కేజ్రీ, మీ అమాయకత్వానికి జోహార్లు!

Publish Date:Oct 26, 2022

Advertisement

దేవుడంటే భయభక్తులు ఉండాలి. అన్నీ దేవుడే చేసేస్తాడు మనం పెద్దగా కష్టపడక్కర్లేదనుకుంటేనే సమస్య. అంద రికీ మతపిచ్చి పట్టించి తీరిగ్గా సంప్రదాయాలు, గ్రంథాలు ఇలా చెప్పాయంటూ జనాన్ని వెర్రాళ్లను చేసి ఓటర్లుగా మార్చుకుని రాజకీయ లబ్ధి చేకూర్చుకునే అతి తెలివి మాత్రం ఒక్క బీజేపీ వారికే సాధ్యం. అసలు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దేశంలో మతమౌఢ్యం పెచ్చుమీరుతోందనే వాదనా  ఉంది. ప్రతీదాన్ని మతపరంగా  ఆలోచించి చిన్న సమస్యను కూడా పరిష్కారానికి అనేక సం త్సరాలు పట్టేంతగా లాగే యుక్తి కేవలం బీజేపీ వారి సొత్తు. ప్రతీ రాజకీయ ఆలోచన వెనుక మతప రమైన రంగుతో మేళవించి జనాల్లోకి వదిలి గందరగోళం కలిగించి ఆనందించడం మోడీ అండ్ కో వారి ప్రత్యేకత. ప్రశాంతంగా ఉంటే వారికి చాలా ఇబ్బంది. నిద్రపట్టదు.  వారికి కొత్త  ఆాలోచన కలిగించారు ఆప్ అధినేత కేజ్రీవాల్. 

నోట్ల మీద గాంధీ గారి బొమ్మ ఎలాగూ ఉంటుంది, ఉండాలి. నోటుకి రెండో వేపు గణేషుడు, లక్ష్మీ దేవి బొమ్మలు కూడా ఉంటే బావుంటుంది అని కేజ్రీవాల్ సూచించారు. గణేషుడు శుభాలను కలిగిస్తాడు, లక్షీ దేవి ధనప్రాప్తి కలిగిస్తుంది. అందువల్ల వారిద్దరి బొమ్మలు ప్రచురించాలన్నారు. అయితే దీని కోసమని ఇప్పటిదాకా  ఉన్న నోట్లను తీసేయమన లేదు. జనాలు మళ్లీ ఇబ్బందుల పాలయ్యేవారు. డీమానిటైజే షన్ పేరుతో మధ్య తరగతి, పేదలను జేబులు ఖాళీ చేయించి నానా అవస్థలకు గురిచేసి బీజేపీ సర్కార్ ఆనందించిన సంగతి తెలిసిందే. పైగా విదేశాల నుంచి నల్లధనాన్ని తెప్పించి అందరికీ పంచుతామ న్నారు, సినిమాలో పేద్ద హీరో వాగ్దానంలా.  ఏదీ జరగలేదు. బ్లాక్ మనీతో ఉడాయించిన ఘనులు విదేశా ల్లో చాలా ప్రశాంతంగా, సుఖంగానే ఉన్నారు. కష్టాలు మనకే పట్టించారు ప్రభువుల వారు. 

కేజ్రీవాల్ బీజేపీవారి భక్తిపారవశ్యాన్ని, దేశంలో ఎవరికీ లేని మత ప్రభావాన్ని గురించి సరదాగా అలా సూచించారేమోగాని, వాస్తవానికి గాంధీగారి బొమ్మే తీసేసి తమ బొమ్మ పెట్టేసుకున్నా పెద్దగా ఆశ్చర్య పడనవసరం లేదు. ఎందుకంటే బీజేపీ వారి దృష్టిలో గాంధీ కంటే, పటేల్ సమానుడు మోదీ. ఆయన తోనే సమస్త భారతావని అభివృద్ధిపథంలో ముందడుగు వేస్తోందనే అభిప్రాయాలు, నమ్మకాలు ముమ్మ రంగా ప్రచారంచేస్తూ సామాన్య జనాన్ని, ముఖ్యంగా ోటర్ని జేబులో వేసేసుకుంటున్నారు. ప్రతీ ప్రాంతంలోనూ ప్రధాని, హోం మంత్రి షా గారి అదేశాలు తూ.చ తప్పకుండా అమలు చేయడంలోనో, ప్రచారం చేయడలోనో కాస్లంత కఠినంగానే నవ్వుతూ జనాన్ని పనిగట్టుకుని ఆనందంగా ఉండాలన్న ఆదేశాలూ జారీ చేస్తున్నారు. ఇంతగా గతంలో ఎన్నడూ బలవంతపు నవ్వులు ప్రజలు చిందించ లేద న్నది రాజకీయపరిశీలకుల మాట. 

ప్రతీ ప్రాంతంలో రాజకీయాలతో పాటు మతపరమైన ఆాలోచనను కలగలిపి వ్యూహరచన చేసి తమవారిని రెచ్చగొట్టి ప్రచారం చేయించి గొడవలు తేవడం, టీవీల్లో, వీధుల్లో, కార్యాలయాల్లో చర్చలకు దారితీసేట్టు చేయడం బీజేపీకి మహా సరదా. మహానగరాలకు పేర్లు మార్చడం, చారిత్రక  కట్టడాల పేర్లు మార్చడంతో బీజేపీ వారి అసలు అజెండాను దేశ వ్యాప్తంగా విస్తిరించారు. దీన్ని గురించి ప్రజలు తెలుసుకుని, విని, చదివి చర్చించుకోవాలని, విభేదించుకోవాలని, అలా తమకు ఆనందం కలిగించా లని ప్రభువుల ఆలోచన. ప్రభువుల మనసు రాజమందిరం. దేనికయినా దేన్నయినా తమ రాజకీయ లబ్దికి తిప్పేసుకోగల చతురత కలిగినవారు, చదరంగం బాగా నేర్చినవారు. ఇప్పుడు కేజ్రీవాల్ సరదాగా చేసిన సూచన సరదాగానే తీసుకోకున్నా.. ఇటువంటి గొప్ప ఆలోచన కమలనాథులకు రాలేదను కోవడమే కేజ్రీవాల్ అమాయకత్వం. 

By
en-us Political News

  
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినా.. అసాధారణ ధైర్యసాహసాలతో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన
కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న వేళ.. దాని భవిష్యత్తుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో సెప్టెంబర్ 22న జరిగిన 18 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి హత్య ఉదంతం
మోసపోయాం.. గోసపడుతున్నాం..సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆగ్రహం.!
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో కోకాపేట్‌ నియోపోలిస్‌ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరోసారి అత్యంత వేడెక్కింది
విద్యావలయంలో గంజాయి మొక్క కలకలం..!
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
రా బిడ్డా.. అసెంబ్లీకి’.. KTRకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్.!
భారతీయ రైల్వేలో ప్రయాణం చేయడానికి ప్రయాణికులు చాలా కాలం ముందే టికెట్లను రిజర్వ్ చేసుకుంటూ ఉంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.