మావోయిస్టుల పునరావాసంపై కీలక భేటీ

Publish Date:Mar 4, 2026

Advertisement

తెలంగాణ రాష్ట్ర పరిపాలన, భద్రతా వ్యవస్థ బలోపేతంపై కీలక చర్చలు జరిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం (మార్చి 4) ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా సాగిన ఈ భేటీలో  రాష్ట్ర భద్రతా పరిస్థి తులు, పెరుగుతున్న నగరీకరణకు అనుగుణంగా పోలీసు వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ, మావోయిస్టుల లొంగుబాట్లు, పునరావాసం వంటి అంశాలపై చర్చ జరిగింది.  ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి వెంటన తెలంగాణ డీజీపీ  బి. శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్, ఎస్‌ఐబి ఐజీ బి. సుమతి తదితర ఉన్నతాధికారులు ఉన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను, ముఖ్యంగా సైబర్ నేరాల నియంత్రణలో అమలు చేస్తున్న వ్యూహాలను సీఎం ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రికి వివరించారు. 

హైదరాబాద్ మహానగర విస్తరణతోపాటు డిజిటల్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సైబర్ నేరాల నియంత్రణ కీలకమైందని సీఎం ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చేపడుతున్న చర్యలు, అంతర్రాష్ట్ర మోసగాళ్లపై జరుగుతున్న ఆపరేషన్ల వివరాలను రేవంత్ అమిత్ షాకు పూసగుచ్చినట్లు చెప్పారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక శిక్షణ పొందిన అధికారుల అవసరం పెరుగుతోందన్నారు.   

ఇటీవల హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్తగా  ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయాన్నికేంద్ర హోంమంత్రికి వివరించిన సీఎం రేవంత్.. వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణ, పరిశ్రమల వృద్ధి దృష్ట్యా రాష్ట్రానికి మరిన్ని ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని, తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని కోరారు.  

రాష్ట్రంలో ఇటీవల అజ్ఞాతాన్ని వీడి బయటకు వచ్చిన మావోయిస్టు నాయకుల అంశం కూడా ఈ భేటీలో చర్చకు వచ్చింది. గత రెండేళ్లలో మొత్తం 591 మంది మావోయిస్టులు ఆయుధాలు వదిలి   జీవన స్రవంతిలో కలిశారు.   లొంగిపోయిన  మావోయిస్టులకు  ప్రభుత్వం అందిస్తున్న పునరావాస ప్యాకేజీలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ఉపాధి అవకాశాల గురించి సీఎం ఈ భేటీలో అమిత్ షాకు వివరించారు. 
మిగిలిన మావోయిస్టు నేతల లొంగుబాటుకు అనుకూల వాతావరణం కల్పించేందుకు కేంద్రం, రాష్ట్రం సమన్వయం అవసరమని సీఎం అభిప్రాయపడ్డారు.

వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు కేంద్ర  మరింత సహకారం అందించాలని కోరారు. ఈసమావేశంలో ప్రస్తావించిన అంశాలపై కేంద్ర హోంమంత్రి సానుకూ లంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఐపీఎస్ క్యాడర్ పెంపు, భద్రతా బలోపేతానికి అవసరమైన మద్దతు అంశాలపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హోంమంత్రి అమిత్ షా సీఎం రేవంత్ కు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.  ఈ భేటీతో రాష్ట్ర భద్రతా వ్యవస్థకు సంబంధించి కీలక నిర్ణయాలకు మార్గం సుగమమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

By
en-us Political News

  
సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది.
సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ కొనసాగుతున్నది. సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు.
కొద్దికాలం కిందట శరద్ పవార్ తాను రాజ్యసభకు పోటీ చేసే ప్రశక్తే లేదని ప్రకటించారు. అయితే ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు. నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.
వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క్ జగన్ ను తన కుమారుడి వివాహానికి జనగ్ ను బెంగళూరు వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. అయితే జగన్ స్వయంగా తాను మంగళవారం తాడేపల్లి వస్తాననీ, అప్పుడు ఆహ్వానిస్తే సరిపోతుందనీ కబురు పంపారు.
ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే మండలి సభ్యత్వానికి వారు చేసిన రాజీనామాలను చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు.
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
రాజ్యసభ ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే, తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఒకరికే ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు, ఆయనకు తలంబ్రాలు అందించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చేతిలోని పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని తన తలపై పెట్టుకున్నారు.
జగన్ హయాంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్న మంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా 198 సాగునీటి ప్రాజెక్టులకు ప్రీ-క్లోజర్ ఇస్తే, వాటిలో 102 ప్రాజెక్టులు రాయలసీమలోనే ఉన్నాయని గుర్తుచేశారు.
వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకుడిగా, బూతుల నానిగా అనితర సాధ్యమైన గుర్తింపు ఉన్న కొడాలి నాని, 2024 ఎన్నికలలో వైసీపీ పరాజయం, గుడివాడ నియోజకవర్గంలో తాను స్వయంగా ఓడిపోవడంతో వెనక్కు తగ్గారు. కేసుల భయంతో మౌనాన్ని ఆశ్రయించారు. అసలు రాజకీయాలలో ఉన్నారా లేరా అన్నంతగా సైలెంట్ అయిపోయారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.