ఎన్నాళ్లకెన్నాళ్లకు.. కొట్టేశాడు కోహ్లీ సెంచరీ..!

Publish Date:Sep 8, 2022

Advertisement

ఎన్నాళ్లకెన్నాళ్లకు..విరాటుడి బ్యాట్ నుంచి పరుగుల ప్రవాహం. ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈ నాడే ఎదురైందన్నట్లు.. దాదాపు మూడేళ్లుగా విరాట్ కోహ్లీ ఫామ్ కోల్పోయి పరుగులు రాబట్టలేక ఇబ్బందులు పడుతుంటే.. ఆభిమానులు మళ్లీ పూర్వపు ఫామ్ ను ఎప్పుడు అందిపుచ్చుకుంటాడా అని ఎదురు చేస్తున్నారు.

ఆ ఎదురు చూపులు ఎట్టకేలకు ఫలించాయి. ఆసియా కప్ లో భాగంగా గురువారం ఆప్ఘనిస్థాన్ తో జరిగిన నామమాత్రపు మ్యాచ్ విరాట్ కోహ్లీ అద్బుత బ్యాటింగ్ విన్యాసాలకు వేదికైంది. తనకు మాత్రమే సాధ్యమైన క్లాసిక్ బ్యాటింగ్ మ్యాజిక్ ను కోహ్లీ ప్రదర్శించాడు.

కళ్లు చెదిరే షాట్లతో పరుగుల పండుగ చేసుకున్నాడు. కేవలం 53 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 61 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ  122 పరుగులతో అజేయింగా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్ లో కోహ్లీకి ఇది 71వ శతకం. టి20లలో కోహ్లీకి ఇది తొలి శతకం. 2019 నవంబరులో బంగ్లాదేశ్‌తో టెస్టులో సెంచరీ తరువాత కోహ్లీ సాధించిన తొలి సెంచరీ ఇది.  ఇక అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో సచిన్ (100) తరువాత పాంటిగ్ (71)తో కలిసి కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు.

రోహిత్ ఈ మ్యాచ్ ఆడకపోవడంతో కోహ్లీ ఓపెనర్ గా వచ్చాడు. రాహుల్ తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన కోహ్లీ ఆకాసమే హద్దుగా చెలరేగాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. అందులో కోహ్లీ స్కోరే 122. రాహుల్ 52 పరుగులు చేశాడు. కోహ్లీ స్కోరులో 12 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. ఇక ఛేదనలో ఆప్ఘనిస్థాన్ చేతులెత్తేసింది. భువనేశ్వర్ నిప్పులు చెరిగే బంతులతో ఆప్ఘన్ టాప్ ఆర్డర్ ను కుప్ప కూల్చాడు. నాలుగు ఓవర్లలో కేవలం నాలుగు పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు.

ఆప్ఘన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 111 పరుగులు మాత్రమే చేయగలిగింది. 101 పరుగుల ఆధిక్యంతో భారత్ ఘన విజయం సాధించింది. ఇప్పటికే ఆసియాకప్ నుంచి నిష్క్రమించిన భారత్ కు ఇది ఊరటనిచ్చే విజయం. అయితే ఈ విజయం కంటే కోహ్లీ పూర్వపు ఫామ్ ను అందిపుచ్చుకుని సెంచరీతో చెలరేగడం మాత్రం ఆసియా కప్ విజేతగా నిలిస్తే వచ్చే ఆనందం కంటే ఎన్నో రెట్ల ఆనందాన్నిచ్చింది. కోహ్లీ ఫామ్ ను అందిపుచ్చుకుని సెంచరీతో చెలరేగడం భారత జట్టులోనూ, కోహ్లీ అభిమానుల్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులందరిలోనూ ఆనందాన్ని నింపింది. కోహ్లీని అభినందిస్తూ ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. డివీలియర్స్ వంటి క్రికెటర్లే కాదు.. ప్రధాని మోడీ,  తెలంగాణ మంత్రి కేటీఆర్ వంటి వారు కూడా కోహ్లీని అబినందిస్తూ ట్వీట్లు చేశారు. కోహ్లీ ఈ సెంచరీని తన కుమార్తెకు అంకితం చేశాడు.

By
en-us Political News

  
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్.. ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జగిత్యాల వేదికగా జరిగిన సభ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ చరిత్రను పరిశీలిస్తే నాదెండ్ల భాస్కరరావుకు, చంద్రబాబు నాయుడుకు మధ్య సుదీర్ఘమైన రాజకీయ వైరం ఉంది. 1984లో ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఆపై నాదెండ్ల ముఖ్యమంత్రి కావడం వంటి సంఘటనలు తెలుగు రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.
న్టీఆర్ అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చేలోపు, నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ చెల్లాచెదురు కాకుండా, ఎమ్మెల్యేలను ఏకం చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. పార్టీని కాపాడిన రక్షకుడి ఇమేజ్ ఆయనకు అప్పుడే వచ్చింది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిథి స్టాలిన్, టీవీకే అధినేత విజయ్, బీజేపీ నాయకురాలు ఖుష్బు, కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని చంద్రబాబు స్వాగతిస్తూనే.. ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చే ఎవరినైనా ఆహ్వానించాల్సిందేనన్నారు. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో రాణించడానికి సరిపోదనీ, రాజకీయాలలో పట్టుదల, సహనం చాలా ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ పరిస్థితిని గమనిస్తే నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పార్టీలో కీలక నేతలు ఉన్నప్పటికీ, వారంతా సమష్టిగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చంద్రంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ కేడర్‌ అయోమయంలో పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్‌గా కన్నబాబు నియామకం తరువాత స్థానిక నేతల నుంచి ఆయనకు ఏ మాత్రం సహకారం అందడం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.