మూడు లీటర్ల పెట్రోల్ కు కిలో టమోట.. తగ్గేదేలే..
Publish Date:Nov 23, 2021
Advertisement
తెలుగు రాష్ట్రాల్లో టమోట ధర చుక్కలు చూపిస్తోంది. గతంలో ఎప్పుడు లేనంతగా టమోట ధరలు మండిపోతున్నాయి. టమోటకు ప్రసిద్ధి గాంచిన చిత్తూరు జిల్లా మార్కెట్లలోనూ రేట్లు రోజురోజుకు ఎవరూ ఊహించని రీతిలో పెరిగిపోతున్నాయి. చిత్తూరు జిల్లా వికోట మార్కెట్ రేటు చుక్కలనంటింది. ఎన్నడూ లేని విధంగా పస్ట్ గ్రేడ్ క్వాలిటి టమోట కిలో రూ.250పలికింది. పది కేజిల టమోట బాక్స్ ధర 2500వరకు పలికింది. టమోట మార్కెట్ కు తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన మదనపల్లి మార్కెట్ లోనూ టమోట ధర విపరీతంగా పెరిగిపోతోంది. అక్కడ కూడా మొదటి రకం క్వాలిటీ టమోట కేజీ 230 నుంచి 250 వరకు పలుకుతోంది. దీంతో టమోట సేల్స్ భారీగా పడిపోయాయని చెబుతున్నారు. మార్కెట్ లోనే కిలో టమోట ధర 250 పలుకుతుండగా.. రిటైల్ మార్కెట్లలో 3 వందల నుంచి 350 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగిపోవడంతో జనాలు చుక్కలు చూస్తున్నారు. అయితే ఇప్పుడు మూడు లీటర్ల పెట్రోల్ రేటుకు కిలో టమోట వస్తోంది. గత రెండు సంవత్సరాలుగా కరోనా,అతివృష్టి తో టమోట రైతులు తీవ్రంగా నష్టపోయారు..గత నెల రోజులుగా చిత్తూరు, అనంతపురం,కడప జిల్లాలలో టమోట పండించే ప్రాంతాలలో వరుస వర్షాలు కురవడంతో టమోట తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి..దీంతో దిగుబడి తక్కువ కావడంతో ధరలు పెరిగాయి..ఈ దరలు మరో మూడు నెలల పాటు ఉండే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు. మరోవైపు వినియోగదారులు మాత్రం పెరిగిన ధరలతో అల్లాడిపోతున్నారు. కూరల్లో ఇష్టంగా తినే టమోట కొన్ని రోజులుగా వంటకాలకు దూరమైందని చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/kg-tomato-rate-crossed-300-rupees-in-madanapalli-market-39-126996.html





