బీఆర్ఎస్ లో చీలికకు బీజం కేసీఆర్ మౌనం!

Publish Date:Sep 30, 2024

Advertisement

మాటల మాంత్రికుడు, రాజకీయ చాక్యుడు.. ప్రత్యర్థుల కంటే రెండడుగుల ముందే  ఉంటారు. వారు వ్యూహ రచన చేయడానికి ముందే వాటికి విరుగుడు వ్యాహాలను అమలు చేసి వారిని నిరుత్తరులను చేస్తారు. ఇవీ బీఆర్ఎష్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ఆయన అధికారంలో ఉన్న పదేళ్లూ వినిపించిన మాటలు. కేసీఆర్ రాజకీయాలను తట్టుకోవడం కష్టమని అప్పట్లో ఆయన ప్రత్యర్థులు సైతం అంగీకరించేసిన పరిస్థితి. కానీ ఒక్క ఓటమి.. ఔను ఒకే ఒక్క ఓటమి కేసీఆర్ ను నిర్వీర్యుడిగా మార్చేసింది. ఆయన వ్యూహ రచన సంగతి పక్కన పెడితే.. అసలాయన రాజకీయంగా ఓనమాలు కూడా మరిచిపోయారా అన్న అనుమానాలు వ్యక్తమయ్యేలా చేసింది.  తెలంగాణలో రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి పది నెలలు కావస్తున్నది. ఈ పది నెలల కాలంలోనూ కేసీఆర్ వినిపించింది, కనిపించిందీ చాలా తక్కువ. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే సాహసం కూడా చేయలేదు. ఏదో మొక్కుబడికి అన్నట్లు ఒక్క రోజు మాత్రం అదీ రేవంత్ సర్కార్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజు హాజరయ్యారు. ఇన్ని నెలలూ ఆయన పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఇక బీఆర్ఎస్ వ్యవహారాలన్నీ ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చక్కబెడుతున్నారు. హరీష్ రావు పార్టీని రాజకీయంగా యాక్టివ్ గా ఉంచడానికీ, లేదా యాక్టివ్ గా ఉందని ప్రజలను నమ్మించడానికి  తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. 

హైడ్రా వివాదంతో ఇప్పుడు బీఆర్ఎస్ కు మంచి రోజులు వచ్చాయని ఆ పార్టీ శ్రేణులు సంబరపడుతున్నారు. అయితే ఇప్పుడు కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి బయటకు రాకపోతే అంది వచ్చిన అవకాశం కూడా చేజారిపోయే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ క్యాడర్ ఆందోళనలో ఉంది.  అయితే ఆయనను గట్టిగా అభిమానించేవారంతా మాత్రం ఆయన పెద్ద వ్యూహంలో ఉన్నారనీ, తెరవెనుక పార్టీ పటిష్టత కోసం  గట్టిగా పని చేస్తున్నారనీ అంటున్నారు. రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో పరిస్థితులను ఆయన ఎప్పటికప్పుడు తెలుగసుకుంటున్నారని అంటున్నారు.  అయితే పరిశీలకులు మాత్రం కేసీఆర్ రాజకీయంగా అస్త్రసన్యాసం చేసినట్లేని ఆయన మౌనాన్ని ఉటంకిస్తూ విశ్లేషణలు చేస్తున్నారు.  బీఆర్ఎస్ లో రెండు పెద్ద తలకాయల మధ్య విభేదాలు ఆ పార్టీని నిట్టనిలువుగా చీల్చే పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. 

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్, అలాగా పార్టీలో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు పొందిన మాజీ మంత్రి హరీష్ రావుల మధ్య ఆల్ ఈజ్ నాట్ వెల్ అని చెబుతున్నారు. హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా, మూసీ ఆక్రమణల కూల్చివేతలకు నిరసనగా ప్రజలలో పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలను పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా మలచుకునే విషయంలో కేటీఆర్, కేటీఆర్ లు ఒకరితో ఒకరు పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హరీష్ రావు క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమౌతూ ఉద్యమాలు నిర్మించడానికి సమాయత్తమౌతుంటే.. కేటీఆర్ సోషల్ మీడియాకు పరిమితమైపోవడం ఇదే సూచిస్తోందని అంటున్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం పాలైన నాటి నుంచీ హరీష్, కేటీఆర్ ల మధ్య ఆధిపత్య పోరు ప్రారంభమైందని, ఇందుకు అసెంబ్లీలో విపక్ష నేత ఎన్నిక ఏకగ్రీవం కాకపోవడాన్ని ఉదహరిస్తున్నారు. అందుకే గత్యంతరం లేని పరిస్థితుల్లో కేసీఆర్ ఆ పదవి చేపట్టారని అంటున్నారు.  

ఇప్పుడు కూడా కేసీఆర్ బయటకు వచ్చి పార్టీలో పరిస్థితిని చక్కదిద్దడానికి చర్యలు తీసుకోకుంటే బీఆర్ఎస్ లో చీలిక అనివార్యమౌతుందని పార్టీ వర్గాలే అంటున్నాయి.  కేసీఆర్ ప్రజాకర్షణ ఉన్న నేత అనడంలో ఎలాంటి సందేహం లేదు. అటువంటి నాయకుడు పార్టీ ఓటమి తరువాత ప్రజలకు కనిపించకుండా ముఖం చాటేయడమంటే.. తన పాలనలో తప్పులు జరిగాయనీ, ప్రజా హితంగా పాలన సాగించలేదనీ అంగీకరించడమే ఔతుందని.. సుదీర్ఘకాలంగా ఆయన ప్రజలతో  మమేకం కాకుండా ఫామ్ హౌస్ కు పరిమితం కావడం క్యాడర్ కు సైతం తప్పుడు సంకేతాలు ఇస్తున్నదనీ పార్టీ నేతలే అంటున్నారు.  ఇప్పటికైనా కేసీఆర్ మౌనం వీడి ప్రజలలోకి రాకుంటే ఆయన మౌనమే బీఆర్ఎస్ చీలికకు బీజం వేస్తుందని అంటున్నారు. 

By
en-us Political News

  
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
G.D. Naidu జీవితంలో నుంచి Millennials, Gen Z, Gen Alpha నేటి తరాలు ఏం నేర్చుకోవాలి? ఆయన Curiosity, Self-Learning, Innovation, Technology, Learning by Doing, Experimentation మరియు India కోసం కొత్తగా ఆలోచించే విధానం గురించి తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.