Publish Date:Feb 17, 2025
కేశినేని నాని రాజకీయ సన్యాసం పుచ్చుకున్న తరువాత ఇప్పుడు మళ్లీ ఆయన మనసు పాలిటిక్స్ వైపు మళ్లినట్లు కనిపిస్తున్నది. వరుసగా రెండు సార్లు విజయవాడ లోక్ సభ స్థానం నుంచి తెలుగుదేశం ఎంపీగా విజయం సాధించిన కేశినేని నాని, ఆ తరువాత అహం తలకెక్కి సొంత పార్టీపైనే తిరుగుబావుటా ఎగుర వేశారు. కేశినేని ట్రావెల్స్ ద్వారా గుర్తింపు సంపాదించుకున్న నాని రాజకీయ అరంగేట్రం తెలుగుదేశం పార్టీ ద్వారా జరిగింది. 2014, 2019 ఎన్నికలలో ఆయన తెలుగుదేశం అభ్యర్థిగా విజయవాడ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. తెలుగుదేశంలో ఆయనకు సముచిత ప్రాధాన్యం కూడా లభించింది. అయితే 2024 ఎన్నికల ముందు ఆయన తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ గూటికి చేరారు. ఆయన తెలుగుదేశం పార్టీని వీడారనడం కంటే తెలుగుదేశం పార్టీయే ఆయనను వద్దనుకుందని అనడం కరెక్ట్. కేశినేని నాని వ్యవహార శైలి, వైసీపీ నేతలతో రాసుకుపూసుకు తిరగడం ద్వారా తన ఉద్దేశాలను చాటిన నానిని ఇక పార్టీకి నీ సేవలు చాలు అని చంద్రబాబు మర్యాదగా చెప్పారు. ఆ విషయాన్ని స్వయంగా నానియే అప్పట్లో చెప్పారు కూడా. సరే ఏది ఏమైతేనేం.. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన కేశినేని నానికి ఆయన సొంత సోదరుడు, తెలుగుదేశం అభ్యర్థి కేశినేని చిన్ని చేతిలో ఘోర పరాభవం ఎదురైంది.
ఆ పరాజయ పరాభవాన్ని జీర్ణించుకోలేకపోయిన నాని రాజకీయ సన్యాసం ప్రకటించారు. ప్రకటించినట్లుగానే రాజకీయాలకు దూరంగా ఇంత కాలం ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన చూపు మళ్లీ రాజకీయాల వైపు మళ్లంది. ఎంపీగా ఉండగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలతో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని ఇప్పుడు ఆయన కమలం పార్టీకి చేరువ కావడానికి ప్రయత్నిస్తున్నారు. తరచూ బీజేపీ నేతలతో రహస్య భేటీలు నిర్వహిస్తున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. తాజాగా ఇటీవల కేశినేని నాని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో భేటీ అయినట్లు వెల్లడి కావడంతో ఆయన కమలం గూటికి చేరబోతున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. కేశినేని నాని వాటిని ఖండించారు. అయితే తన వర్గీయులతో నిర్వహించిన భేటీలో తాను రాజకీయాలకు మాత్రమే దూరం అయ్యాననీ, ప్రజాసేవకు కాదని చెప్పడం ద్వారా.. తన రాజకీయ జీవితం ముగిసినట్లు కాదని సంకేతాలు ఇచ్చారు.
అయితే ఆయన బీజేపీ గూటికి చేరడానికి చేస్తున్న ప్రయత్నాలే ఆయన అడుగులు ముందుకు సాగుతాయా అన్న అనుమానాలు వ్యక్తం కావడానికి కారణమౌతున్నాయి. తెలుగుదేశంతో రాష్ట్రంలో బీజేపీ మిత్రపక్షంగా కొనసాగుతోంది. అటు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వ మనుగడ దాదాపుగా తెలుగుదేశం మద్దతుపైనే ఆధారపడి ఉంది. ఈ పరిస్థితుల్లో బీజేపీ కేశినేని నానికి తలుపులు తెరుస్తుందా? తెరిచినా ఆయనకు సముచిత స్థానం ఇవ్వగలుగుతుందా? అన్నిటికీ మించి తెలుగుదేశం ఎంపీ కేశినేని చిన్ని ఉండగా, విజయవాడ నియోజకవర్గంలో కేశినేని నాని రాజకీయాలు చేయడానికి అనుమతిస్తుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తెలుగుదేశంతో కేశినేని నాని పొలిటికల్ జర్నీ ముగిసినట్లే.. ఆయన ఎంత గట్టిగా తట్టినా ఆ పార్టీ తలుపులు తెరుచుకునే అవకాశాలు ఇసుమంతైనా లేవన్నది వాస్తవం. ఈ పరిస్థితుల్లో కమలం ఆయనకు కండువా కప్పి అక్కున చేర్చుకునే అవకాశాలు లేవనే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kesineni-nani-eyes-join-bjp-39-192992.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.