మళ్ళీ ఢిల్లీకి కేసీఆర్ ఈసారి అజెండా అదేనా?

Publish Date:Jul 25, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి పయనమవుతున్నారు.ఇంచుమించుగా రెండు నెలల విరామం తర్వాత, అయన మరో మారు ఢిల్లీ వెళుతున్నారు.  సోమవారం (జులై 25) సాయంత్రం ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయనతో పాటు మరో కొందరు మంత్రులు, ముఖ్యనాయకులు కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెసుస్తోంది.

అయితే ముఖ్యమంత్రి ఢిల్లీ ఎందుకు వెళుతున్నారు, అంటే, భారత దేశ 15వ రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకే ముఖ్యమంత్రి ఢిల్లీ వెళుతున్నారని అధికార వర్గాల సమాచారం. అయితే, కేవలం నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు చెప్పేందుకేనా? అంటే, కావచ్చును, కాకపోవచ్చును అనే సమాధానమే వస్తోంది. ఎందుకంటే, ముఖ్యమంత్రి జాతీయ పార్టీ ఏర్పాటు విషయంగానూ, అటూ ఇటూ అడుగులు వేస్తున్నారు. మరోవంక, మహారాష్ట్ర పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వ్యూహాన్ని మార్చుకున్నారని అంటున్నారు. 

అయితే, ముఖ్యమంత్రి ఇలా వెళ్లి అలా రావడం లేదు, రెండు మూడు రోజులు అక్కడే ఉంటారని అంటున్నారు. జాతీయ రాజకీయాలపై కొందరు కీలక నేతలను కలిసే చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. అంటే కేవలం నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు చెప్పడం ఒక్కటే కార్యం కాదు. అదొక్కటే ముఖ్యమంత్రి హస్తిన యాత్ర పరమార్ధం కాదు, చక్క పెట్టవలసిన కార్యాలు ఇంకా ఉన్నాయని అంటున్నారు.

జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ సహ ఇతర ప్రతిపక్ష పార్టీలతో, కలిసి నడిచేందుకు ఒక విధంగా మానసికంగా సిద్దమైన ముఖ్యమంత్రి, ఈ పర్యటనలో ఆ దిశగా ఒకడుగు ముందుకేసే అవకాశం లేక పోలేదని అంటున్నారు. అందులో భాగంగా.. విపక్ష పార్టీల నేతలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్ధి,  యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. అలాగే, నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ని విచారించడాన్నీ వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ  పార్లమెంట్ లోపల వెలుపల నిర్వహించిన  నిరసన ప్రదర్శనలకు తెరాస ప్రత్యక్షంగా కాకున్నా పరోక్షంగా మద్దతు నిచ్చింది.

ఇక ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత మార్గరేట్ అల్వాను ప్రతిపక్ష పార్టీలు ఉపరాష్ట్రపతి ఉమ్మడి అభ్యర్ధిగా  ప్రకటించాయి. అయితే తెరాస మాత్రం ఇంకా స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించలేదు. కానీ,ఒక  విధంగా కాంగ్రెస్ కు దూరం అంటూనే దగ్గరయ్యే ప్రయత్నాలు తెరాస సాగిస్తోంది. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి ఈ విషయంలో మరో ముందడుగు వేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే, ముఖ్యమంత్రి ఇదమిద్దంగా ఎందుకు వెళుతున్నారు ... అనే విషయంలో మాత్రం ఎవరికీ స్పష్టత లేదని, అవకాశం చిక్కితే, ఒకరిద్దరు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉందని అంటున్నారు.

By
en-us Political News

  
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.