ఢిల్లీకి కేసీఆర్ కవితకు సీఎం కుర్చీ?

Publish Date:Dec 16, 2022

Advertisement

ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు రాజకీయ ఎత్తుగడల్లో మాంచి దిట్ట. ఎన్నికల వ్యూహ రచనలో ఆయనకు ఆయనే సాటి, కానీ, పుష్కర కాలానికి పైగా తెలంగాణ ఉద్యమాన్ని ఒడిదుడుకులు లేకుండా నడిపిన ఆయన, ఇప్పడు కుటుంబ రాజకీయాలను చక్క దిద్దడంలో తడబడుతున్నారు. తప్పులు చేస్తున్నారు. చిక్కులు  తెచ్చుకుంటున్నారు. ఇది ఎవరో రాజకీయ ప్రత్యర్ధులు చేస్తున్న రాజకీయ విమర్శ కాదు, సొంత పార్టీ నాయకులు చేస్తున్న సద్విమర్శ. నిజానికి, తెరాస పేరు  మారినా తీరు మారక పోవడానికి, పార్టీ ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యలు అన్నిటికీ, కుటుంబ కలహాలే కారణమని పార్టీ నేతలు పబ్లిక్ గానే మాట్లాడుకుంటున్నారు. ఢిల్లీ వెళ్ళిన నేతలు ఎవరిని కదిల్చినా  ఇదే మాట వినిపిస్తోంది. 

జాతీయ రాజకీయాలంటూ ఢిల్లీలో జెండా ఎగరేసేందుకు  రాష్ట్రం నుంచి నాయకులు, కార్యకర్తలను తోలుకు రావడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసేఆర్ తో ఫోటో కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఢిల్లీ రావడం చిత్రంగా ఉందని, ఈ అన్నిటికీ కుటుంబ కలహాలే కారణమని అంటున్నారు. సొంత పార్టీ నాయకులు ఢిల్లీ గోడలకు చెవులుండవనే భరోసాతోనే కావచ్చును కానీ, మాట్లాడుకుంటున్న మాటలు, పార్టీ పరిస్థితికి అద్దం పడుతున్నాయని, ఢిల్లీ వాలాలు,  అంటున్నారు.

అదలా ఉంటే రాష్ట్రంలో పత్రికలు, ప్రతిపక్ష నాయకుకులు మంత్రి కేటీఆర్, భారత రాష్ట్ర సమితి (భారాస) ఢిల్లీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎందుకు వెళ్ళలేదు? ఆయన అలిగారా? ముఖ్యంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కంటే కుమార్తె కవితకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా? అందుకే ఆ  అక్కసుతో కేటీఆర్  తండ్రి మీద అలిగి ఢిల్లీ వెళ్ళలేదా? అందుకే ఆయన భారాస వేడుకకు దూరంగా ఉన్నారా ? డుమ్మా కొట్టారా? అని ఉహాగానాలు షికారు చేస్తున్నాయి. అయితే కేటీఆర్ అదేమే లేదని, ముఖ్యమైన కార్యక్రమాలు ఉండడం వల్లనే ఢిల్లీ వెళ్ళ లేక పోయానని వివరణ  ఇచ్చారు. 
అదలా ఉంటే మాజీ మంత్రి  కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కొండా సురేఖ ఈ మొత్తం వ్యవహారాన్ని మరో మలుపు తిప్పారు. ముఖ్యమంత్రి కేసేఆర్ జాతీయ రాజకీయాల్లో బిజీ  అయిపోతున్న నేపధ్యంలో   రాష్ట్రంలో భారాస పార్టీ  పగ్గాలు కవితకు ఇవ్వాలని, అదే విధంగా ముఖ్యమత్రి పదివిని కూడా కూతురు కవితకు ఇచ్చే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారా .. అనే అనుమానాలు కలుగుతున్నాయని కొండ సురేఖ బాంబు పేల్చారు.

కొండ సురేఖ ఏ ఆధారాలతో ఈ అనుమానాలు వ్యక్త పరిచారో ఏమో కానీ, అన్నా- చెల్లీ మధ్య రాజకీయ చిచ్చు రగులుతోందనేది మాత్రం తిరుగులేని నిజం. గతంలోనూ  కవిత పండగలు పబ్బాలకు కూడా పుట్టిల్లు ( ప్రగతి భవన్) గడప తొక్కడం లేదని, వార్తలొచ్చాయి. చివరకు రాఖీ, బతుకమ్మ పండగ వేడుకలలో కూడా ఆమె ప్రగతి భవన్ లో కనిపించేలేదు.  ఈ నేపధ్యంలోనే  కావచ్చును ఇప్పడు కేటీఆర్ బీఆర్ఎస్ కార్యాయలం ప్రారంభోత్సవానికి వెళ్లకపోవడం వెనుక ఇంకేదో కారణం ఉందనే  అనుమానాలు, కొండ సురేఖ వంటి వారు వ్యక్తపరుస్తున్నారు. 

అయితే, అవ్వన్నీ ఎలా ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక చాలు దొర అని ప్రజలు సాగనంపే వరకు ముఖ్యమంత్రి పదవిని వదులు కోరని సన్నిహిత వర్గాలు చెపుతున్నాయి. నిజానికి ముఖ్యమంత్రి కుర్చీ కోసం కేసీఆర్, కేటీఆర్, కవిత మధ్య సాగుతున్న తెరచాటు యుద్ధమే, తెరాస/ భారాస సమస్యలకు మూల కారణం అంటున్నారు. అవును కుటుంబ పార్టీలలో కుటుంబ కలహాలే ఉంటాయి .. అంటున్నారు.నిజమేనేమో ..

By
en-us Political News

  
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.