కొట్లాడి తెచ్చిన తెలంగాణ.. కేసీఆర్ ఎమోషన్ పని చేసేనా?

Publish Date:Oct 23, 2023

Advertisement

తెలంగాణ రాజకీయాలను అవపోసన పట్టిన ఘనుడు కల్వకుంట చంద్రశేఖర రావు. తెలంగాణ పల్లె సంస్కృతిని, తెలంగాణ ప్రజల మనసు లోతులను కొలిచి.. అందులో రాజకీయ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్న  టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) పార్టీ. అందుకే ఎవరెన్ని మాట్లాడినా.. ప్రజలను ఎంతగా తమ వైపుకు తిప్పుకున్నా.. ఒక్కసారి కేసీఆర్ మైక్ అందుకుంటే ప్రజలంతా తన గురించి మాట్లాడుకొనేలా చేసుకోగలరు. ఇప్పటి వరకూ తెలంగాణలో జరిగింది ఇదే. ఒకవైపు రాజకీయంగా తన ప్రత్యర్థులను కోలుకోకుండా దెబ్బ తీస్తూనే.. ప్రజల నాడీని పసిగట్టి అందుకు అనుగుణంగా ప్రసంగాలు చేస్తూ వచ్చారు.   దీంతో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన పాలన ఎలా ఉన్నా మాటలతోనే ప్రజలను బోల్తా కొట్టించి కారు ఎక్కించుకొని అసెంబ్లీకి వెళ్లేవారు. అలా ఒకసారి కాదు.. రెండు సార్లు విజయవంతంగా అధికార పగ్గాలు అందుకున్నారు. ఆ క్రమంలో ఆయన  ఆ సమయానికి రాష్ట్రంలో పరిస్థితులను బట్టి ఒక అంశాన్ని టేకప్ చేసుకొని అందులోనే సెంటిమెంట్ రగిలించి ఓట్లుగా మలచుకునే వారు. గత రెండు ఎన్నికలలో కేసీఆర్ అదే చేశారు. ముఖ్యంగా తెలంగాణ స్వాభిమానం పేరిటే ఇంత వరకూ కేసీఆర్ ఎన్నికల రాజకీయం అంతా నడిచింది.

సరిగ్గా ఎన్నికలకు ముందు తెలంగాణ వాదాన్ని, తెలంగాణ సెంటిమెంటును, ఆంధ్రా నేతల పాలనను తెరమీదకి తెచ్చి.. ఓటర్ల గుండెల్లో అగ్గిపుట్టించే వారు. తెలంగాణ రాష్ట్రం ఊరికే అచ్చిందా .. చావు నోట్లో తలబెట్టి తెచ్చిన.. ఊరికే ఇచ్చిన్రా రాష్ట్రం.. ఆగమాగం జేస్తే ఇచ్చిన్రు. సోయ లేకుండా నిర్ణయాలు తీసుకోకన్రి.. ఇంకా ఈ ఆంధ్రోళ్లు మన నెత్తిన అవసరమా.. ఇంకా మనం ఢిల్లీ ఎళ్లి గులాంగిరి జేయాల్నా.. జెర ఆలోచించుర్రి లాంటి మాటలతో తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి తన పబ్బం గడుపుకునే వారు. ఎన్నికలు ఏవైనా సరే కనీసం ఒక్కసారైనా తెలంగాణ తెచ్చింది నేనే అనే మాట లేకుండా కేసీఆర్ ప్రసంగాలు ఉండవు. ఇక, ఆ పార్టీ నేతలైతే తెలంగాణ జాతి పిత మన కేసీఆర్ అనే రేంజిలో ఎలివేషన్స్ ఇస్తారు. ఒక ధంగా తెలంగాణ అనే ఎమోషన్ మీదనే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల గండం నుండి గట్టెక్కుతూ వస్తుంది. 

