కేసీఆర్ 'మూడు'.. మళ్లీ మొదటికే..!

Publish Date:Feb 26, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ ఢిల్లీ వెళుతున్నారు. ఎందుకు, ఏమిటీ అనేది అందరికీ తెలిసిన విషయమే. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు చేసేందుకు, శత విధాల ప్రయత్నిస్తున్న ఆయన అదే పని మీద, రేపో మాపో ఢిల్లీ వెళతారని సీఎంవో వర్గాల సమాచారంగా తెలుస్తోంది. అయితే, ఢిల్లీలో ఆయన ఎవరిని కలుస్తారు, ఆయన్ని ఎవరు కలుస్తారు, అనే విషయంలో ఇంతవరకు అయితే  స్పష్టత  లేదు. ఒకటి రెండు రోజుల్లో షెడ్యూల్ వెల్లడిస్తామని సీఎంవో వర్గాల సమాచారంగా ప్రచారం  జరుగుతోంది. 

అదలా ఉంటే జాతేయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు సంబంధించి, ఇతర ప్రాంతీయ పార్టీల నుంచి, కేసీఆర్ ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదని, బీజేపీ వ్యతిరేక కూటమికి ఓకేఅన్నా, కాంగ్రెస్ లేని ఫ్రంట్ అంటేనే కాదంటున్నారు. అందుకే. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు సంబదించి వెనకా ముందు అడుతున్నారని పార్టీ వర్గాల్లో వినవస్తోంది.ఇప్పటి వరకు ముఖ్యమంత్రి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు విషయంగా చేసిన యాత్రలు, జరిపిన చర్చలు ఏవీ సక్సెస్ కాలేదు. ముందుగు పడలేదు.అంతే కాకుండా, ఇటీవల ముంబై పర్యటన సందర్భంగా, శివసేన నాయకుడు సంజయ్ రౌత్, నోటితో పొగడి నొసటితో వెక్కిరించినట్లుగా, కేసీఆర్ గొప్పోడు అంటూనే, కాంగ్రెస్ చేయి వదిలేది లేదని స్పష్టం చేశారు. మరో వంక ఎన్సీపీ అధినేత శరద్ పవార్  అయితే  వస్తే ఆయన వచ్చి కాంగ్రెస్ కూటమిలో చేరాలే కానీ, ఎన్సీపీ, కాంగ్రెస్ లేని కూటమిలో చేరదని  తెగేసి చెప్పారు. 

మరోవంక కేసీఆర్ ఎత్తుగడలను పసిగట్టిన ఉత్తరాది ప్రాంతీయ పార్టీలు కూడా, కేసీఆర్’తో చేతులు కలిపేందుకు సిద్దంగా లేవని తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే, కేసీఆర్ ఢిల్లీ వెళ్ళినా పెద్దగా ప్రయోజనం ఉండదని, అందుకే ఏదో వంకన ఢిల్లీ యాత్రను, అసెంబ్లీ సమావేశాలు, పార్లమెంట్ సమావేశాల వంకన సాధ్యమైనంత వరకు వాయిదా వేసే ఆలోచనలోనే కేసీఆర్ ఉన్నట్లు, తెలుస్తుంది. అందుకే, గురువారమే ఆనుకున్న ముఖ్యమంత్రి ఢిల్లీ యాత్ర రద్దయినట్లు తెలుస్తోంది. అదలా ఉంటే, ఒక వేళ ఈలోగా ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళినా, ఒకరి రెండు రోజులు గడిపి,మార్చి3న మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల వంకన వెనక్కి వస్తారని, అంటున్నారు. ఇక ఆపైన అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే పార్లమెంట్ సమావేశాలు మొదలవుతాయి. అలాగే. మార్చి 10 ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేస్తాయి.. ఫలితాలను బట్టి పొలిటికల్ నెరటీవ్’ ఎలా మారుతుందో .. ఏమవుతుందో ఎవరికీ తెలియదు. ఏతా వాతా తెలుస్తున్నదేమంటే, కేసీఆర్’ ఢిల్లీ యాత్ర ఎలాఉన్నా, మూడో కూటమి ముడిపడేది కాదని మాత్రం స్పష్టమవుతోందని అంటున్నారు.
 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో పర్యటించారు.
హైదరాబాద్‌లోని గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో అనూహ్య విమాన ఘటన చోటుచేసుకుంది.
సైబరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు తెలంగాణ పోలీస్ శాఖ కొత్త చర్యలకు సిద్ధమవుతోంది.
ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై హెచ్చరిక చిహ్నాల అమలులో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సర్వం సిద్ధమైంది.
హైదరాబాద్ నగరంలోని రేతిబౌలి ప్రాంతంలో జరిగిన పెళ్లి ఊరేగింపులో కత్తులు చేతబట్టి నృత్యం చేసిన నలుగురు వ్యక్తులను గుడిమల్కాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
సూపర్ ఇంటెలిజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మనిషి సహజ వృద్ధాప్య ప్రక్రియను నియంత్రించగలిగితే, సుమారు 1,400 సంవత్సరాల వరకు జీవించే అవకాశం
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
ప్రపంచ అందాల పోటీల చరిత్రలో కీలక మలుపు చోటు చేసుకుంది.
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు, రేడియల్ రోడ్ల నిర్మాణం, పట్టణాభివృద్ధి పనుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆయా ప్రాజెక్టుల పనుల స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ముంబయిలోని కాలాచౌకి ప్రాంతానికి చెందిన ఉదయ్ పవార్ పట్టుదల, ఆచరణాత్మక ఆలోచనలతో చిన్న స్థాయి సేవను లాభదాయక వ్యాపారంగా తీర్చిదిద్దారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.