రాజకీయ నాయకులలో భాషా సంస్కారం తగ్గిపోతోందన్న విమర్శ ఇటీవలి కాలంలో చాలా చాలా గట్టిగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సభ్య సమాజం ఇసుమంతైనా సహించని పదజాలంతో రాజకీయ ప్రత్యర్థులపై దూషణలకు దిగడం ఇటీవలి కాలంలో సర్వసాధారణంగా మారింది. ఇటీవల వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ఉపయోగించిన అసభ్య పదజాలం, దూషణలు, అలాగే మంత్రి నారా లోకేష్ టార్గెట్ గా మరో మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు జోగు రమేష్ ఉపయోగించిన భాష ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
తెలుగు రాష్ట్రాలలో భాషా సంస్కారానికి తిలోదకాలిచ్చి, ఇష్టారీతిగా సంస్కారం లేకుండా ప్రత్యర్థులపై దూషణల పర్వానికి దిగడం అన్నది ఎక్కువైందని పరిశీలకులు అంటున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలలో ఈ రకమై భాష వినియోగానికి శ్రీకారం చుట్టినది బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. కేసీఆర్ ఆరంభించిన ఈ ఆమోదయోగ్యం కాని భాషను ప్రత్యర్థులపై ప్రయోగించే సంస్కృతిని కేసీఆర్ ఆరంబిస్తే.. దానిని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కొనసాగించారని ఆయన పేర్కొన్నారు.
బెజవాడలో మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు.. తెలంగాణ సాధన ఉద్యమ కాలంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు నోటికి వచ్చినట్లు బూతులు మాట్లాడారని గుర్తుచేశారు. అయితే అప్పట్లో ఉద్యమ వేడి కారణంగా కేసీఆర్ భాషను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదన్నారు. అభ్యంతరం ఉన్నా.. తెలంగాణ సెంటిమెంట్ అత్యంత బలంగా ఉండటంతో.. అడ్డు చెప్పి ఎదుర్కోవడానికి వెనుకాడారని పేర్కొన్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు చేయడం సహజమే అయినా, వ్యక్తిగత దూషణలు, అసభ్య పదప్రయోగాలు మాత్రం కేసీఆర్ హయాంలోనే మొదలైందన్న ఆయన ఈ ధోరణి రాజకీయ నాయకులలో ప్రబలడం సమాజానికి ఎంత మాత్రం మంచిది కాదన్నారు.
కేసీఆర్‌ను తమ గురువుగా భావించే జగన్.. ఏపీ రాజకీయాలలోకి కూడా భాషా సంస్కారానికి తిలోదకాలిచ్చి, అసభ్య పదజాలంతో ప్రత్యర్థులను దూషించడం మొదలెట్టి కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పాలన సాగిన ఆ ఐదేళ్ల కాలంలో ఆ పార్టీ నాయకులు, మంత్రులు సైతం దారుణమైన బూతులతో ప్రత్యర్థి పార్టీల నాయకులపై విరుచుకుపడ్డారన్నారు. దీని వల్ల ఏపీ రాజకీయ సంస్కృతి దారుణంగా దెబ్బతిందన్నారు. కేసీఆర్, జగన్ ఇద్దరూ కూడా సమస్యలను చర్చల ద్వారా కాకుండా.. ప్రత్యర్థులను అణచివేస్తూ, తొక్కుకుంటూ ముందుకు సాగాలనే తత్వం వారిద్దరిలోనూ కనిపిస్తుందని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన నాయకులే బూతులు మాట్లాడటం యువతకు తప్పుడు సంకేతాలు ఇస్తుందని ఏబీవీ అభిప్రాపడ్డారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-started-and-jagan-continue-39-213733.html
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్‌రాజ్‌లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.