అయితే, ఈసారి ఈ తెలంగాణ ఎమోషన్ కేసీఆర్ ను గెలిపిస్తుందా అనే చర్చ జరుగుతుంది. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ. గత రెండుసార్లు కాంగ్రెస్ పరిస్థితి వేరు.  ప్రస్తుతం బీఆర్ఎస్ సర్కార్ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది. అదే సమయంలో కాంగ్రెస్ బలంగా పుంజుకుంది.  తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చడంలో కేసీఆర్ వైఫల్యాలను ఎత్తి చూపుతూ.  తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీయే అంటూ బలంగా ప్రజలలోకి చొచ్చుకుపోయింది. చొచ్చుకుపోతోంది. అస‌లు సోనియా ప్రత్యక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న రాజకీయ సంకల్పం తీసుకోకుండా ఉంటే తెలంగాణ వ‌చ్చేదా అంటూ ప్రజల మనసుకు హత్తుకునేలా ప్రశ్నిస్తోంది.  దీంతో తెలంగాణ  ప్రజలలో ఇదే చ‌ర్చ‌నీయాంశంగామారింది.   రెండుసార్లు తెలంగాణ తెచ్చిన వారికి అవకాశం ఇచ్చాం.. ఒకసారి తెలంగాణ ఇచ్చిన పార్టీకి అవకాశం ఇవ్వాలనే ఆలోచన మొదలైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

మరోవైపు అసలు ఈ సెంటిమెంటే ఈసారి ఎన్నికలలో ఏ మాత్రం ఉపయోగపడదన్న భావన వ్యక్తం అవుతోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగి దశాబ్దం అయ్యింది. అంతే కాకుండా పార్టీ పేరులోని తెలంగాణను కూడా కేసీఆర్ తీసి పారేశారు. అలాగే ఈ పదేళ్లలో ఉద్యమ నేపథ్యం ఉన్న వారికి పార్టీలో ప్రాధాన్యత కూడా లేకుండా చేశారు. ఉద్యమ సమయంలో తెలంగాణ ద్రోహులుగా తాను స్వయంగా ముద్ర వేసిన నాయకులను కేసీఆర్ చేరదీశారు. దీంతో తెలంగాణ ఎమోషన్ ను ఈ సారి కేసీఆర్ పండించలేకపోవచ్చునని, అదే సమయంలో ప్రజలలో ఈ పదేళ్ల కాలంలో కేసీఆర్ చేసిందేమిటన్న ప్రశ్న బలంగా మెదులుతోందని పరిశీలకులు విశ్లేషిప్తున్నారు.   దీంతో ఈసారి తెలంగాణలో కేసీఆర్ తెలంగాణ ఎమోషన్ ను పండించలేరనీ, ఈ సారి ప్రజలు ఇచ్చే తీర్పు కేసీఆర్ పాలనపైనేననీ అంటున్నారు. 

By
en-us Political News

  
బీజేపీకి ఓటేస్తే.. సామాజిక న్యాయానికి పాడె కట్టడమేనన్నారు. రాష్ట్రంలోని బీజేపీని అడుగుపెట్టనీయవద్దని, ఒక్క సీటు కూడా వారికి ఇవ్వకుండా తమిళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల కోరారు.
అమరావతికి సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధ రాజధానిగా గుర్తింపు లభించిన తరువాత కూడా సజ్జల మౌలిక వసతులు లేని ప్రాంతంలో వేలకోట్టు కుమ్మరిస్తోందంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా.. గ్రాఫిక్స్ రాజధాని అంటూ పాత పాటే పాడారు సజ్జల.
ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశం అత్యంత ఆత్మీయంగా, భావోద్వేగాల మధ్య సాగింది. చాలా కాలం తర్వాత తన పాత మిత్రుడిని కలిసిన జీవన్ రెడ్డి ఒ ఉద్వేగానికి లోనయ్యారు.
గత కొంతకాలంగా తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ, అలాగే నివాసంలో లభించిన లెక్కకు రాని నగదు వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం నితీశ్ కుమార్ ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి పదవికి మరో మూడు నాలుగు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. తాను లేని పక్షంలో రాష్ట్ర బాధ్యతలను కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
వైసీపీ సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు రాజకీయ ఫ్లెక్సీలపై స్పందిస్తూ.. ఎవరిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు? 2029లో రాష్ట్రాన్నా లేక ప్రజలనా? అంటూ ప్రశ్నించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజున జరిగిన పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు.
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.