కేరళలో పేలుడు... నిప్పుతో చెలగాటం!

Publish Date:Apr 11, 2016

Advertisement

 

నీరు, నిప్పు... ఈ రెండింటినీ మనిషి ఎప్పుడూ తక్కువగా అంచనా వేస్తూనే ఉంటాడు. అలా మనిషి తమపట్ల అజాగ్రత్తగా ఉన్న ప్రతిసారీ అవి తమ విశ్వరూపాన్ని చూపుతూనే వచ్చాయి. కేరళలోని పరవూర్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదమే ఇందుకు మరో సాక్ష్యం!

 

కేరళలోని పరవూర్‌, ఆ రాష్ట్ర రాజధాని తిరువనంతపురానికి కేవలం 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఉన్న పుట్టంగళ్‌ అమ్మవారి ఆలయంలో ఏటా జరిగే ఉత్సవాలకి గొప్ప పేరు. వారం పాటు జరిగే ఈ ఉత్సవాల ఆఖరి రోజున జరిగే బాణాసంచా ప్రదర్శనని చూసేందుకు వందలాదిమంది కాచుకు కూర్చుంటారు. కానీ ఈసారి వాళ్లంతా చావు కోసమే ఎదురుచూసినట్లైంది. అమ్మవారి జన్మనక్షత్రమైన భరణి రోజున ఈ ముగింపు ఉత్సవం జరుగుతుంది. అది ఈసారి 9వ తేదీన వచ్చింది. ఆ రోజు అర్ధరాత్రి నుంచి మొదలైన బాణాసంచాను, జనమంతా అబ్బురంగా చూస్తూ ఉండిపోయారు. మూడుగంటలపాటు ఏకధాటిగా సాగిన ఈ ప్రదర్శన తుదిఘట్టానికి చేరుకునే సమయంలో అనుకోని ఆపద ఎదురైంది. దగ్గరలోనే బాణాసంచాను నిల్వచేసే గోదాము మీదకి నిప్పురవ్వలు పడటంతో ఆ ప్రాంతమంతా అగ్నిగోళంగా మారిపోయింది. ఆలయ ప్రాంగణమంతా స్మశానమైంది.

 

ఈ ప్రమాదంలో 107 మంది చనిపోయారనీ, 300 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారనీ చెబుతున్నారు. ఈ లెక్కలు మారే అవకాశం ఉంది. బాణాసంచాను సరఫరా చేసిన కాంట్రాక్టరు 15 కిలోల బాణాసంచాను మాత్రమే నిల్వ చేసుకునేందుకు అనుమతి ఉండగా, ఏకంగా 150 కిలోలను నిల్వ చేయడమే ఈ ప్రమాద తీవ్రతకు కారణం అని తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలోకి కాస్త లోతుగా వెళ్తే కేవలం కాంట్రాక్టరే కాదు... రాజకీయ నేతల నుంచి ఆలయ అధికారుల వరకూ ప్రతిఒక్కరూ ఈ తిలాపాపంలో తలాపిడికెడు పంచుకున్నట్లు అర్థమవుతుంది.

 

పుట్టంగళ్ అమ్మవారి ఆలయ నిర్వాహక కమిటీలో మొదటి నుంచీ కుల రాజకీయాలు నడుస్తున్నాయి. కమిటీ మీద ఆధిపత్యం కోసం వివిధ కులాలు కొట్లాడుకుంటూ ఉండేవి. ఈ కొట్లాట కొన్నాళ్ల క్రితం సుప్రీంకోర్టు దాకా వెళ్లే పరిస్థితి వచ్చింది. ఆ నేపథ్యంలో కొన్నాళ్లపాటు ఉత్సవాలను కూడా నిలిపివేశారు. ప్రస్తుతానికి పరిస్థితులు చక్కబడినట్లు కనిపించినా, ఉత్సవాల మీద తమ ప్రభావం స్పష్టంగా కనిపించాలని కమిటీలోని వేర్వేరు వర్గాలు పట్టుదలగా ఉన్నాయి. దానికి తగినట్లుగా బాణాసంచా కార్యక్రమాన్ని కనీవినీ ఎరుగనంత ఘనంగా నిర్వహించాలనుకున్నాయి. అయితే కేరళలో తరచూ జరుగుతున్న బాణాసంచా ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని అటు జిల్లా కలెక్టరు కానీ, ఇటు జిల్లా అదనపు మెజిస్ట్రేటు కానీ బాణాసంచా ప్రదర్శనకు అనుమతిని ఇవ్వలేదు. పైగ ఈ బాణాసంచా ప్రదర్శన తీరుని చూస్తుంటే రెండు వర్గాల మధ్య పోటీలాగా సాగే ప్రమాదం ఉందనీ, ఈ నేపథ్యంలో తాను ప్రదర్శనకు అనుమతిని ఇవ్వడం లేదనీ అదనపు మెజిస్ట్రేట్‌ షానవాజ్‌ తన ఉత్తర్వులలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుని అతిక్రమించినవారి మీద చర్యలు కూడా తీసుకుంటానని హెచ్చరించారు. అయినా ప్రదర్శన ఆగలేదు!

