దాడి సూత్రధారి నంబాల కేశవరావు అలియాస్ గగన్నా కూడా ఉన్నారు.
Publish Date:May 21, 2025
ఆంధ్రాలో వైసీపీ ఘోర పరాజయం తర్వాత పార్టీలో నేతల అంతర్గత విశ్లేషణల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు 175 అసెంబ్లీ స్థానాల్లో 151 స్థానాలు గెలుచుకుని తిరుగులేని మెజారిటీతో ఉన్న వైసీపీ గత ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. వై నాట్ 175 అంటూ హడావుడి చేసిన జగన్ పార్టీని ప్రజలు ఛీత్కరించారు.
Publish Date:May 21, 2025
ఏపీ తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫుల్ గా క్లాస్ పీకారు. పార్టీ క్రమశిక్షణ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని దాదాపుగా హెచ్చరించినంత పని చేశారు.
Publish Date:May 21, 2025
ఉత్తరాఖండ్ లో కొండ చరియలు విరిగిపడ్డాయి. పిలోరాగఢ్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడటంతో దాదాపు 180 మంది కైలాస్ మానసనరోవర్ యాత్రికులు మార్గ మధ్యంలో చిక్కుకుపోయారు. యాత్ర మార్గంలో కొండ చరియలు విరిగి పడటంతో వారు ఎటూ కదలలేని పరిస్థితి ఏర్పడింది.
Publish Date:May 21, 2025
వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో తీవ్రవాదం లేకుండా చేయాలన్న లక్ష్యంతో కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. ఈ ఆపరేషన్ లో భాగంగా ఇప్పటికే పలు ఎన్ కౌంటర్లలలో వందల మంది మావోయిస్టులు హతమయ్యారు.