ఏసీబీ ఈడీ నోటీసులతో కేటీఆర్ ఉక్కిరిబిక్కిరి

Publish Date:Jan 3, 2025

Advertisement

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పూర్తిగా చిక్కుల్లో చిక్కుకున్నట్లే కనిపిస్తోంది. ఆయనను దర్యాప్తు సంస్థలు వెంటాడుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ కు ఈ నెల 6న విచారణకు రావాల్సిందిగా ఏసీబీ శుక్రవారం (జనవరి 3)న నోటీసులు జారీ చేసింది. అంతకు ముందే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసి.. ఈ నెల 7న విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది. 

ఇదే ఇప్పుడు కేటీఆర్ ఈ కేసులో నిండా మునిగారా అన్న అనుమానాలకు తావిస్తున్నది. ఒకే కేసులో రెండు దర్యాప్తు సంస్థలూ కేటీఆర్ ను విచారించడం, అది వరుసగా 6, 7 తేదీలలో విచారణకు రావాల్సిందిగా ఆదేశించడం  కేటీఆర్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నదని చెప్పవచ్చు. ఒక్క రోజు తేడాలో ఆయన ఏసీబీ, ఈడీ విచారణకు హాజరు కావాల్సి రావడం సంచలనంగా మారింది. బీఆర్ఎస్ వర్గాలలో ఆందోళనకు కారణమైంది. 

 ఫార్ములా కార్ కేసులో  అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై మంత్రిగా పనిచేసిన కేటీఆర్ తో పాటు అప్పట్లో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీరుగా పనిచేసిన బీఎల్ఎన్ రెడ్డి మీదా ఏసీబీ కేసులు పెట్టడమే కాకుండా ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేసింది.

ఆ ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ రంగంలోనికి దిగి ఆ ముగ్గురికీ నోటీసులు జారీ చేసింది. ముందుగా కేసు నమోదు చేసినది ఏసీబీయే అయినా, ఆ ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోనికి దిగిన ఈడీ దూకుడుగా ముందుకు సాగుతోంది.  2వ తేదీన విచారణకు హాజరుకావాల్సిన బీఎల్ఎన్ రెడ్డి, 3వ తేదీన హాజరవ్వాల్సిన అర్వింద్ హాజరుకాలేదు. వారిరువురూ మూడు వారాల గడువు కోరితే.. ఈడీ మాత్రం వారికి రోజుల వ్యవధి మాత్రమే ఇచ్చింది. బీఎల్ఎన్ రెడ్డి, అర్వింద్ లను వ రుసగా 8,9 తేదీలలో విచారణకు రావాల్సిందిగా మరో మారు నోటీసులు ఇచ్చింది. వారిరువురి కంటే ముందుగా ఈడీ కేటీఆర్ ను విచారించేందుకు రెడీ అయ్యింది. కేటీఆర్ ను ఈడీ ఈ నెల 7నే విచారించనుంది.చ అంటే ఫార్ములా ఈ రేస్ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురినీ వరుసగా ఒకరి తరువాత ఒకరిని విచారించడానికి ఈడీ నోటీసులు జారీ చేసిందన్నమాట. అయితే ఈడీ విచారణకు కేటీఆర్ డుమ్మా కొట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.

ఒక వైపు ఈడీ విచారణ విషయంలో ఉత్కంఠ కొనసాగుతుండగానే.. హఠాత్తుగా ఏసీబీ కూడా దూకుడు పెంచింది. శుక్రవారం (జనవరి 3)న కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి మూడు రోజుల వ్యవధి ఇచ్చి జనవరి 6న విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. అంటే నోటీసుల మేరకు కేటీఆర్ 6న ఏసీబీ ఎదుట, 7న ఈడవీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది.   ఫార్ములా ఈ కార్ రేసులో  కేటీఆర్ అవినీతికి ఆధారాలున్నాయని ప్రాథమిక విచారణలో నిర్థారించుకున్న ఏసీబీ దూకుడుగా సాగుతోంది. అరెస్టు కాకుండా కేటీఆర్ కు కోర్టు తాత్కాలిక ఊరట ఇచ్చినప్పటికీ, విచారణలతో కేటీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహంతో ఏసీబీ ముందుకు సాగుతున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎండగట్టారు. అమరావతిని జగన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారనీ, ఇప్పుడు కొత్తగా మావిగన్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు
ఏపీకి రాజధాని ఏది? అమరావతి శాశ్వతమా లేక మావిగాన్ అంటూ జగన్ చేసిన ప్రతిపాదనతో మళ్లీ రాజధానిపై జనంలో అనుమానాలు మొదలయ్యాయా? అన్న చర్చ మొదలైంది. ఏపీ రాజధాని విషయంలో మరో ప్రయోగం మొదలుకాబోతోందా? అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి వేడుకలు దేశరాజధానిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్లమెంటు ఆవరణలోని ప్రేరణా స్థల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేశాధినేతలు, రాజకీయ దిగ్గజాలు ఒకే వేదికపైకి వచ్చారు. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
బీజేపీకి ఓటేస్తే.. సామాజిక న్యాయానికి పాడె కట్టడమేనన్నారు. రాష్ట్రంలోని బీజేపీని అడుగుపెట్టనీయవద్దని, ఒక్క సీటు కూడా వారికి ఇవ్వకుండా తమిళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల కోరారు.
అమరావతికి సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధ రాజధానిగా గుర్తింపు లభించిన తరువాత కూడా సజ్జల మౌలిక వసతులు లేని ప్రాంతంలో వేలకోట్టు కుమ్మరిస్తోందంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా.. గ్రాఫిక్స్ రాజధాని అంటూ పాత పాటే పాడారు సజ్జల.
ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశం అత్యంత ఆత్మీయంగా, భావోద్వేగాల మధ్య సాగింది. చాలా కాలం తర్వాత తన పాత మిత్రుడిని కలిసిన జీవన్ రెడ్డి ఒ ఉద్వేగానికి లోనయ్యారు.
గత కొంతకాలంగా తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ, అలాగే నివాసంలో లభించిన లెక్కకు రాని నగదు వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం నితీశ్ కుమార్ ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి పదవికి మరో మూడు నాలుగు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. తాను లేని పక్షంలో రాష్ట్ర బాధ్యతలను కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
వైసీపీ సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు రాజకీయ ఫ్లెక్సీలపై స్పందిస్తూ.. ఎవరిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు? 2029లో రాష్ట్రాన్నా లేక ప్రజలనా? అంటూ ప్రశ్నించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజున జరిగిన పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.