కేసీఆర్ స్లీపింగ్.. ఎమ్మెల్యేల జంపింగ్.. అసెంబ్లీలో బీఆర్ఎస్ పరిస్థితేంటి?

Publish Date:Jul 20, 2024

Advertisement

భారత రాష్ట్ర సమితి... పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆ పార్టీకి గళమెత్తడానికి అజెండాయే లేకుండా పోయింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనముద్రలోకి వెళ్లిపోయారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, ఆ తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదేళ్ల పాటు ఓ వెలుగువెలిగిన చంద్రశేఖరరావు ఇప్పుడు అమావాస్యచంద్రుడిలా మారిపోయారు. మసకబారిపోయారు. అపర చాణక్యుడిగా, మాటల మాంత్రికుడిగా వెలుగొందిన ఆయన ఇప్పుడు చేష్టలుడిగి నిలబడిపోయారు. రాజకీయ వ్యూహాలలో ప్రత్యర్థుల కంటే రెండడుగుల ముందుంటారని పేరొందిన కేసీఆర్ ఇప్పుడు వ్యూహాలంటే ఏమిటో తిలియని పరిస్థితిలో పడ్డారు. ఆయన ఏం చేసినా రివర్స్ అవుతోంది. ఒక్క ఓటమి ఆయనను, ఆయన పార్టీనీ ఉనికి కోసం వెంపర్లాడే పరిస్థితికి తెచ్చింది. గతంలో కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తిన వారే ఇప్పుడు విమర్శలు గుప్పిస్తూ దూరం జరుగుతున్నారు. 

గత ఏడాది డిసెంబర్ లో జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తరువాత కేసీఆర్ సైలెంటైపోయారు. మధ్యలో ఒకటి రెండు సార్లు జనం మధ్యకు వచ్చినా ఆయన వాగ్దాటిలో కానీ, ప్రసంగాలలో కానీ మునుపటి పదును కనిపించడం లేదు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో  తన కుమార్తె కవిత అరెస్టు తరువాత ఆయన రాజకీయ వ్యూహాలన్నీ పక్కదారి పట్టాయన్న విమర్శలు సొంత పార్టీ నుంచే వస్తున్నాయి. కుమార్తెను కాపాడుకోవడం కోసం ఆయన బీజేపీకి దగ్గరౌతున్నారనీ, ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి ప్రయోజనం చేకూర్చేలా ఆయన వ్యూహాలు రచించారనీ, అభ్యర్థుల ఎంపికలో కూడా బీజేపీకి ఏ మాత్రం నష్టం వాటిల్లకూడదన్న జాగ్రత్త వహించారనీ బీఆర్ఎస్ నేతలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. 

తెలంగాణలో బీజేపీ బలపడితే  నష్టపోయేది బీఆర్ఎస్ అనే తెలిసి కూడా  పార్టీ భవిష్యత్ గురించి ఇసుమంతైనా ఆలోచించకుండా పార్లమెంట్ ఎన్నికల్లో పరోక్ష  సాయం చేశారు. ఆ కారణంగానే బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికలలో రాష్ట్రంలో మూడో స్థానానికి పడిపోయింది. ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం 16 శాతానికి పడిపోతే.. ఆ మేరకు బీజేపీ బలపడి ఓట్ల శాతాన్ని 35శాతానికి పెరిగింది. ఇప్పటికీ బీఆర్ఎస్ బీజేపీ తో పొత్తు, విలీనం  అంటూ జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టి పార్టీ పటిష్టతకు కేసీఆర్ నుంచి ఎటువంటి అడుగులూ పడటం లేదు. దీంతో బీఆర్ఎస్ క్యాడర్  నిరుత్సాహంతో ఉంది. నిజానికి కేసీఆర్ బీజేపీతో కలిసే వ్యూహానికి పదును పెట్టిన లక్ష్యం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. బీజేపీతో అయితే పొత్తులు పెట్టుకుని లేకపోతే విలీనం చేసి అయినా సరే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టి.. సంకీర్ణ ప్రభుత్వాన్ని అయినా ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. అధికారికంగా బీఆర్ఎస్‌కు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి ఎనిమిది మంది ఉన్నారు.

ఈ రెండు పార్టీలు కలిసినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. కానీ కేసీఆర్.. అరవై మంది ఎమ్మెల్యేలను తీసుకుని వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఓ సీనియర్ నేత తనకు ఫోన్ చేశారని ఆయన గతంలో చెప్పారు. బీజేపీ తల్చుకుంటే ఆపరేషన్ కమల్ ప్రారంభిస్తే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని ఆకర్షించడం పెద్ద పనేమీ కాదని ఎక్కువ మంది భావన. ఈ ఆలోచనలతోనే కేసీఆర్ బీజేపీతో కలిసిపోయేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. 

ఇక మరో వైపు రేవంత్ సర్కార్ ఫుల్ స్పీడ్ లో ఉంది. ఒక వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువాలు కప్పడం, ఇంకో వైపు హామీల అమలుతో  ప్రజాదరణను పెంచుకోవడంలో రేవంత్ సర్కార్ సక్సెస్ అయ్యింది. అసెంబ్లీ సమావేశాలలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి దోహదపడతాయని బీఆర్ఎస్ భావించిన అంశాల విషయంలో రేవంత్ సర్కార్ చాకచక్యంగా వ్యవహరించారు. రైతు రుణమాఫీని అమలు చేయడం, విద్యార్థుల డిమాండ్ మేరకు గ్రూప్ 2 ను వాయిదా వేయడం ద్వారా బీఆర్ఎస్ అస్త్రాలుగా భావించిన అంశాలను నిర్వీర్యం చేసేశారు. రుణమాఫీ అమలుతో రైతులు, గ్రూప్ 2 రద్దుతో  విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతు బంధు నిధులను రుణమాఫీకి మళ్లించారంటూ బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. దీంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ కు ఏ అవకాశమూ మిగలలేదు.  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
20 వార్డుల్లో 17 స్థానాలు గెలుపు.!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో పెను తుపాను ముప్పును ఎదుర్కొంటోంది.
​కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ ఎన్నికల కౌంటింగ్‌లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా  కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
 పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు నగర పంచాయతీల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎటువంటి పెద్ద అవాంతరాలు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.