Publish Date:Mar 23, 2023
ప్రకృతి వైపరీత్యాల విషయంలో కూడా కేసీఆర్ కేంద్రంతో తగవుకే మొగ్గు చూపుతున్నారు. ఇటీవలి అకాల వర్షాలు, వడగండ్ల కారణంగా పంట నష్టం జరిగిన సంగతి తెలిసిందే. అయితే పంట నష్టం వివరాలను నివేదిక రూపంలో కేంద్రానికి పంపే ప్రశక్తే లేదని స్పష్టం చేశారు. కేంద్రానికి తెలంగాణ నుంచి దండుకోవడమే తప్ప తెలంగాణకు ఇవ్వడం తెలియదని అన్నారు.
గతంలో పంపిన నివేదికలకు సంబంధించిన పరిహారమే ఇప్పటి వరకూ కేంద్రం ఇవ్వలేదన్న కేసీఆర్.. ఈ సారి పంట నష్టం వివరాలను కేంద్రానికి పంపే ప్రశక్తే లేదనీ, రైతలను తమ ప్రభుత్వమే అన్ని విధాలుగా ఆదుకుంటుందని ప్రకటించారు. ఇటీవలి అకాల వర్షాలు, వడగండ్ల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో దెబ్బతిన్న పంటలను ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం (మార్చి 23) పరిశీలించారు. ఆ తరువాత విలేకరులతో మాట్లాడిన ఆయన పంట నష్టంపై కేంద్రానికి నివేదిక పంపే ప్రశక్తే లేదని స్పష్టం చేశారు.
గతంలో పంపిన వాటికే మోడీ సర్కార్ ఇంత వరకూ పరిహారం ఇవ్వలేదని కేసీఆర్ అన్నారు. బోనకల్లు, రామాపురం, రావినూతల ప్రాంతాలలో అకాల వర్షాలకు దెబ్బతిన్న దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కేసీఆర్ బాధిత రైతులతో మాట్లాడారు.
ఆ సందర్భంగా ఎకరాకు 50 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని రైతులు ఆయనకు విజ్ణప్తి చేశారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు మొత్తం 2,28,255 ఎకరాల్లో పంట దెబ్బతిందని సీఎం కేసీఆర్ చెప్పారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-says-wount-send-report-on-crop-loss-to-center-25-152835.html
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.