కేశినేనీ.. నీ రూటు ఏ గూటికి?

Publish Date:Jul 22, 2022

Advertisement

విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని సొంత పార్టీ  తెలుగుదేశంపైన  కొంతకాలంగా వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే క్రమంలో మరోసారి టీడీపీపై తన ట్విట్టర్ పేజీలో సంచలన వ్యాఖ్యలు పోస్టు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీలో నాని మీడియాతో ఆఫ్ ది రికార్డు మాట్లాడుతూ.. చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెను దుమారమే లేపాయి. తాజాగా సోషల్ మీడియాలో కూడా సొంత పార్టీ నేతలపై కేశినేని నాని నిప్పులు చెరుగుతూ పోస్టులు పెట్టారు.  వారి తీరు చూస్తుంటే తనకు ‘యదార్థవాది.. లోక విరోధి’ సామెతను గుర్తుకు వస్తోందని వ్యాఖ్యానించారు. తనను కొన్ని రోజులు  బీజేపీలోకి.. మరి కొన్ని రోజులు వైసీపీలోకి పంపించే బదులు.. చెప్పింది అర్థం చేసుకుని.. పార్టీని పటిష్ట పరుచుకుని.. అధికారంలోకి ఎలా తీసుకురావాలో ఆలోచిస్తే మంచిది’ అంటూ పార్టీ నాయకత్వాన్ని ఉద్దేశిస్తూ పోస్టు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.

కేశినేని నాని టీడీపీకి దూరమయ్యే క్రమంలోనే ఇలాంటి పోస్టులు పెడుతున్నారనే విమర్శలు ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. కేశినేని నానికి విజయవాడ టీడీపీ అధ్యక్షుడు బుద్దా వెంకన్న, మరో నేత నాగుల్ మీరాతో  తీవ్ర విభేదాలు ఉన్నాయి. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో.. కేశినేని నాని తన బస్సుల వ్యాపారం విషయంలో అప్పటి రవాణాశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిపై ఫైర్ అయ్యారు. అనంతరం నాని తన బస్సుల వ్యాపారం వదిలిపెట్టారు . కేశినేని నాటి 2019లో మరోసారి ఎంపీగా గెలిచిన తర్వాతే విజయవాడ నగర టీడీపీలో ముసలం మొదలైందంటున్నారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఈ విభేదాలు మరింతగా ముదిరిపోయాయంటున్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చే విషయంలో బుద్దా, నాగుల్ మీరా- కేశినేని నాని మధ్య వివాదం రేగింది. విజయవాడ మేయర్ అభ్యర్థిగా కేశినేని నాని కుమార్తె శ్వేత పేరు ప్రచారంలోకి వచ్చింది. అందుకు బుద్దా, నాగుల్ మీరా వర్గాలు ససేమిరా అన్నాయి. దీంతో కేశినేనికి వారిపై ఆగ్రహం వచ్చిందని చెబుతారు.

వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని కేశినేని నాని గతంలోనే ప్రకటించారు. నాని సొంత పార్టీ నేతలపై విమర్శలు చేస్తున్న తీరుతో.. పార్టీ వ్యవహారాలకు ఆయన దూరంగా ఉంటున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయం వైపు టీడీపీ నాయకత్వం ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో నాని సోదరుడు కేశినేని చిన్నికి వచ్చే ఎన్నికల్లో విజయవాడ లోక్ సభ అభ్యర్థిగా నిలబెడుతుందని అంటున్నారు. ఆ అక్కసుతోనే నాని తన సోదరుడిపైన పోలీసులకు, లోక్ సభ కార్యదర్శికి ఫిర్యాదు చేశారంటున్నారు.

తన ఎంపీ స్టిక్కరును కారుకు అంటించుకుని ఒక అజ్ఞాత వ్యక్తి తిరుగుతున్నాడంటూ కేశినేని నాని పోలీసులకు, లోక్ సభ కార్యదర్శికి కొద్ది రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో కాదు.. నాని సొంత తమ్ముడు కేశినేని చిన్ని. టీడీపీ వ్యవహారాల్లో చిన్ని చురుగ్గా పాల్గొంటున్నారు. ఆ పార్టీకి దూరం జరిగే యత్నాల్లో నాని ఉన్నారని, అందుకే చిన్నిపైన, ఆయన సతీమణి పైన ఫిర్యాదులు చేశారంటున్నారు.

నిజానికి కేశినేని నానికి బీజేపీ ముఖ్య నేతలతో మంచి సంబంధాలే ఉన్నాయి. అందుకే ఆయన టీడీపీని వీడి బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. తాజాగా ఆయన వైసీపీ నాయకులతో చనువుగా ఉంటున్నారట. ఈ ప్రచారం రాజకీయ వర్గాల్లో బాగా జరుగుతోంది. ఈ క్రమంలోనే నాని పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది. కేశినేని నాని గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాతే ఇలా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం టీడీపీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. అయితే.. ఆయనకు ఢిల్లీ పెద్దల భరోసా ఏమైనా ఉందా? లేక ఫ్యాన్ పార్టీ ప్రోద్బలం ఉందా? అనే సందేహాలు పలువురిలో వస్తున్నాయి. కేశినేని నాని ఇలా ఎందుకు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు అనే అంశంపై టీడీపీ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. నాని ఇంతలా బరితెగించి మాట్లాడడం వెనుక ఎవరి హస్తం ఉంది? వైసీపీ నేతల ప్రోద్బలం ఉందా? లేక కమలం పార్టీ వెన్నుదన్ను ఏదైనా నానికి ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అప్పుడప్పుడూ టీడీపీ నేతలు పరోక్షంగా చెబుతున్నట్లు కేశినేని నాని వైసీపీలో చేరతారా? లేదా భారతీయ జనతాపార్టీ తీర్థం తీసుకుంటారా? అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వస్తున్నాయి.

By
en-us Political News

  
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.