చంద్రబాబు నివాసంలో కీలక సమావేశం .. అభ్యర్థుల మార్పుపై చర్చ
Publish Date:Apr 12, 2024
Advertisement
ఎపీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. కూటమిలోని అన్ని పార్టీలు కలిసికట్టుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. తాజాగా అమరావతిలోని చంద్రబాబు నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జనసేనాని పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్ధార్థ్ నాథ్ సింగ్ కూడా భేటీ అయ్యారు. ఎన్నికల వ్యూహరచన, ఉమ్మడి మేనిఫెస్టో, రాష్ట్ర ప్రచారానికి జాతీయ నేతలను ఆహ్వానించడం తదితర అంశాలపై వీరు చర్చిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సీట్లలో అభ్యర్థుల మార్పుపై వీరు చర్చించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో బీజేపీకి బదులుగా టీడీపీ పోటీ చేయడం, దీనికి బదులుగా చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి బీజేపీకి అవకాశం ఇవ్వడం వంటి అంశాలపై నేతలు చర్చించారు. ఉండి నియోజకవర్గం అభ్యర్థి రఘురామ రాజు గెలుపుకోసం త్రి కూటమి చేయాల్సిన విధుల మీద చర్చ జరిగింది. ఉండి దేశం నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. నేతల మధ్య అభిప్రాయ బేధాలను నిర్మూలించడానికి చంద్రబాబు చర్చలు జరిపారు. ఉండి ఎమ్మెల్యే శివరామరాజు ను ఒప్పించడానికి చంద్రబాబు జరిపిన చర్చలు ఫలించాయి.అనపర్తి నియోజకవర్గ అభ్యర్థి మీద చర్చ జరిగింది. మార్పు కోరుకుంటున్న స్థానాల మీద త్రి కూటమి నేతలు చర్చించారు. ఈ సమావేశం తర్వాత టిడిపి అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ కల్సి ఉమ్మడి సభల్లో పాల్గొన్నారు.
http://www.teluguone.com/news/content/key-meeting-at-chandrababu-residence--discussion-on-change-of-candidates-25-173664.html





