తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం తరువాత వరుసగా రెండు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తిరుగులేని విజయాలను సాధించిన కేసీఆర్.. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి బోల్తా పడ్డారు. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న లక్ష్యం అన్నది పైపై మాటే వాస్తవంగా ఆయన దేశానికి ప్రధాని కావాలన్న ఆంక్ష, కాంక్ష తోనే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేసి, తెలంగాణను వదిలేసి ఇతర రాష్ట్రాల రాజకీయాలలో తలదూర్చారన్నది పరిశీలకులు విశ్లేషణ. అయితే ఆయన వ్యూహాలు వికటించాయి. ఎత్తుగడలు ఫలించలేదు. పొరుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలూ, ప్రజలే కాదు.. చివరాఖరికి కేసీఆర్ నేల విడిచి చేసిన సాముని తెలంగాణ ప్రజలే అంగీకరించలేదు. ఫలితం 2023 డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం. తెలంగాణ ఆవిర్భావం తరువాత తొలి సారిగా బీఆర్ఎస్ ప్రతిపక్షానికే పరిమితమైంది. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా మారిపోయారు. అయితే ఈ మార్పును కేసీఆర్ జీర్ణించుకోలేకపోయారు. పార్టీ నేతల మీద కోపమో, తన మీద తనకే కోపమో.. లేక సావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన తనను ఓడించారని ప్రజలపై అలకబూనారో తెలియదు కానీ.. ఓటమి తరువాత కేసీఆర్ మరీ నల్లపూస అయిపోయారు. ఈ పదిన్నర నెలల పైచిలుకు కాలంలో ఆయన జనం ముందుకు వచ్చింది, మీడియాతో మాట్లాడింది చాలా చాలా తక్కువ. ఏదో మొక్కుబడికి ఒక సారి అసెంబ్లీకి హాజరయ్యారు. ఆ తరువాత లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రచారం చేశారంటే చేశారనిపించుకున్నారు. అయితే లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ రాష్ట్రంలో కనీసం బోణీ కూడా కొట్టలేదు. పుండు మీద కారం చల్లినట్లు వరుసగా రెండో సారి కూడా జనం తిరస్కరించడంతో కేసీఆర్ పూర్తిగా అజ్ణాత వాసంలోకి వెళ్లిపోయారు.
అయితే కేటీఆర్, హరీస్ సహా బీఆర్ఎస్ నేతలు మాత్రం కేసీఆర్ లేస్తే మనిషి కాదు. మళ్లీ రాజకీయంగా క్రియాశీలం అవుతారు. రేవంత్ సర్కార్ కు ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తారు అంటూ చెబుతూ వస్తున్నారు. అదీకాక బీఆర్ఎస్ కు కర్త, కర్మ, క్రియ వంటి కేసీఆర్ మౌనం ఆ పార్టీకి తీరని నష్టం చూకూరుస్తోంది. పార్టీ శ్రేణులు సైతం కేసీఆర్ మౌనం పట్ల అసంతృప్తితో ఉండటమే కాకుండా తరచుగా ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ కీలక నేతలు కేసీఆర్ ఫలానా తేదీన బాంబు పేలుస్తారు. మళ్లీ రాజకీయాలలో క్రియాశీలం అవుతారు అంటూ తేదీలు ప్రకటిస్తున్నారు. ఇలా ఇప్పటికే పలు తేదీలను వారు ప్రకటించారు. ఆ తేదీలు వచ్చాయి. వెళ్లిపోయాయి. కానీ కేసీఆర్ మాత్రం బయటకు రాలేదు. ఈ తరుణంలో తాజాగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్ వేదికగా కేసీఆర్ సెకండ్ ఇన్నింగ్స్ కు ముహూర్తం ప్రకటించేశారు. ఎక్స్ వేదికగా ఆయన నిర్వహించే ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలో ఆయనీ ప్రకటన చేశారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన మార్గదర్శకంలోనే తాము పని చేస్తున్నామని స్పష్టం చేశారు.
రేవంత్ సర్కార్ కు కనీసం ఏడాది సమయం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్ ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నారని వివరణ కూడా ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి ఆయన మళ్లీ రాజకీయాలలో యాక్టివ్ అవుతారు అని కేటీఆర్ ఒక నెటిజన్ ప్రశ్నకు సవివరంగా సమాధానం ఇచ్చారు. ఆయన సమాధానం బానే ఉంది కానీ, పార్టీ అధినేత రేవంత్ సర్కార్ కు కొంత సమయం ఇవ్వాలని అనుకున్నప్పుడు.. కేటీఆర్, హరీష్ రావులు ఎందుకు రేవంత్ సర్కార్ పై దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. సమయం ఇవ్వాలన్న కేసీఆర్ నిర్ణయంతో వీరు విభేదించారా? లేక కేసీఆర్ మార్గదర్శకత్వంలోనే వీరు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుంటే.. ఆ మాత్రం దానికి కేసీఆర్ మౌనం ఎందుకు? అంటూ నెటిజనులు కేసీఆర్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-to-start-political-second-innings-from-january-39-187721.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.