కన్నతల్లే కసాయి... రెండేళ్ల చిన్నారి హత్య వెనుక షాకింగ్ కుట్ర

Publish Date:Jun 22, 2026

Advertisement

 

రెండేళ్ల చిన్నారి హత్య కేసు ఛేదన.. తల్లి, ప్రియుడి కుట్ర బట్టబయలు...

మేడ్చల్–మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్‌లో సంచలనం సృష్టించిన రెండేళ్ల బాలుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. తొలుత ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు కనిపించిన ఈ ఘటన వెనుక తల్లి, ఆమె ప్రియుడి కుట్ర ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో కన్నతల్లే తన ప్రియుడితో కలిసి పసిబిడ్డను హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది.

కీసర మండలం చెర్యాల గ్రామంలోని ఈడెన్ గార్డెన్స్‌కు చెందిన రంగా స్వామి, జూన్ 13న తన రెండేళ్ల కుమారుడు రంగా హరికృష్ణ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే మే 29న బాలుడు ఇంట్లో పడిపోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడని, ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని తల్లి రంగా జ్యోతి కుటుంబ సభ్యులను నమ్మించింది.

ఘటనపై అనుమానం వ్యక్తమైన నేపథ్యంలో కీసర పోలీసులు సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించారు. ఈ క్రమంలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో జ్యోతి, మొగిళ్ల నవీన్ మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన రోజే నవీన్ ఇంటికి వచ్చినట్లు, అనంతరం బాలుడిని ఆస్పత్రికి తరలించడంలో కూడా అతడు పాల్గొన్నట్లు ఆధారాలు లభించాయి.

దీంతో అనుమానం మరింత బలపడగా, జూన్ 19న బాలుడి మృతదేహాన్ని వెలికితీసి ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. పోలీసుల విచారణలో జ్యోతి, నవీన్ ఇద్దరూ నేరాన్ని అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. తమ అక్రమ సంబంధానికి బాలుడు అడ్డుగా ఉన్నాడని భావించి ముందస్తు ప్రణాళికతో హత్య చేసినట్లు వెల్లడైంది. 

నవీన్ బాలుడిని నేలపై బలంగా కొట్టి చంపగా, తల్లి జ్యోతి అతనికి సహకరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా చిత్రీకరించే ప్రయత్నంలో బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు దర్యాప్తులో బయటపడింది.ఈ కేసులో ప్రధాన నిందితులైన మొగిళ్ల నవీన్, రంగా జ్యోతిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన ఇతర కోణాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు వివరాలను జవహర్‌నగర్ ఏసీపీ చక్రపాణి మీడియాకు వెల్లడించారు.
 