పరామర్శల పేరిట పోలీసుల ఆంక్షలను ఉల్లంఘిస్తూ, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా సాగుతున్న ఆయన పర్యటనల తీరు నేపథ్యంలో జగన్ భద్రత అంశం మరోసారి చర్చకు వచ్చింది. అంతటితో ఆగకుండా, జగన్‌కు రక్షణ తగ్గించారంటూ వైసీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వడంతో జగన్ భద్రత అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అయోధ్య రామమందిరం పేరిట సేకరించిన విరాళాల విషయంలో అక్రమాలు జరిగాయనే అంశాన్ని వ్యంగ్యంగా, నాటకీయంగా చూపించేందుకు వారు చేపట్టిన ఈ వినూత్న నిరసన రాజకీయ వివాదానికి దారి తీసింది. రామాలయాన్ని, పూజారి వ్యవస్థను, భక్తుల నమ్మకాలను హేళన చేసేలా ఈ నిరసన ఉందంటూ.. బీహార్‌లోని జమూయి సివిల్ కోర్టులో ఓ సీనియర్ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.
రిజర్వేషన్ల విధానాన్ని అంబేడ్కర్ ఆశయాలు, దృక్పథానికి అనుగుణంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న మోహన్ భగవత్.. విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల విధానం ఎంతకాలం కొనసాగాలనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. రిజర్వేషన్లు కేవలం రాజకీయ ప్రాతిపదిక కాదనీ సామాజిక అనివార్యత అన్నారు.
గడిచిన దశాబ్ద కాలంలో కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ, ప్రస్తుతం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జగన్ పర్యటనలలో జరిగిన పలు సంఘటనలకు సంబంధించిన వీడియో ఆధారాలను వంగలపూడి అనిత ఈ సందర్భంగా ప్రదర్శించారు. సాధారణంగా ఎవరైనా పరామర్శకు వెళ్తే బాధితులను ఓదార్చడం, వారికి అండగా నిలవడం ఆనవాయితీ అనీ, కానీ జగన్ మాత్రం నిజమైన బాధితులను వదిలేసి నిందితులను పరామర్శించడానికి వెడుతున్నారనీ మండిపడ్డారు.
యూపీలో భారీ వర్షాలు, శాంతిభద్రతల పరిస్థితి, కోర్టు ఆదేశాలు కారణంగా చూపుతూ కాయస్థ పాఠశాల ట్రస్ట్ అనుమతిని ఉపసంహరించుకుంది. అయితే ఈ వివరణ సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్ చెబుతోంది. అధికార యంత్రాంగం, బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే రాహుల్ సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది.
కనీసం తనతో సంప్రదించకుండా ఏకపక్షంగా అంబటి రాంబాబు పాదయాత్ర ప్రకటన చేయడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గత్యంతరం లేక అంబటి పాదయాత్ర విరమించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం.
వైసీపీకి కోర్టులు, న్యాయమూర్తులు, చట్టం, న్యాయం వంటి విషయాలలో పెద్దగా పట్టింపు లేదని గతంలో పలుమార్లు రుజువైంది. అలాగే ఇప్పుడు కూడా కోర్టు తీర్పులు కోర్టువే, మా దారి మాదే అన్న చందంగా విజయవాడ వేదికగా వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి.
ఇప్పటి వరకూ గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచులను మాత్రమే ప్రజలు నేరుగా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటున్నారు. అయితే, మండల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జడ్పీ ఛైర్మన్లతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్లు, మేయర్ల ఎంపిక పరోక్ష పద్ధతిలోనే జరుగుతోంది.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం త్వరలోనే విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఏటీఎఫ్)లో కూడా ఇథనాల్‌ను మిశ్రమం చేయడానికి సన్నాహాలు చేస్తోందంటూ ఆయన బాంబు పేల్చారు.
రాహుల్ గాంధీ నీట్ లీకేజీ వ్యవహారం కేవలం కేంద్ర విద్యాశాఖ వైఫల్యం మాత్రమే కాదంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల పోరాటానికి లభించిన తొలి విజయమేనంటూ, ఢిల్లీలో గత నెల 20న శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీఛార్జ్, పెల్లెట్ తుపాకుల వినియోగానికి నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.