Publish Date:Sep 12, 2025
బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్‌కు గురైన తర్వాత కల్వకుంట్ల కుటుంబానికి కవిత పూర్తిగా దూరమైనట్లేనంటూ వార్తలు వచ్చాయి. అంతకు ముందు కూడా కవిత తండ్రిని కలవడానికి ప్రయత్నించినా కేసీఆర్ ఆమెను దూరంగానే ఉంచారు. ఈ నేపథ్యంలో గురువారం(సెప్టెంబర్ 11) కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత సస్పెండ్ అయిన తరువాత తొలి సారిగా ఆమె తల్లి, కేసీఆర్సతీమణిక ల్వకుంట్ల శోభ కవిత నివాసానికి వెళ్లారు. శోభ తన కుమార్తె కవిత నివాసానికి వెళ్లడం ఇప్పుడు రాజకీయవర్గాలలో చర్చనీయాంశమైంది. కవిత భర్త దేవనపల్లి అనిల్ కుమార్ పుట్టిన రోజు గురువారం (సెప్టెంబర్ 11). ఆ సందర్భాన్నిపురస్కరించుకుని శోభ కవిత నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె కవితతో ప్రత్యేకంగా మాట్లాడారు. అన్నీ సర్దుకుంటాయని ఆమె కవితకు చెప్పినట్లు సమాచారం.
అదలా ఉంచితే.. అంతేనా? అంతకు మించి ఏమైనా ఉందా అన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. ఎందుకంటే.. కవిత సస్పెన్షన్ తరువాత ఇప్పటి వరకూ కవిత ముఖం కూడా చూడని శోభ ఇప్పుడు పని కట్టుకుని అల్లుడి పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఎందుకు వెళ్లారన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ నెల 2న బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండయ్యారు. ఆ తరువాత మూడు రోజులకు అంటే సెప్టెబర్ 5న కవిత కుమారుడి పుట్టిన రోజు. ఆ సందర్భంగా కవిత తన తల్లిని ఆహ్వానించినా ఆమె మనవడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి వెళ్ల లేదు. ఇప్పుడు ప్రత్యేకంగా అల్లుడి పుట్టిన రోజు సందర్భంగా వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కేసీఆర్ సూచన మేరకే శోభ కవిత ఇంటికి వెళ్లి ఆమెను సముదాయించి వచ్చారని అంటున్నారు. కుటుంబంలో సయోధ్య కోసం కేసీఆర్ కుమార్తె వద్దకు శోభను పంపారన్న చర్చ జరుగుతోంది. సొంత పార్టీ నేతలు, బంధువులు కూడా అయిన హరీశ్‌రావు, సంతోశ్ కుమార్‌లపై కవిత తీవ్ర అవినీతి ఆరోపణలు చేయడం, వారి వల్లే కేసీఆర్‌కు చెడ్డపేరు వస్తోందని వ్యాఖ్యానించడం పార్టీలో పెను దుమారం రేపడమే కాకుండా కవిత సస్పెన్షన్ కు కూడా ఆ ఆరోపణలే కారణమయ్యాయి. కవితపై క్రమశిక్షణ చర్య కింద సస్పెన్షన్ వేటు వేసినప్పటికీ.. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ ఇప్పటి వరకూ కవిత ఆరోపణలను ఖండించలేదు. హరీష్ రావుకు మద్దతుగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. మొత్తంగా కవిత ఆరోపణలపై వ్యూహాత్మక మౌనం పాటించారు. ఈ నేపథ్యంలోనే తల్లీ కుతుళ్ల భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-wife-to-kavitha-house-39-206049.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.