Publish Date:Jul 28, 2023
కొత్త గూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావ్ ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు నిచ్చిన నేపథ్యంలో బిఆర్ఎస్ అధిష్టానానికి కొత్త చిక్కులు మొదలయ్యాయి. మరో వైపు జలగం వెంకట్రావ్ కాళ్లకు బొంగరం కట్టుకుని తిరుగుతున్నారు. తీర్పును అమలు చేయాలని ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల ప్రదానాధికారి, ముఖ్యమంత్రిని వేడుకుంటున్నారు. వనమా వెంకటేశ్వర రావ్, జలగం వెంకట్రావ్ ఇద్దరూ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు. ఒకరు ఎమ్మెల్యే.. ఆయన నియామకం చెల్లదని కోర్టు తీర్పు చెప్పి మరొకర్ని ఎమ్మెల్యేగా ప్రకటించింది. ఇప్పుడు ఇద్దరూ కలిసి న్యాయం మీరే చెప్పాలని కేసీఆర్ దగ్గరకు వెళ్తున్నారు. ఎవరి వైపు నిలబడితే మరొకరు అసంతృప్తి కి గురవుతారు. అందుకే… ఏటూ తేల్చుకోలేకపోతున్నారు. 2014 ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ తరపున పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు లేకపోతే.. జలగం వెంకట్రావు ముందుకు వచ్చి పోటీ చేశారు. బీఆర్ఎస్‌కు బలం ఏమీ లేనప్పుడు వ్యక్తిగత బలంతో ఎమ్మెల్యేగా గెలిచారు. జిల్లా నుంచి ఒక్కరే గెలిచినా కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వలేదు. అయినా జలగం పట్టించుకోలేదు. 2018 ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఆయన స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. వనమా గెలిచారు. తర్వాత వనమాను బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. జలగం ను పట్టించు లేదు. కానీ వనమా ఎన్నిక అక్రమం అని జలగం కోర్టు గడప తొక్కారు. విచారణ జరిపి అసలు 2018 నుంచే జలగంను ఎమ్మెల్యేగా పరిగణించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. తీర్పు నేపథ్యంలో అమలు చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై పడింది. తీర్పు కాపీ పట్టుకుని వెంటనే జలగం.. సీఎస్ శాంత కుమారిని కలిశారు. ఎన్నికల ప్రధానిధికారిని కూడా కలిశారు. తనతో ప్రమాణ స్వీకారం చేయించాలని స్పీకర్ ను కూడా కోరారు. కానీ స్పీకర్ వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. వనమా.. తీర్పు అమలుపై స్టే ఇవ్వాలని పిటిషన్ వేశారు. కానీ తీర్పు రిజర్వ్ అయింది. వనమా కాంగ్రెస్ లోనే ఉంటే… జలగంతో ఈ పాటికి ప్రమాణం చేయించేవారు. కానీ ఆయన కూడా బీఆర్ఎస్ లో ఉన్నారు. జలగం కావాలా… వనమా కావాలో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో బీఆర్ఎస్ హైకమాండ్ పడిపోయింది. తాను బీఆర్ఎస్ లోనే ఉంటానని జలగం వెంకట్రావ్ చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-troubles-for-kottegudem-mla-isue-39-159140.html
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.