By
en-us Political News

  
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జూన్ 24, 2026 నాటి టీ-బిల్ వేలం ఫలితాలను విడుదల చేసింది. 91 రోజులు, 182 రోజులు, 364 రోజుల ట్రెజరీ బిల్లుల అలాట్‌మెంట్ స్టేటస్, లేటెస్ట్ వడ్డీ రేట్లు (Yields) మరియు ఆన్‌లైన్ చెకింగ్ ప్రాసెస్ ఇక్కడ చూడండి.
జూలై 1 నుంచి జపాన్ వీసా ఫీజులు భారీగా పెరగనున్నాయి. సింగిల్, మల్టిపుల్ ఎంట్రీ వీసా కొత్త ధరలు, VFS ఛార్జీలు మరియు భారతీయులపై పడే ప్రభావం గురించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల భారతీయ ఐటీ రంగానికి ముప్పు ఉందా? ఇన్ఫోసిస్ 45వ ఏజీఎంలో కంపెనీ ఛైర్మన్ నందన్ నీలేకని, సీఈఓ సలీల్ పరేఖ్ చేసిన సంచలన వ్యాఖ్యలు, ఉద్యోగాల భర్తీపై కీలక అప్‌డేట్స్ మీకోసం.
ఒకవేళ ఉగ్రవాదులు తిరుమలలోకి చొరబడి, కీలకమైన ప్రాంతాలను లేదా భక్తులను తమ అధీనంలోకి తీసుకుంటే వారిని ఎలా మట్టుబెట్టాలనే అంశంపై ఈ మాక్ డ్రిల్ నిర్వహించింది ఆక్టోపస్.. అత్యాధునిక ఆయుధాలు ధరించిన 45 మందికి పైగా అక్టోపస్ కమాండోలు ఈ మాక్ డ్రిల్ లో పాల్గొన్నారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్, అన్నప్రసాద భవనం, లడ్డూ పోటు వంటి రద్దీ ప్రాంతాలలో ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు.
2026 లో ఈపీఎఫ్ఓ (EPFO) నిబంధనల ప్రకారం పెళ్లి, పిల్లల ఉన్నత చదువులు, సొంత ఇల్లు కొనుగోలు మరియు హోమ్ లోన్ రీపేమెంట్ కోసం మీ పీఎఫ్ అకౌంట్ నుండి ఎంత అడ్వాన్స్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చో మరియు దానికి ఉండాల్సిన సర్వీస్ అర్హతల పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
స్తుత సీఎస్ కె. రామకృష్ణారావు పదవీ విరమణకు సరిగ్గా వారం రోజుల ముందు ఆయనను సొంత కేడర్‌కు పంపుతూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో సంజయ్ జాజు తెలంగాణ సీఎస్ గా బాధ్యతలు చేపట్టడం ఖాయమని తేలిపోయింది. తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు సంజయ్ జాజును ఆయన సొంత కేడర్‌కు తిరిగి పంపేందుకు కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపిందని కేంద్ర ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
లీప్‌ఫ్రాగ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ NSE SME ప్లాట్‌ఫామ్‌పై గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఒక చిన్న కాంట్రాక్టర్ స్థాయి నుండి ఐపీఓ వరకు సాగిన ఈ కంపెనీ సక్సెస్ స్టోరీ, బిజినెస్ మోడల్ మరియు ఇన్వెస్టర్ల లాభాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
సిఎస్ఎమ్ టెక్నాలజీస్ ఐపీఓ (CSM Technologies IPO) జూన్ 24 నుండి ప్రారంభమైంది. ప్రైస్ బ్యాండ్, లాట్ సైజ్, లేటెస్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) మరియు సబ్‌స్క్రిప్షన్ వివరాలు ఇప్పుడే పూర్తిగా తెలుసుకోండి!
బెంగళూరు మెట్రో పర్పుల్ లైన్ కబ్బన్ పార్క్ వద్ద సాంకేతిక సమస్య పరిష్కారమైంది. ఉదయం 8:30 నుండి రైళ్లు నడుస్తున్నప్పటికీ మెజెస్టిక్, ఇందిరానగర్ లో రద్దీ కొనసాగుతోంది. ప్రత్యామ్నాయ మార్గాలు మరియు రీఫండ్ వివరాలు ఇక్కడ చూడండి.
మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో ఆస్ట్రేలియా మహిళల జట్టు 113 పరుగుల భారీ తేడాతో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఎల్లీస్ పెర్రీ 71 రన్స్, 2 వికెట్లతో ఆల్‌రౌండ్ షో చేయగా, పాక్ 86 పరుగులకే ఆలౌట్ అయింది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన ఒక కీలక కేసులో నీరవ్ మోదీ.. తన కంపెనీ రుణం కోసం ఇచ్చిన వ్యక్తిగత గ్యారెంటీ కింద 10.7 మిలియన్ డాలర్లు అంటే మన భారతీయ కరెన్సీలో రూ. 100 కోట్లకు పైగా మొత్తాన్ని కచ్చితంగా చెల్లించాల్సిందేనని కోర్టు విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ నాగరాజు ఈ కేసులో నాగరాజు పాత్ర ఉందా? అన్న కోణంలో విచారిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం మొదలైన నాగరాజు విచారణ దాదాపు రాత్రి అంతా సాగినట్లు తెలుస్తోంది.
బాధితురాలైన వైద్య విద్యార్థిని తన తల్లితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వచ్చి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో అభిషేక్ పోరెల్ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఇద్దరి మధ్య గత 3 ఏళ్లుగా ప్రేమాయణం సాగిందని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని ఆ ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.