కేసీఆర్ మరో యూటర్న్.. నేషనల్ జోష్‌కు బ్రేక్

Publish Date:Apr 20, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ మరోసారి, జాతీయ రాజకీయాల విషయంలో  ‘యూ’ టర్న్ తీసుకున్నారా? ఢిల్లీ రాజకీయం అచ్చిరాలేదనే నిర్ణయానికి వచ్చారా? అందుకేనా, ఆయన, ఢిల్లీలో పది రోజులు మకాం తర్వాత, ఏప్రిల్ 11న త్వరలోనే ఢిల్లీ వస్తానని, మోడీ ప్రభుత్వం పై యుద్ధం కొనసాగిస్తానని ప్రకటించి వచ్చినా, ఢిల్లీ నుంచి వచ్చిన అనంతరం హైదరాబాద్’లో నూ అదే చెప్పినా, ఒకటి రెండు రోజులకే మళ్ళీ ఢిల్లీకి అని సొంత మీడియాలో సైతం  వార్తాలు వచ్చినా, గత ఐదారు రోజులుగా ఎలాంటి చప్పుడు లేకుండా, ఫార్మ్ హౌస్’కే పరిమితం అయ్యారా? అంటే, అవుననే మాటే అటునుంచి వస్తోంది. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్’ ఎప్పుడు, ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ తెలియదని, ప్రస్తుతానికి అయితే, కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక ప్రత్యాన్మాయ ఫ్రంట్ ఏర్పాటు ప్రతిపాదనను పక్కన పెట్టినట్లే కనిపిస్తోందని అంటున్నారు. 

అదలా ఉంటే వరంగల్ జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్, జాతీయ పార్టీలకు, ప్రాంతీయ ప్రయోజనాలు ముఖ్యం కాదంటూ చేసిన వ్యాఖ్యలు, కేసీఆర్ కొత్త అలోచనలకు అద్దం పట్టేలా ఉన్నాయని అంటున్నారు. నర్సంపేటలో రూ. 43.50 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన కేటీఆర్, అశోక్ నగర్ వద్ద మెగా కంపెనీ ద్వారా ఇంటింటికీ గ్యాస్ అందుబాటులో వచ్చే విధంగా ఏర్పాటు చేసిన ప్లాంట్ను ప్రారంభించారు. అనంతరం నర్సంపేట బైపాస్ రోడ్లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు.

ఈ సందర్భంగా కేటీఆర్, తెరాసను ఇంటి పార్టీగా వర్ణించారు. కాంగ్రెస్, బీజేపీలకు దేశంలోని మొత్తం 28 రాష్ట్రాలలో తెలంగాణ ఒక రాష్ట్రం అయితే, తెరాసకు తెలంగాణ ఒక్కటే రాష్ట్రమని,  
 కోట్లాది సాధించుకున్న తెలంగాణ  రాష్ట్రం రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పుకొచ్చారు. అలాగే, ఎట్టికైనా, మట్టికైనా మనవాడే ఉండాలి, మన పార్టీనే ఉండాలననే సామెతలను జోడించి సెంటిమెంట్’ను టచ్’చేసే ప్రయత్నం చేశారు. తెలంగాణకు తెరాసనే శ్రీరామ రక్ష అంటూ చెప్పుకొచ్చారు. కేటీఆర్ మాట్లాడిన తీరు చూస్తే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆలోచనకు కేటీఆర్ చుక్క పెట్టినట్లే కనిపిస్తోందని అంటున్నారు. అయితే, బీజేపీ టార్గెట్’గానే తెరాస భవిష్యత్ వ్యూహం  ఉంటుందని, అందుకే, నర్సంపేట సభలోనూ కేటీఅర్, కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీని టార్గెట్ చేశారని అంటున్నారు. అయితే, మే 6న  రాహుల్ గాంధీ వరంగల్’లో పర్యటించనున్న నేపధ్యంలో, ముందు జాగ్రత్తగానూ కేటీఆర్’ ఎవరెవరో వస్తారు ఏవేవో చెపుతారు అటూ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు.  

అయితే, తెరాస ఒక్కసారిగా జాతీయ రాజకీయాల విషయంలో యూ టర్న్ తీసుకోవడానికి, ప్రధానంగా, బీజేపీ వ్యతిరేక పార్టీలు ఏవీ కేసీఆర్’ ను కాన్ఫిడెన్సులోకి తీసుకోకపోవడం ఒక కారణంగా చెపుతున్నారు. అలాగే, ఎన్నికల వ్యూహకర్త, ప్రశాంత కిశోర్’ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం కావడం కూడా కేసేఅర్ జాతీయ నిరాసక్తతకు మరో కారణంగా పరిశీలకులు భావిస్తున్నారు. పీకే కాంగ్రెస్’లో చేరే పక్షంలో రాష్ట్రంలోనూ ఈక్వేషన్స్ మారే ప్రమాదముంది.అందుకే, కేసీఆర్ ప్రస్తుతానికి జాతీయ రాజకీయాలను పక్కన పెట్టే అలోచన చేస్తున్నారని అంటున్నారు. అందుకే కేసీఆర్ జాతీయ రాజకీయాల విషయంలో జోష్ తగ్గించారని, జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలలో నెలకొన్న గందరగోళం తొలిగే వరకు జాతీయ రాజకీయాలకు కొంత దూరంగ ఉండాలనే లోచనలో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు.

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.