మువ్వన్నెల రాజకీయం ..! మోడీతో కేసీఆర్ ‘ఢీ’

Publish Date:Jul 24, 2022

Advertisement

అనుకుంటాం కానీ, అసలు అసలే. అరువు అరువే. కడుపులో లేంది కౌగిలించుకున్నా రాదు.  అది దేశ భక్తి అయినా, దైవ భక్తి అయినా, మరో భక్తి భావన ఏదైనా స్వతహాగా లోపలి నుంచి రావాలి, కానీ, పెదవుల పై పూసుకుని పలికే  లిప్ స్టిక్ పలుకులు  పెద్దగా ప్రయోజనం ఉండదు. ప్రభావం చూపావు. ఒరిజినల్, డూప్లికేట్ల  మధ్య  పొంతన పోలిక కుదరదు. అసలు అసలే,, నకిలీ నకిలీనే.. అసలు నకిలీ కాదు, నకిలీ అసలు కాలేదు. 

అప్పుడెప్పుడో, కొంత కాలం క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, తెరాస ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత, మీరు ‘జై శ్రీరామ్’ అంటే  మేము ‘జై హనుమాన్’ అంటాం అంటూ బీజేపేతో భక్తి పోటీకి దిగారు. అన్నట్టుగానే కొంతా కాలం పాటు, అక్కడక్కడ హనుమాన చాలీసా పారాయణ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఫోటోలు, వీడియోలు పోస్టు చేసుకున్నారు. కానీ, ఆ తర్వాత, ఎందుకనో, ఆమె సైలెంటై పోయారు. 

అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్  కూడా నాకంటే గొప్ప హిందువు ఎవరున్నారు, నేను చేసినన్ని పూజలు, యాగాలు ఎవరు చేశారు? అంటూ అప్పుడప్పుడు, ‘నేనూ హిందువునే ... అని గుర్తు చేస్తూ ఉంటారు. అయితే,,ఆయన కడుపులోంచి వచ్చిన  హిందుగాడు బొందు గాడు డైలాగు పాపులర్ అయినంతగా, ఆయన  చెప్పిన నేనూ హిందువునే ...డైలాగు పాపులర్ కాలేదు. 
అదలా  ఉంటే, ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని మోడీతో  దేశభక్తిలో పోటీకి దిగుతున్నారు. దేశానికి స్వాతంత్ర్య సిద్ధించి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా సంవత్సర కాలంగా, అజాదీ కా అమృత్ మహోత్సవ్  పేరిట వేడుకలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ సంవత్సరం పంద్రాగస్టు పండగకు రెండు రోజుల ముందు నుంచి ఆగష్టు 13 నుంచి 15 వరకు, ప్రతీ ఇంటి పైన మువ్వన్నెల జెండాను ఎగరేయాలని ప్రధాని నరేంద్ర  మోడీ పిలుపు నిచ్చారు. ప్రధాని పిలుపు నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా  పేరిట  దేశ వ్యాప్తంగా జెండా పండగ  నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. 

మామూలుగా అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాంటి విషయాలను అసలు పట్టించుకోరు. ముఖ్యమంత్రి అయిన ఎనిమిదేళ్ళలో ఆయన ఏనాడు జాతిపిత మహత్మా గాంధీ జయంతి, వర్ధంతి వేడుకల్లో పాల్గొన లేదు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి, వర్ధంతి వేడుకల్లోనూ పాల్గొన లేదు. ఈ సంవత్సరం రాజభవన్ లో జరిగిన గణతంత్ర వేడుకల్లోను ముఖ్యమంత్రి  పాల్గొన లేదు, మీ జెండా మీది మా ‘అజెండా’ మాది అన్నట్లుగా సెపరేట్ గా జెండా ఎగరేశారు. ఇక సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సంగతి అయితే చెప్పనే అక్కరలేదు. మిత్ర పక్షం ఎంఐఎంను, ముస్లిం మనోభావాలను దెబ్బతీయడం ఇష్టం లేకనో ఏమో  ముఖ్యమంత్రి కేసీఆర్, సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినాన్ని ఎప్పుడో  మరిచి పోయారు. 

అయితే, దేశభక్తి ఓటు మొత్తాన్ని మోడీ మూట కట్టుకుపోతారనే భయం వలన చేతనో ఏమో కానీ, హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని హైజాక్ చేసేందుకు మాస్టర్ ప్లాన్ వేశారని అంటున్నారు.  హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని, బీజేపీ సర్కార్ నిర్వహిస్తోందన్నట్లుగా కాకుండా.. రాష్ట్ర ప్రభుతమే నిర్వహిస్తున్నామన్నట్లుగా నిర్వహించాలని,  ప్రతి ఇంటిపైన ఎగరేసేందుకు జాతీయ జెండాలను రాష్ట ప్రభుత్వమే పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే,   మేమూ హిందువులమే .. అన్నట్లుగా,  మాకూ దేశ భక్తి ఉందని నిరూపించుకునేందుకు స్వాతంత్ర్య దినోత్సవం అయ్యే వరకూ పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నేతృతవంలోనే ర్యాలీలు.. సభలు.. సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అందరికీ జెండాలు పంచడం ద్వారా బీజేపీ వ్యూహాన్ని అడ్డుకోవాలని ముఖ్యమంత్రి  వ్యూహ రచన చేశారని అంటున్నారు. 

అయితే, అజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా నిర్వహిస్తున్న హ‌ర్‌ ఘ‌ర్ తిరంగా కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు, కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహిస్తోంది. అందులో భాగంగా, జెండా కర్రతో సహ త్రివర్ణ పతాకాన్ని, ఇంటింటికి అందించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే తీసుకుంది. అంటే, ఈ కార్యక్రమాల గురించి ప్రజలకు  అవగాహన కల్పించేందుకు, కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా పత్రికా ప్రకటనలు, పోస్టర్లు, హోర్డింగ్స్ ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తోంది. సినిమా థియేటర్లలో లఘు చిత్రాలు ప్రదర్శించేలా చర్యలు  తీసుకుంది. విద్యార్థిని విద్యార్థులు, యువతి యువకులు, క్రీడా కారులతో ర్యాలీలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో  దేశ భక్తీ పోటీలో  తమదే పై చేయి అనిపించుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస ప్రభుత్వం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.. అయితే.... అధికారులు కొందరు ఇదంతా చూస్తుంటే  పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్లు .. అన్న సామెత గుర్తుకు వస్తోందని అంటున్నారు.

By
en-us Political News

  
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.