నాసిక్ టీసీఎస్ కేసులో కీలక పరిణామాలు
Publish Date:Apr 18, 2026
Advertisement
నాసిక్‌లోని టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్ ) యూనిట్ లో లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించి సంస్థ అధికారికంగా స్పందించి, స్వతంత్ర విచారణ ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, టీసీసీ ప్రత్యేక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. విచారణ పారదర్శ కంగా జరగాలనే ఉద్దేశంతో ప్రముఖ సంస్థలు డెల్లాయిట్, త్రిలిగల్ సహకారంతో విచారణ చేపట్టింది. ఈ కమిటీ పనితీరును టీసీసీ ప్రెసిడెంట్, సీఈవో క్రితివాసన్ పర్యవేక్షిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. మాజీ ఉద్యోగుల ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు ఇప్పటివరకు 9 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. ఈ కేసు లో ఏడుగురిని అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు. 2022 నుండి 2026 మధ్య కాలంలో పని చేసిన మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు జరిగా యని ప్రాథమిక విచారణలో తేలినట్లు సమా చారం. ఈ కేసులో కీలక నిందితురాలిగా పేర్కొన బడుతున్న నిధి ఖాన్ గురించి సంస్థ స్పష్టీకరణ ఇచ్చింది. ఆమె హెచ్ఆర్ మేనేజర్ కాదని, కేవలం ప్రాసెస్ అసోసియేట్‌గా మాత్రమే పని చేస్తుందని, రిక్రూట్ మెంట్ బాధ్యతలతో ఆమెకు సంబంధం లేదని టీసీఎస్ వెల్లడించింది. ఉద్యోగుల భద్రత, గౌరవం, సంక్షేమం విషయంలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తామని సంస్థ పునరుద్ఘాటించింది. నాసిక్ యూనిట్ మూసి వేసిందనే వార్తలను ఖండిస్తూ, కంపెనీ కార్యకలా పాలు సాధారణంగా కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది. మరోవైపు ప్రధాన నిందితురాలి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/key-developements-in-tcs-nasik-case-36-217667.html





