ఇక ... కేంద్రం పై కేసీఆర్ . న్యాయ పోరాటం?

Publish Date:Jul 29, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కేసేఆర్ గత మూడు నాలుగు రోజులుగా దేశ రాజదాని ఢిల్లీలో ఉన్నారు. అయితే, ముఖ్యమంత్రి ఢిల్లీ ఎందుకు వెళ్లారు, ఏమి చేస్తున్నారు అనే విషయంలో ఎవరికీ స్పష్టత ఉన్నట్లు లేదు. చివరకు, టీవీ డిబేట్స్ లో పాల్గొనే తెరాస అధికార ప్రతినిధులు, ఎమ్మెల్యేలకు కూడా, ముఖ్యమంత్రి ఢిల్లీ ఎందుకు వెళ్ళారో చెప్పలేక పోతున్నారు. నిజంగా వారికి తెలియదో, తెలిసినా చెప్పలేని పరిస్థితో ఉన్నారో తెలియదు కానీ, ‘ది బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్’ అన్న పద్దతిలో ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా తెలంగాణకు మంచి మాత్రమే చేస్తారని అంటున్నారు. అంతే, కానీ ఆ ‘మంచి’ ఏమిటో మాత్రం బయట పెట్టడం లేదు. 

మరో వంక అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారానని బట్టి , ముఖ్యమంత్రి కేసీఆర్ బహుముఖ వ్యూహాలతో ఢిల్లీలో అడుగు పెట్టారని తెలుస్తోంది. రాజకీయ వ్యూహాలతో పాటుగా, రాష్ట్రం  ఎదుర్కుంటున్న ఆర్థిక సమస్యలకు, ముఖ్యంగా  కేంద్ర ప్రభుత్వం విధించిన రుణ పరిమితికి సంబందించి సీరియస్ స్టెప్స్ తీసుకునేందుకు ముఖ్యమంత్రి సిద్డం అవుతున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో అవసరం అయితే, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టును వెళ్లేందుకు అవసరమైన కసరత్తు చేస్తున్నారనీ  అంటున్నారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి, ఇప్పటికే సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ కార్యదర్శి రజత్‌ కుమార్‌, విద్యుత్తు శాఖ కార్యదర్శి సునీల్‌ శర్మతో పాటు పలువురు అధికారులు, న్యాయనిపుణులతో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. 

అయితే నేరుగా సుప్రీం కోర్టును ఆశ్రయించడం కాకుండా, ముందు  కేంద్ర ప్రభుత్వానికి సవివరంగా లేఖ రాయాలని, అందుకు సరైన జవాబు రాకపోతే దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని అధికారులు, న్యాయ నిపుణులు సూచించినట్లు సమాచారం. ఇదే విషయంగా ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచే చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. 

ఈ కసరత్తులో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ 2022 మార్చి 31న రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి రాసిన పది పేజీల లేఖపై అధికారులు చర్చలు జరిపారని సమాచారం. 15వ ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగా రాష్ట్రాల జీఎస్డీపీలో 3.5 మేరకు నికర రుణ పరిమితిని విధించామని కేంద్రం ఆ లేఖలో పేర్కొందని, నిజానికి ఆర్థిక సంఘం అదే సమయంలో ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని పూర్తిగా సవరించాలని సూచించిందన్నారు. కేంద్రం మాత్రం ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తూ నికర రుణ పరిమితిని పాటించకుండా రాష్ట్రాలపై ఆంక్షలు విధించడాన్ని ప్రశ్నించాలని నిర్ణయించినట్లు సమాచారం. అంతేగాక విద్యుత్తు రంగం పని తీరును బట్టి అదనపు రుణ పరిమితిని జీఎస్డీపీలో మరో 0.5% పెంచుతామని కేంద్రం లేఖ రాయడం రాజ్యాంగ విరుద్ధమని, ఉమ్మడి జాబితాలో ఉన్న అంశంపై రాష్ట్రాలను సంప్రదించకుండా ఇష్టారాజ్యంగా పరిమితులు విధించడం చెల్లదని కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కార్పొరేషన్లు, ఇతర సంస్థలు చేసే రుణాలపై కేంద్రం ఎలా ఆంక్షలు విధిస్తుందని ? వాటికి రాష్ట్ర ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నప్పుడు కేంద్రం జోక్యం చేసుకోనవసరం లేదనీ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. రాష్ట్రం కేంద్రం నుంచి, మార్కెట్‌ నుంచి చేసే అప్పులకు మాత్రమే రుణ పరిమితిని వర్తింపజేయాలని.. కార్పొరేషన్లు చేసే అప్పులనూ రాష్ట్ర రుణాలుగా పరిగణించే అధికారం కేంద్రానికి లేదని పేర్కొన్నట్లు  తెలుస్తోంది. 
అయితే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసేందుకే అయితే ఢిల్లీ వెళ్ళడం ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఢిల్లీ నుంచి సమాలోచనలు జరపడం ఎందుకు? అదీ కాక, ఈ సమాలోచనలో చర్చించినట్లు చెపుతున్న అన్ని అంశాలపైన, రాష్ట్రంలో చాలా విస్తృత స్థాయిలో చర్చ జరిగింది.  

ఈ అన్ని విషయాలపైనా  ముఖ్యమంత్రికి పూర్తి స్పష్టత వుంది.  విలేకరుల సమావేశాల్లో, ఇతరత్రా ఆయన ఈ విషయాలను ఒకటికి పదిసార్లు ప్రస్తవించారు. నిజానికి కేంద్రానికి లేఖ రాసే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గతంలోనే చూచాయగా చెప్పారు.అదలా ఉంటే, ఇటీవల సుప్రీం కోర్టు ఆర్థిక క్రమశిక్షణ అవసరాన్ని నొక్కి చెపుతూ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత హామీలను నియంత్రించ వలసిన అవసరం ఉందని అభిప్రాయ పడింది. సో.. అప్పులు చేస్తాం అనుమతివ్వండి .. అంటే సుప్రీం కోర్టు అయినా అంగీకరిస్తుందా .. అనుమానమే అంటున్నారు. అంతే కాకుండా ముఖ్యమంత్రి ఢిల్లీ యాత్రకు, సుప్రీం కోర్టులో పిటిషన్ వేయాలనే  ఆలోచనకు లింక్ కుదరడం లేదని అంటున్నారు. అందుకే, ముఖ్యంత్రి ఢిల్లీ ఎందు  కెళ్ళారు ... అనేది జవాబు లేని ప్రశ్నగానే మిగిలి పోయిందని, అంటున్నారు.

By
en-us Political News

  
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.