కేరళ క్యాస్ట్రో అంటూనే.. పొమ్మన్నారు..?

Publish Date:May 21, 2016

Advertisement

వీ.ఎస్.అచ్యుతానందన్...కేరళ రాజకీయాల్లోనే కాదు, ప్రస్తుత భారత రాజకీయాల్లోనూ కురువృద్ధుడు. కేరళ ఫిడెల్ క్యాస్ట్రోగా, రైతు బాంధవుడిగా, మచ్చలేని వ్యక్తిగా తనదైన ముద్రవేసిన వ్యక్తికి ఘోర అవమానం జరిగింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరా..? అంటూ ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూశారు. సీఎం రేసులో అచ్యుతానందన్, పినరయి విజయన్ పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో కేరళ తదుపరి ముఖ్యమంత్రిగా పినరయి విజయన్‌ను ఖరారు చేస్తూ సీపీఎం అగ్రనాయకత్వం నిర్ణయించింది. సీఎం ఎన్నికపై నిన్న తిరువనంతపురంలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సీపీఎం అగ్రనేతలు సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారత్ సమావేశం నిర్వహించారు. అయితే చివరి వరకు వేచి చూసిన అచ్యుతానందన్‌కు నిరాశే మిగిలింది. వయసు రీత్యా, ఆరోగ్య రీత్యా ఆయనను ఈ పదవికి ఎంపిక చేయలేకపోతున్నామని..కాని ఆయన సేవలు మాకు ఎల్లవేళలా అవసరం అని సీతారాం ఏచూరి తెలిపారు. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే అచ్యుతానందన్ ఆవేశంగా సమావేశం నుంచి వెళ్లిపోయారు.

 

93 ఏళ్ల అచ్యుతానందన్‌ రాజకీయాల్లో అలుపెరుగని యోధుడు. స్వతంత్ర పోరాటంలోనూ, అనేక కమ్యూనిస్టు ఉద్యమాల్లోనూ ఆయన పాల్గొన్నారు. అంతేకాదు సీపీఎం వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన కూడా ఒకరు. 2006 నుంచి 2011 వరకూ కేరళ ముఖ్యమంత్రిగా అచ్యుతానందన్ పనిచేశారు. సీఎంగా రాష్ట్రంలో సాఫ్ట్‌వేర్ రంగాన్ని ప్రొత్సహించి, ప్రభుత్వ విద్యావ్యవస్థలో ఉచిత సాఫ్ట్‌వేర్‌ను అందించిన ఘనత ఆయన సొంతం. పాలనలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి ప్రజల మన్ననలు పొందారు. 93 ఏళ్ల వయసులోనూ పార్టీ అప్పగించిన బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకుని ఎల్‌డీఎఫ్‌ను అధికారంలోకి తెచ్చారు. రోజుకో జిల్లా చొప్పున తిరుగుతూ కార్యకర్తలను ఉత్తేజపరిచారు. అలాంటి ఆయనకు సీఎంగా అవకాశం రాకపోవడంతో కాస్త కోపంగానే ఉన్నారు. కనీసం రెండేళ్లయినా ముఖ్యమంత్రిగా చేయండి అని ప్రాధేయపడినా కనికరించలేదు.

 

అటు ఆయన అభిమానులు, మద్దతుదారులు మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అధికారంలోకి వచ్చేందుకు ఆయన్ను ఉపయోగించుకుని తీరా గెలిచిన తర్వాత అచ్యుతను వయసు పేరు చెప్పి పక్కన బెడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండుటెండలో ప్రచారం చేసినప్పుడు అచ్యుతానందన్ వయసు గుర్తుకు రాలేదా అని మండిపడుతున్నారు. అటు వృద్ధ సింహన్ని బుజ్జగించేందుకు సీపీఎం అగ్రనేతలు ప్రయత్నిస్తున్నారు. మరి అచ్యుతానందన్ అలక వీడుతారా? లేదంటే తను అనుకున్నది సాధించేందుకు ఇంకేమైనా చేస్తారా అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాలి.

 

By
en-us Political News

  
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.