 

ఉన్నతాధికారులు ఎప్పుడైతే అనుమతిని నిరాకరించారో, స్థానిక రాజకీయ నేతలు రంగంలోకి దిగారు. మంత్రులు సైతం ఉన్నతాధికారుల మీద విపరీతమైన ఒత్తిడిని తీసుకువచ్చారు. కానీ అధికారుల చిత్తశుద్ధి ముందు మంత్రాంగాలు ఫలించలేదు. గుడి చుట్టుపక్కల ఉండే జనం కూడా బాణాసంచా ప్రదర్శనకు వ్యతిరేకంగా నిలబడటంతో అధికారుల వాదనకు తగిన బలం చేకూరింది. పైగా ఇలాంటి విషయాలలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఫలితాలు దారుణంగా ఉంటాయని వారికి తెలుసు. 1952లో శబరిమలలో జరిగిన బాణాసంచాలో 68 మంది మృత్యవువాత పడటం మొదలు... ఆ రాష్ట్రంలో తరచూ జరిగే ఇలాంటి దుర్ఘటనలు వారికి పెను హెచ్చరికలుగా నిలిచాయి.

 

అధికారులు ససేమీరా అనడంతో అనుమతి ఉందంటూ అబద్ధాలు చెప్పి ఆలయ నిర్వాహకులు బాణాసంచా ప్రదర్శనను మొదలుపెట్టేశారు. కానీ అబద్ధాలు దాగవు. అవి విస్ఫోటనాలై బయటపడతాయి. పుట్టంగళ్‌ ఆలయంలో అదే జరిగింది. బాణాసంచాను నిల్వ చేసిన భవంతి మీద నిప్పు రవ్వలు పడటంతో, భవంతి కాస్తా ఒక్కసారిగా పేలిపోయింది. భవనం నుంచి ఎగిరిపడిన ఇనుపచువ్వలు, కాంక్రీటు గడ్డల వల్లే ఎక్కువమంది చనిపోయినట్లు తెలుస్తోంది. దీనికితోడు పేలుడు తరువాత కరెంటు కూడా పోవడంతో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని తొక్కిసలాట చోటుచేసుకుంది. అనుమతికి మించిన పేలుడు పదార్థాలను నిల్వ చేయడం ఒక తప్పైతే, వాటిలో నిషేధిత పేలుడు పదార్థాలను ఉపయోగించారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఈ పేలుడు దాదాపు 15 కిలోమీటర్ల దూరం వరకూ వినిపించిందంటే, ఆ ఆరోపణల్లో నిజం ఉందనే తోస్తుంది.

 

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు తమ గాయాలను సైతం మర్చిపోయి క్షతగాత్రలకు సాయపడేందుకు ముందుకువచ్చారు. సైనిక, నౌకాదళాలు ఒక్క ఉదుటున సహాయ కార్యక్రమాలకు చేరాయి. పరామర్శల కోసం నేతలు పరుగుపరుగున వచ్చారు. ఎక్స్‌గ్రేషియాలు, సంతాప ప్రకటనలూ సాగాయి. ఆలయ అధికారుల మీద ఎలాగూ చర్యలు తీసుకుంటారు. వీటి వల్ల పోయిన ప్రాణాలు తిరిగిరావని చెప్పేందుకు పెద్దగా తత్వం తెలియాల్సిన పని లేదు. కానీ మున్ముందు ఇలాంటి ప్రమాదం జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నదే మొదటి ప్రశ్న.

 

బాణాసంచాను నిల్వ చేయడం, ప్రదర్శించడాల గురించి సమాజం ఇప్పటివరకూ చూసీచూడనట్లుగా ఉండేది. దానిని ఒక వినోదంగా భావించేవారే కానీ విపత్తుగా అనుమానించేవారు తక్కువ. కానీ పుట్టంగళ్ పేలుడు ఇలాంటి ప్రమాదాల గురించి గట్టిగా హెచ్చరిస్తోంది. పెళ్లిళ్లు మొదలుకొని తిరునాళ్ల దాకా ఎంత బాణాసంచా కాలిస్తే అంత గొప్ప అనుకునే స్థితిలోకి జారుకుంటున్నాం. ఇలా నిప్పుతో చెలగాటమాడితే ఏం జరుగుతుందో ఇటు ప్రజలు, అటు ప్రభుత్వమూ తెలుసుకోవాల్సిన రోజు వచ్చేసింది. అలా తెలుసుకుని మరో పుట్టంగళ్‌ ప్రమాదం జరగకుండా చూసుకోవడమే, ఈ ప్రమాదంలో మరణించినవారికి అసలైన నివాళి!

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.