కర్ణాటకలో కింగ్ మేకర్ జెడిఎస్

Publish Date:May 11, 2023

Advertisement

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో, ఎగ్జిట్ పోల్‌లలో చాలా వరకు కాంగ్రెస్‌కు బలం చేకూర్చాయి, వాటిలో మూడు అధికార బిజెపీతోతో గట్టి పోటీలో నిలిచాయి. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీని అందించాయి. మే 13న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 122 నుండి 140 సీట్లు సాధిస్తుందని అంచనా.  న్యూస్ 24-టుడే చాణక్య ఎగ్జిట్ పోల్ కాంగ్రెస్  పార్టీ 120 సీట్లు గెలుచుకుంటుందని అంచనా . 224 మంది సభ్యుల సభలో అధికార బిజెపి మెజారిటీ సాధిస్తుందని కేవలం ఒక పోల్‌స్టర్-న్యూస్ నేషన్-సిజీఎస్ అంచనా వేసింది. చాలా సర్వేలు జేడీ(ఎస్)కి 20-స్థానాలు వస్తాయని అంచనా వేసింది. 2018 ఎన్నికల్లో ఆ పార్టీ 37 స్థానాలు గెలుచుకుంది. బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన మొదటి దక్షిణాది రాష్ట్రం కర్ణాటక కావడం విశేషం.  సర్వేల ప్రకారం అధికారం బీజేపీ నుంచి కాంగ్రెస్ చేతుల్లోకి మారనుంది. 

ప్రధానమంత్రి నరేంద్రమోదీ  ప్రచారంతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తుంది. 2024లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలోపు బలమైన పునరాగమనం చేయాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్)ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఎన్నికల సంఘం ప్రకారం 72.67 శాతం ఓటింగ్ నమోదైంది. కాంగ్రెస్ , జనతాదళ్ (సెక్యులర్) 2018 ఎన్నికలలో మిత్రపక్షాలుగా పోటీ చేసి  పరాజయం చెందాయి. 
జనతాదళ్ (సెక్యులర్)తో ఎన్నికల తర్వాత పొత్తు ఉండదని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ బుధవారం ఉదయం  విలేకరులతో అన్నారు.2018 ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్, జెడిఎస్ జతకట్టాయి. అయితే తిరుగుబాటు ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలో చేరడంతో వారి ప్రభుత్వం కూలిపోయింది.  "జెడిఎస్‌తో పొత్తుకు అవకాశాలు లేవు. మేమే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం"అని శివకుమార్ అన్నారు. కర్ణాటకలో హంగ్ ఏర్పడే అవకాశాలు లేవని తెలుస్తోంది.  అధికారంలో వచ్చే పార్టీలకు జేడీఎస్   మద్దత్తు ఇస్తే సరిపోతుంది. కాబట్టి జెడిఎస్ కింగ్ మేకర్ అని చెప్పొచ్చు. గతంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న జెడీఎస్ ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా? బిజెపీతో పొత్తు పెట్టుకుంటుందా? వేచి చూడాలి.
 

By
en-us Political News

  
తండ్రి అంటే పిల్లలకు ఉండే ప్రాణం, ఆప్యాయత ఎంతో గొప్పవి. కానీ ఆ ప్రేమ కొన్నిసార్లు ఊహకందని వింత నిర్ణయాలకు దారితీస్తుంది.
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో తీవ్ర కలకలం రేపిన ఉదంతంలో ఒకరు దారుణ హత్యకు గురయ్యారు.
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
జమ్మూకశ్మీర్‌‌లోని కతువా జిల్లాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్‌ నగరంలోని నిమ్స్‌ అదనపు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నోరి లక్ష్మీ భాస్కర్‌పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తును ముమ్మరం చేసింది.
హైదరాబాద్‌లోని టెక్ హబ్ మాదాపూర్‌లో జరిగిన ఒక సంచలన ఘటన కలకలం రేపింది.
దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది
డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.. పబ్‌కు తీసుకెళ్లి రూ.29 వేల బిల్లు.!
హైదరాబాద్ నగరంలోని ఎస్‌ఆర్‌ నగర్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపిన ఒక విషాదకర ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోయింది.
అరుణాచల్ ప్రదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.